కంటెంట్‌కు వెళ్లు

అగ్నిగుండం అంటే ఏమిటి? ఇది కూడా పాతాళం లేదా గెహెన్నాలాంటిదేనా?

అగ్నిగుండం అంటే ఏమిటి? ఇది కూడా పాతాళం లేదా గెహెన్నాలాంటిదేనా?

బైబిలు ఇచ్చే జవాబు

అగ్నిగుండం నిత్య నాశనానికి సూచనగా ఉంది. ఇది గెహెన్నా లాంటిదే. కానీ అగ్నిగుండానికి పాతాళానికి తేడా ఉంది. పాతాళం అంటే సాధారణంగా చనిపోయిన మనుషులను పెట్టే సమాధి.

నిజంగా అగ్నిగుండం కాదు

‘అగ్నిగుండం’ గురించి మాట్లాడుతున్న ఐదు బైబిలు లేఖనాల్లో ఈ పదాన్ని సూచనార్థకంగా ఉపయోగించారేగానీ, అది నిజమైన అగ్నిగుండం అని చెప్పలేదు. (ప్రకటన 19:20; 20:10, 14, 15; 21:8) ఈ కింద చెప్పినవాటిని అగ్నిగుండంలో పడేస్తారు:

నిత్య నాశనానికి సూచన

అగ్నిగుండం అంటే “రెండవ మరణము” అని బైబిలు చెప్తుంది. (ప్రకటన 20:14; 21:8) బైబిల్లో చెప్తున్న మొదటి మరణం ఆదాము చేసిన పాపం నుండి వచ్చింది. అయితే దేవుడు చనిపోయినవాళ్లను పునరుత్థానం ద్వారా తిరిగి బ్రతికించడమే కాదు, ఇక మరణం అనేదే లేకుండా చేయబోతున్నాడు.—1 కొరింథీయులు 15:21, 22, 26.

సూచనార్థకమైన అగ్నిగుండం నుండి విడుదల లేదు.

అగ్నిగుండం రెండవ మరణం లేదా వేరొక దాన్ని సూచిస్తుంది. ఇది కూడా ఏమి చేయలేని ఒక స్థితే అయినప్పటికీ, ఇది మొదటి మరణం లాంటిది కాదు. ఎందుకంటే రెండవ మరణంలో పునరుత్థానం లేదని బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, “మరణముయొక్కయు పాతావలోకము యొక్కయు తావపుచెవులు” యేసు దగ్గర ఉన్నాయని బైబిలు చెప్తుంది. అంటే ఆదాము పాపం ద్వారా వచ్చిన మరణం నుండి ప్రజలను విడిపించే అధికారం యేసుకు ఉందని ఇది చూపిస్తుంది. (ప్రకటన 1:18; 20:13, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) అయితే యేసు దగ్గర గానీ లేదా వేరొకరి దగ్గర గానీ అగ్నిగుండపు తావపుచెవి లేదు. ఈ సూచనార్థకమైన అగ్నిగుండం నిత్య నాశనం రూపంలో అనుభవించే, నిత్య శిక్షను సూచిస్తుంది.—2 థెస్సలొనీకయులు 1:9.

హిన్నోము లోయ, గెహెన్నాలాంటిదే.

గెహెన్నా (గ్రీకు గెఅన్‌నా) గురించి నూతనలోక అనువాదం ఇంగ్లీషు బైబిల్లో 12సార్లు ఉంది. అగ్నిగుండం లాగే ఇది కూడా నిత్య నాశనానికి గుర్తు. అయితే కొన్ని అనువాదాల్లో ఈ పదాన్ని “పాతాళం” అని అనువదించారు. కాని గెహెన్నాకు పాతాళానికి తేడా ఉంది (హీబ్రూలో షియోల్‌ , గ్రీకులో హేడిస్‌).

హిన్నోము లోయ

“గెహెన్నా” అంటే “హిన్నోము లోయ” అని అర్థం. ఇది యెరూషలేముకు బయట ఉన్న ఒక లోయను సూచిస్తుంది. బైబిలు కాలాల్లో, ఆ పట్టణంలోని వాళ్లు చెత్తాచెదారాలను ఆ లోయలో పడేసేవాళ్లు. ఆ లోయలో వ్యర్థమైనవాటిని ఎప్పుడూ కాల్చుతూనే ఉండేవాళ్లు. మంటలు తగిలి కాలని వాటిని పురుగులు తింటూ ఉండేవి.

యేసు నిత్య నాశనానికి గుర్తుగా గెహెన్నాను ఉపయోగించాడు. (మత్తయి 23:33) ఆయన గెహెన్నాలో “పురుగు చావదు అగ్ని ఆరదు” అని చెప్పాడు. (మార్కు 9:47, 48) ఈ మాట చెప్పినప్పుడు హిన్నోము లోయలోని పరిస్థితుల్ని, “వారు పోయి నామీద తిరుగుబాటుచేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును” అని యెషయా 66:24లో ఉన్న ప్రవచనాన్ని సూచిస్తూ ఆయన దాన్ని చెప్పాడు. యేసు చెప్పిన ఉదాహరణ హింసిస్తూ ఉండడాన్ని కాదు, పూర్తిగా నాశనం చేయడాన్ని సూచిస్తుంది. పురుగులు, అగ్ని కళేబరాలను లేదా శవాలను పాడుచేస్తాయి కాని జీవిస్తున్న ప్రజలను కాదు.

గెహెన్నా నుండి తిరిగి రావడం గురించి బైబిలు ఎక్కడా చెప్పడం లేదు. “అగ్నిగుండం”, “నరకాగ్ని” రెండూ శాశ్వతమైన నిత్యనాశనాన్ని సూచిస్తున్నాయి.—ప్రకటన 20:14, 15; 21:8; మత్తయి 18:9.

ఎలా “యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు”?

అగ్నిగుండం నాశనానికి సూచనైతే, మరి బైబిలు ఎందుకు దానిలో అపవాది, క్రూరమృగము, అబద్ధప్రవక్త “యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు” అని చెప్తుంది. (ప్రకటన 20:10) ఇక్కడ చెప్తున్న బాధించడం నిజంగా హింసించడం కాదు అనడానికి నాలుగు కారణాలను గమనించండి:

  1. అపవాదిని నిత్యం హింసించాలంటే, అతడు ఎప్పటికీ చనిపోకూడదు. కాని అతడు నశిస్తాడని బైబిలు చెప్తుంది. —హెబ్రీయులు 2:14.

  2. నిత్యజీవితం దేవుడు ఇచ్చిన బహుమతే కాని శిక్ష కాదు. —రోమీయులు 6:23.

  3. క్రూరమృగం, అబద్ధప్రవక్త సూచనార్థకమైనవి, కాబట్టి నిజంగా హింసను అనుభవించలేరు.

  4. బైబిలు ఈ సందర్భంలో అపవాదిని హింసించడం అంటే నిత్యము నిర్బంధించడాన్ని లేదా నిత్యనాశనాన్ని సూచిస్తుంది.

బైబిల్లో “బాధించడం” అనే పదాన్ని “నిర్బంధంలో ఉంచే స్థితి” అనే భావంలో కూడ ఉపయోగించారు. ఉదాహరణకు, మత్తయి 18:34లో ఉన్న “బాధపరచువారు” అనే గ్రీకు పదాన్ని చాలా అనువాదాల్లో “జైలు అధికారులుగా” అనువదించారు. ఇలా అనువదించడం ద్వారా “బాధించడం”, “నిర్భంధించడం” అనే పదాలకు సంబంధం ఉందని చూపించారు. అలాగే, మత్తయి 8:29, లూకా 8:30, 31లోని సందర్భాలను పక్కపక్కన పెట్టి చూస్తే, “బాధించడం” ‘పాతాళంతో’ సమానమని చూడగలుగుతాం. పాతాళం అంటే ఏమి చేయలేని స్థితి లేదా మరణం లాంటి సూచనార్థకమైన స్థలం. (రోమీయులు 10:7; ప్రకటన 20:1, 3) నిజానికి, ప్రకటన పుస్తకం చాలాసార్లు “బాధించడం” అనే పదాన్ని సూచనార్థక భావంలో ఉపయోగించింది.—ప్రకటన 9:5; 11:10; 18:7, 10.