కంటెంట్‌కు వెళ్లు

క్రైస్తవ దంపతులు గర్భనిరోధకాలు వాడవచ్చా?

క్రైస్తవ దంపతులు గర్భనిరోధకాలు వాడవచ్చా?

బైబిలు ఇచ్చే జవాబు

తన శిష్యులకు పిల్లలు ఉండాలా వద్దా అని యేసుక్రీస్తు ఎప్పుడూ చెప్పలేదు. దాని గురించి యేసు శిష్యులు కూడా ఎలాంటి నిర్దేశం ఇవ్వలేదు. కుటుంబ నియంత్రణ గురించి బైబిలు సూటిగా ఏమి చెప్పలేదు. ఈ విషయం గురించి రోమీయులు 14:11లో ఒక సూత్రం ఉంది, ‘మనలో ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పాల్సివస్తుంది.’

పిల్లలు కావాలా వద్దా అనేది దంపతుల సొంత విషయం. ఒకవేళ కావాలనుకుంటే ఎంతమంది, ఎప్పుడు అనేది కూడా వాళ్ల నిర్ణయమే. కానీ వద్దనుకుంటే ఎలాంటి గర్భనిరోధకాలు వాడాలనుకుంటారో అది వాళ్ల సొంత విషయం, దానికి వాళ్లదే పూర్తి బాధ్యత. వాళ్లను ఎవరూ తప్పుపట్టకూడదు.—రోమీయులు 14:4, 10-13.