కంటెంట్‌కు వెళ్లు

బైబిలు తెల్ల జాతి వాళ్ల పుస్తకమా?

బైబిలు తెల్ల జాతి వాళ్ల పుస్తకమా?

బైబిలు ఇచ్చే జవాబు

బైబిల్ని ఐరోపా వాళ్లు రాయలేదు. బైబిల్ని రాయడానికి దేవుడు ఉపయోగించుకున్న వాళ్లందరూ ఆసియా వాళ్లే. ఒక జాతి ప్రజలు గొప్ప వాళ్లు మిగతావాళ్లు తక్కువవాళ్లు అని బైబిలు అస్సలు చెప్పదు. నిజానికి, బైబిల్లో ఇలా ఉంది, ‘దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.’—అపొస్తలుల కార్యములు 10:34, 35.