కంటెంట్‌కు వెళ్లు

బైబిల్ని నిజంగా ఎవరు రాశారు?

బైబిల్ని నిజంగా ఎవరు రాశారు?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిల్ని ఎవరు రాశారో ఖచ్చితంగా చెప్పలేమని చాలామంది అనడం మనం వింటుంటాం. కానీ, దాన్ని రాసింది ఎవరో బైబిలు స్పష్టంగా చెబుతుంది. ఉదాహరణకు, బైబిల్లో కొన్ని పుస్తకాలు ఇలా మొదలౌతాయి, ‘నెహెమ్యా యొక్క మాటలు,’ “యెషయాకు కలిగిన దర్శనము,” “యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.”—నెహెమ్యా 1:1; యెషయా 1:1; యోవేలు 1:1.

 ఏకైక సత్య దేవుడైన యెహోవాకు ప్రతినిధులముగా ఆయన చెప్పింది రాశామని చాలామంది రచయితలు ఒప్పుకున్నారు. హీబ్రూ లేఖనాలను రాసిన ప్రవక్తలు దాదాపు 300 కన్నా ఎక్కువసార్లు “యెహోవా సెలవిచ్చునదేమనగా” అని అన్నారు. (ఆమోసు 1:3; మీకా 2:3; నహూము 1:12) ఇంకొంతమంది రచయితలు దేవదూతల ద్వారా దేవుని సందేశాల్ని పొందారు.—జెకర్యా 1:7, 9.

 బైబిల్ని రాయడానికి దాదాపు 1,600 సంవత్సరాలు పట్టింది. దాన్ని 40 మంది రాశారు. కొంతమంది ఒకటి కన్నా ఎక్కువ పుస్తకాల్ని రాశారు. నిజానికి, బైబిలు 66 పుస్తకాలు ఉన్న చిన్న గ్రంథాలయం. అందులో పాత నిబంధన అని పిలిచే హీబ్రూ లేఖనాల్లో 39 పుస్తకాలు, కొత్త నిబంధన అని పిలిచే గ్రీకు లేఖనాల్లో 27 పుస్తకాలు ఉన్నాయి.