కంటెంట్‌కు వెళ్లు

మంచి ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారు?

మంచి ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారు?

బైబిలు ఇచ్చే జవాబు

 లైఫ్‌లో హ్యాపీగా ఉండాలన్నా, సక్సెస్‌ అవ్వాలన్నా మనకు ఫ్రెండ్స్‌ కావాలి. మంచి ఫ్రెండ్స్‌ ఉంటే మనలో ఉన్న మంచి లక్షణాలు బయటికి వస్తాయి. మనకు ఉన్న టాలెంట్స్‌ ఏంటో తెలుస్తాయి.—సామెతలు 27:17.

 అయితే, మనం ఫ్రెండ్స్‌ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిలు చెప్తుంది. మన ఫ్రెండ్స్‌ సరిగా లేకపోతే మనకు కష్టాలు తప్పవు. (సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33) అలాంటి ఫ్రెండ్స్‌ ఉండడంవల్ల మనం పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటాం. మనకు ఉన్న మంచి లక్షణాలు కూడా గాల్లో కలిసిపోతాయి.

ఈ ఆర్టికల్‌లో

 మంచి ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారు?

 బైబిలు ప్రకారం, మనలాంటి టేస్ట్‌లు ఉన్నవాళ్లను లేదా మనలాంటి హాబీలు ఉన్నవాళ్లను మంచి ఫ్రెండ్స్‌ అని అనుకోకూడదు. ఎందుకంటే, బైబిల్లో ఒకతను కీర్తన 119:63 లో ఇలా రాశాడు: “నీకు a భయపడే వాళ్లందరికీ, నీ ఆదేశాలు పాటించేవాళ్లకు నేను స్నేహితుణ్ణి.” దేవునికి నచ్చనిది చేయడానికి భయపడేవాళ్లను అలాగే దేవుడు చెప్పేవి చేసేవాళ్లను అతను ఫ్రెండ్స్‌ చేసుకున్నాడు.

 ఒక మంచి ఫ్రెండ్‌ అంటే ఎలా ఉండాలి? బైబిలు ఏం చెప్తుందో చూడండి.

  •   “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామెతలు 17:17.

  •   “ఒకరినొకరు నాశనం చేసుకోవాలని చూసే సహవాసులు ఉన్నారు, సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు కూడా ఉన్నాడు.”—సామెతలు 18:24.

 ఆ మాటల్నిబట్టి మంచి ఫ్రెండ్‌ అంటే నమ్మకస్థుడై ఉండాలి, ప్రేమ-దయ చూపించాలి, అతనికి పెద్ద మనసు ఉండాలి. మీరు సక్సెస్‌ అయినప్పుడే కాదు, మీరు ఫెయిల్‌ అయినప్పుడు కూడా మీ పక్కన ఉండేవాళ్లే నిజమైన ఫ్రెండ్స్‌. అలాగే మీరు తప్పటడుగులు వేసినా, వేయాలనుకున్నా మొట్టికాయ వేసే ధైర్యం ఉన్నవాళ్లే నిజమైన ఫ్రెండ్స్‌.—సామెతలు 27:6, 9.

 బైబిల్లో ఉన్న కొంతమంది మంచి ఫ్రెండ్స్‌

 వయసు, పుట్టిపెరిగిన పరిస్థితులు, సంస్కృతి, స్థాయి వీటికి సంబంధం లేకుండా మంచి ఫ్రెండ్స్‌ అయినవాళ్లు బైబిల్లో ఉన్నారు. అలాంటి మూడు స్నేహ బంధాల గురించి చూద్దాం.

  •   రూతు, నయోమి. రూతు, నయోమి అత్తాకోడళ్లు. వాళ్ల వయసులో కూడా చాలా తేడా ఉంది. పైగా, రూతు పుట్టిపెరిగిన పరిస్థితులు నయోమి కన్నా చాలా వేరుగా ఉన్నాయి. ఇన్ని తేడాలు ఉన్నాగానీ, వాళ్లు అత్తాకోడళ్లలా కాకుండా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు.—రూతు 1:16.

  •   దావీదు, యోనాతాను. వాళ్ల మధ్య దాదాపు 30 ఏళ్ల వయసు తేడా ఉంది. అయినాగానీ వాళ్లిద్దరు “దగ్గరి స్నేహితులయ్యారు” అని బైబిలు చెప్తుంది.—1 సమూయేలు 18:1.

  •   యేసు, ఆయన అపొస్తలులు. యేసు ఒక బోధకుడు, ప్రభువు. కాబట్టి అపొస్తలులు కన్నా పై స్థానంలో ఉన్నాడు. (యోహాను 13:13) అలాగని వాళ్లని ఫ్రెండ్స్‌గా చేసుకోకూడదు అనుకోలేదు. ఆయన బోధ వినేవాళ్లందరికీ ఆయన క్లోజ్‌గా ఉండేవాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు: “నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను, ఎందుకంటే నా తండ్రి దగ్గర విన్న వాటన్నిటినీ నేను మీకు తెలియజేశాను.”—యోహాను 15:14, 15.

 దేవునికి ఫ్రెండ్‌ అవ్వొచ్చా?

 అవ్వొచ్చు. బైబిలు ఇలా చెప్తుంది: “నిజాయితీపరులకు ఆయన దగ్గరి స్నేహితుడు.” (సామెతలు 3:32) మరో మాటలో చెప్పాలంటే ఎవరైతే పద్ధతిగా, నిజాయితీగా, మర్యాదగా ఉంటారో, తప్పొప్పుల విషయంలో ఆయన చెప్పేది వింటారో వాళ్లందర్నీ దేవుడు తన స్నేహితులుగా చేసుకుంటాడు. ఉదాహరణకు, బైబిల్లో అబ్రాహాము అనే వ్యక్తిని దేవుడు నా స్నేహితుడు అని పిలిచాడు.—2 దినవృత్తాంతాలు 20:7; యెషయా 41:8; యాకోబు 2:23.

a ఈ కీర్తనలో ఉన్న సందర్భాన్ని బట్టి, ఈ వచనంలో “నీకు” అన్న పదం దేవున్ని సూచిస్తుంది.