కంటెంట్‌కు వెళ్లు

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?

బైబిలు ఇచ్చే జవాబు

చేస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న సేవకుల పట్ల దేవుడు శ్రద్ధ చూపిస్తాడు. ఓ నమ్మకమైన సేవకుని గురించి బైబిలు ఇలా చెప్తుంది: “రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును.” (కీర్తన 41:3) మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే దానిని తట్టుకోవడానికి ఈ కింది మూడు విషయాలు మీకు చక్కగా సహాయం చేస్తాయి:

  1. ఓర్చుకోవడానికి శక్తిని ఇవ్వమని ప్రార్థించండి. అప్పుడు ‘సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానాన్ని’ మీరు పొందుతారు. అది మీ ఆందోళనను తగ్గించి, బాధను తట్టుకుని జీవించేలా చేస్తుంది.—ఫిలిప్పీయులు 4:6, 7.

  2. నిరాశ పడకండి. బైబిలు ఇలా చెప్తుంది: “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.” (సామెతలు 17:22) ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండండి, దానివల్ల బాధలు దూరమైపోవడమే కాదు ఆరోగ్యం కూడా మెరుగౌతుంది.

  3. భవిష్యత్తుపై మీ నమ్మకాన్ని బలపర్చుకోండి. భవిష్యత్తు మీద మీకు గట్టి నమ్మకం ఉంటే, ఎంత పెద్ద రోగమున్నా సంతోషంగా ఉంటారు. (రోమీయులు 12:12) త్వరలో ఒక కాలం రాబోతుందని, అప్పుడు “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు” అని బైబిలు చెప్తుంది. (యెషయా 33:24) అప్పుడు దేవుడు, నేటి సైన్సుకు కూడా అంతుబట్టని పెద్దపెద్ద రోగాల్ని సైతం నయం చేస్తాడు. ఉదాహరణకు, వృద్ధులు యౌవనులౌతారని, ఆరోగ్యంగా తయారౌతారని చెప్తూ బైబిలు ఇలా అంటోంది: “అప్పుడు వాని మాంసము బాలుర మాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.”—యోబు 33:25.

గమనిక: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, యెహోవాసాక్షులు దేవుని సహాయం మీద ఆధారపడుతూనే, వైద్యం కూడా చేయించుకుంటారు. (మార్కు 2:17) అయితే, ఏదైనా ఓ ప్రత్యేక వైద్య విధానాన్ని మేము సిఫారసు చేయడం లేదు; ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకోవాలని మేము భావిస్తున్నాం.