కంటెంట్‌కు వెళ్లు

నేను వేటి కోసం ప్రార్థించవచ్చు?

నేను వేటి కోసం ప్రార్థించవచ్చు?

బైబిలు ఇచ్చే జవాబు

బైబిల్లోని, దేవునికి అంగీకారమైన విషయాలకు అనుగుణంగా ఉండే దేని గురించైనా మనం ప్రార్థించవచ్చు. “ఆయన [దేవుని] చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును.” (1 యోహాను 5:14) అయితే, మీరు చింతించే విషయాల గురించి మీరు ప్రార్థించవచ్చా? ప్రార్థించవచ్చు. “ఆయన [దేవుని] సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి” అని బైబిలు చెబుతుంది.—కీర్తన 62:8

వేటి కోసం ప్రార్థించవచ్చు? కొన్ని ఉదాహరణలు . . .

  • దేవుని మీద విశ్వాసం కోసం.—లూకా 17:5.

  • మీరు సరైనది చేయడానికి సహాయం చేసే పరిశుద్ధాత్మ లేదా దేవుని చురుకైన శక్తి కోసం.—లూకా 11:13.

  • సమస్యలను ఎదుర్కోవడానికి, ప్రలోభాలను అడ్డుకోవడానికి కావాల్సిన బలం కోసం.—ఫిలిప్పీయులు 4:13.

  • మనశ్శాంతి, ప్రశాంతత కోసం.—ఫిలిప్పీయులు 4:6, 7.

  • మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన తెలివి కోసం.—యాకోబు 1:5.

  • రోజువారీ అవసరాల కోసం.—మత్తయి 6:11.

  • పాపక్షమాపణ కోసం.—మత్తయి 6:12.