కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

అబార్షన్‌ గురించి బైబిలు ఏమి చెబుతుంది?

అబార్షన్‌ గురించి బైబిలు ఏమి చెబుతుంది?

బైబిలు ఇచ్చే జవాబు

దేవునికి ప్రాణం ఎంతో పవిత్రమైంది. ఆఖరికి గర్భంలో ఉన్న పిండాన్ని కూడా ఆయన ఎంతో అమూల్యంగా, ఓ ఎదిగిన వ్యక్తితో సమానంగా చూస్తాడు. దావీదు రాజు దేవుని గురించి ఇలా రాశాడు: “నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను.” (కీర్తన 139:16) కడుపులో ఉన్న పిండానికి ఏమైనా హాని కలిగిస్తే తన దృష్టిలో హత్య చేసినట్లేనని దేవుడు చెప్తున్నాడు.—నిర్గమకాండము 20:13; 21:22, 23-25.

ఒకవేళ ప్రసవించే సమయంలో తల్లీబిడ్డల్లో ఒకరిని మాత్రమే కాపాడగలమనే అత్యవసర పరిస్థితి వస్తే అప్పుడేమిటి? అలాంటి సమయంలో ఎవరిని కాపాడాలనేది దంపతులే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.