కంటెంట్‌కు వెళ్లు

దయ్యాలు నిజంగా ఉన్నాయా?

దయ్యాలు నిజంగా ఉన్నాయా?

బైబిలు ఇచ్చే జవాబు

 ఉన్నాయి. ‘పాపం చేసిన దేవదూతలే’ దయ్యాలు. వీళ్లు దేవుని మీద తిరుగుబాటు చేసిన అదృశ్యప్రాణులు. (2 పేతురు 2:4) దేవుని మీద తిరుగుబాటు చేసి దయ్యంగా మారిన మొదటి దేవదూత అపవాదైన సాతాను. బైబిలు అతన్ని “దయ్యములకు అధిపతి” అని పిలుస్తోంది.—మత్తయి 12:24, 26.

నోవహు కాలంలో తిరుగుబాటు

 నోవహు కాలంలో జలప్రవయం రావడానికి ముందు, దేవదూతలు చేసిన తిరుగుబాటు గురించి బైబిలు ఇలా చెప్తుంది: “దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.” (ఆదికాండము 6:2) ఆ దుష్టదూతలు లేదా దిగజారిన దూతలు పరలోకంలోని “తమ నివాసస్థలమును విడిచి,” స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి మానవ శరీరాలను ధరించారు.—యూదా 6.

 అయితే జలప్రవయం వచ్చినప్పుడు తిరుగుబాటుదారులైన ఈ దేవదూతలు తమ మానవ శరీరాలను విడిచిపెట్టి పరలోకానికి వెళ్లిపోయారు. కానీ దేవుడు వాళ్లను తన కుటుంబంలోకి మళ్లీ చేర్చుకోలేదు. అంతేకాదు ఆ దయ్యాలు ఇక ఎన్నడూ మానవ శరీరాలు ధరించుకునే అవకాశం లేకుండా వాళ్లకు శిక్ష విధించాడు.—ఎఫెసీయులు 6:11, 12.