కంటెంట్‌కు వెళ్లు

కయీను ఎవర్ని పెళ్లిచేసుకున్నాడు?

కయీను ఎవర్ని పెళ్లిచేసుకున్నాడు?

బైబిలు ఇచ్చే జవాబు

మొదటి మానవ దంపతులకు పుట్టిన మొదటి బిడ్డ పేరు కయీను. అతను తన చెల్లినో, దగ్గరి బంధువునో పెళ్లి చేసుకున్నాడు. కయీను గురించి, అతని కుటుంబం గురించి బైబిల్లో ఉన్న వివరాల్నిబట్టి అలా చెప్పవచ్చు.

కయీను, అతని కుటుంబం గురించిన వాస్తవాలు

  • మనుషులందరూ ఆదాము, హవ్వ నుండి వచ్చినవాళ్లే. దేవుడు, ‘భూమంతటి మీద జీవించడానికి ఒకే ఒక్క మనిషి [ఆదాము] నుండి అన్ని దేశాల మనుషుల్ని చేశాడు.’ (అపొస్తలుల కార్యాలు 17:26) ఆదాము భార్య హవ్వ, ‘జీవించే ప్రతీ ఒక్కరికి తల్లి’ అయ్యింది. (ఆదికాండము 3:20) కాబట్టి, ఆదాముహవ్వలకు పుట్టిన పిల్లల్లో ఒకరినే కయీను పెళ్లిచేసుకొని ఉంటాడు.

  • హవ్వకు పుట్టిన మొదటి పిల్లలు ఎవరంటే కయీను, అతని తమ్ముడైన హేబెలు. (ఆదికాండము 4:​1, 2) కయీను తన తమ్ముణ్ణి చంపినందుకు దేవుడు అతన్ని ఆ ప్రాంతం నుండి వెళ్లగొట్టాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, “నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపును.” (ఆదికాండము 4:​14) కయీను ఎవరికి భయపడ్డాడు? ఆదాము, “కుమారులను కుమార్తెలను కనెను” అని బైబిలు చెప్తోంది. (ఆదికాండము 5:4) దీన్నిబట్టి, ఆదాముహవ్వలకు పుట్టిన మిగతా పిల్లల వల్ల తనకు హాని జరుగుతుందేమోనని కయీను భయపడివుంటాడు.

  • మానవ చరిత్ర ఆరంభంలో, బంధువుల్ని పెళ్లి చేసుకోవడం మామూలే. దేవునికి నమ్మకంగా జీవించిన అబ్రాహాము, తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ఆమె సొంత చెల్లి కాదు. (ఆదికాండము 20:12) కయీను చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాయబడిన మోషే ధర్మశాస్త్రంలో, అలాంటి పెళ్లిళ్లు చేసుకోకూడదనే నియమం మొదటిసారి ఇవ్వబడింది. (లేవీయకాండము 18:9, 12, 13) మనకాలంలో దగ్గరి బంధువుల్ని పెళ్లిచేసుకున్న వాళ్లకు పుట్టే పిల్లలు ఏదోక లోపంతో పుడుతున్నారు. బహుశా అప్పట్లో అలా జరిగివుండకపోవచ్చు.

  • ఆదాముహవ్వలు, వాళ్ల కుటుంబం గురించిన వృత్తాంతం చారిత్రాత్మకంగా ఖచ్చితమైనదని బైబిలు చెప్తోంది. ఆదాము వంశావళి గురించిన స్పష్టమైన వివరాలు మోషే రాసిన ఆదికాండము పుస్తకంలోనే కాకుండా చరిత్రకారులైన ఎజ్రా, లూకా రాసిన పుస్తకాల్లో కూడా ఉంది. (ఆదికాండము 5:3-5; 1 దినవృత్తాంతములు 1:1-4; లూకా 3:38) బైబిలు రచయితలు కయీను వృత్తాంతాన్ని నిజంగా జరిగిన సంఘటనగా రాశారు.—హెబ్రీయులు 11:4; యోహాను 3:12; యూదా 11.