కంటెంట్‌కు వెళ్లు

దేవుడు కొన్ని ప్రార్థనలు ఎందుకు వినడు?

దేవుడు కొన్ని ప్రార్థనలు ఎందుకు వినడు?

బైబిలు ఇచ్చే జవాబు

 దేవుడు కొన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ఒక వ్యక్తి చేసే ప్రార్థనను దేవుడు పట్టించుకోకపోవడానికి గల రెండు కారణాలు ఏమిటో చూద్దాం.

1. ఆ ప్రార్థన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండడం

 దేవుని చిత్తమేమిటో, ఆయన అంగీకరించేవి ఏమిటో బైబిలు చెప్తుంది, వాటికి వ్యతిరేకంగా చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. (1 యోహాను 5:14) ఉదాహరణకు, మనకు అత్యాశ ఉండకూడదని బైబిలు చెప్తుంది. అయితే, జూదం మనలో అత్యాశను పెంచుతుంది. (1 కొరింథీయులు 6:9, 10) కాబట్టి, మీకు లాటరీ తగలాలని ప్రార్థిస్తే దేవుడు మీ ప్రార్థనకు జవాబివ్వడు. మనం అడిగిందల్లా ఇవ్వడానికి, దేవుడు అద్భుత దీపంలో నుండి వచ్చే భూతం కాదు. నిజానికి, దేవుడు కోరిందల్లా తీర్చనందుకు మీరు సంతోషించాలి. లేకపోతే, పక్కవాళ్లు దేవుణ్ణి ఏమి కోరుకుంటారోనని మీరు భయపడాల్సి వస్తుంది.—యాకోబు 4:3.

2. ప్రార్థించే వ్యక్తికి తిరుగుబాటు స్వభావం ఉండడం

 తమ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి బాధపెట్టే వాళ్ల ప్రార్థనలు దేవుడు వినడు. ఉదాహరణకు, దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ, ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించినవాళ్లతో దేవుడు ఇలా చెప్పాడు: “మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి.” (యెషయా 1:15) ఒకవేవ వాళ్లు తమ పద్ధతులు మార్చుకుని, దేవునితో సమాధానపడి ఉంటే వాళ్ల ప్రార్థనలు దేవుడు వినివుండేవాడు.—యెషయా 1:18.