కంటెంట్‌కు వెళ్లు

డైనోసార్ల గురించి బైబిలు ఏమి చెప్తుంది?

డైనోసార్ల గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

బైబిలు డైనోసార్ల గురించి సూటిగా ఏమి చెప్పట్లేదు. అయితే ‘అన్నిటినీ సృష్టించిన’ ఘనత దేవునికే చెందుతుందని బైబిలు చెప్తుంది. కాబట్టి ఆయన సృష్టించినవాటిలో డైనోసార్లు కూడా ఉన్నాయని స్పష్టమౌతుంది. * (ప్రకటన 4:11) బైబిలు డైనోసార్ల గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా రకరకాల ప్రాణుల గురించి మాట్లాడుతుంది, బహుశా వాటిలో ఇవి కూడా ఉండొచ్చు:

డైనోసార్లు ఇతర జంతువుల నుండి పరిణామం చెందాయా?

ఇవి క్రమక్రమంగా ఉనికిలోకి రాలేదుగానీ, అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చాయని శిలాజాల వివరాలు చూపిస్తున్నాయి. దేవుడే అన్ని జంతువుల్ని సృష్టించాడని బైబిలు చెప్తున్నదానికి ఇది అనుగుణంగా ఉంది. ఉదాహరణకు, దేవుడే “ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు” అని కీర్తన 146:6 చెప్తుంది.

డైనోసార్లు ఎప్పుడు జీవించాయి?

దేవుడు సృష్టిని చేయడం మొదలుపెట్టిన ఐదో రోజున, ఆరో రోజున సముద్ర జంతువులను అలాగే నేల మీద నివసించే జంతువులను చేశాడని బైబిలు చెప్తుంది. * (ఆదికాండము 1:20-25, 31) కాబట్టి ఎన్నో సంవత్సరాలకు ముందు నుండే డైనోసార్లు ఉనికిలో ఉన్నాయని బైబిలు చెప్తుంది.

బెహీమోత్‌, లెవైయాతస్‌ జంతువులే డైనోసార్లా?

కాదు. ఎందుకంటే యోబు పుస్తకంలో ఈ జంతువుల ప్రస్తావన వచ్చినప్పటికీ అవి ఖచ్చితంగా ఏంటి అనేది చెప్పలేం. సాధారణంగా, బెహీమోత్‌ అంటే నీటిగుర్రమని, లెవైయాతన్‌ అంటే మొసలి అని గుర్తించబడ్డాయి. అవి వాటినే సూచిస్తున్నాయని లేఖనాల్లో ఉన్న వివరణ బట్టి కూడా తెలుస్తుంది. (యోబు 40:15-23; 41:1, 14-17, 31) కాబట్టి “బెహీమోత్‌,” “లెవైయాతన్‌” అనే పదాలు డైనోసార్లను సూచిస్తాయని ఏ విధంగానూ చెప్పలేం. నిజానికి, ఆ జంతువుల్ని చూసి నేర్చుకోమని దేవుడు యోబుకు చెప్పాడు. అంతేకాదు యోబు జీవించే సమయానికి డైనోసార్లు అంతరించి అప్పటికే చాలా ఏళ్లు గడిచిపోయాయి.—యోబు 40:16; 41:8.

మరైతే డైనోసార్లకు ఏమి జరిగింది?

డైనోసార్లు అంతరించిపోవడం గురించి బైబిలు ఏమి చెప్పట్లేదు కానీ, సమస్తం దేవుని “ఇష్టాన్ని బట్టే” సృష్టించబడ్డాయని చెప్తుంది. కాబట్టి డైనోసార్లను సృష్టించడంలో దేవునికి ఒక సంకల్పం ఉండివుంటుంది. (ప్రకటన 4:11) అయితే ఆ సంకల్పం నెరవేరగానే అవి అంతరించిపోవడానికి దేవుడు అనుమతించాడు.

^ పేరా 3 డైనోసార్లు ఈ భూమ్మీద జీవించాయని శిలాజాల వివరాలు నిరూపిస్తున్నాయి. అంతేకాదు కొంతకాలం వరకు డైనోసార్లు ఎక్కువ సంఖ్యలో ఉండేవనీ, అవి వేర్వేరు ఆకారాల్లో వేర్వేరు పరిమాణాల్లో ఉండేవని ఆ వివరాలు చెప్తున్నాయి.

^ పేరా 10 బైబిల్లో “రోజు” అనే పదం వెయ్యి సంవత్సరాల కాలనిడివిని సూచించవచ్చు.—ఆదికాండము 1:31; 2:1-4; హెబ్రీయులు 4:4, 11.