కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

బ్రేకప్‌ వల్ల కలిగే బాధను నేనెలా తట్టుకోవచ్చు?

బ్రేకప్‌ వల్ల కలిగే బాధను నేనెలా తట్టుకోవచ్చు?

 “నేను నా గల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అయ్యాక బాగా కుమిలిపోయాను. దాని మాటల్లో చెప్పలేను. అప్పుడు అనుభవించినంత మానసిక వేదన నా జీవితంలో అంతకుముందెప్పుడూ అనుభవించలేదు” అని స్టీవెన్‌ చెప్తున్నాడు.

 మీరు కూడా అలాంటి బాధను ఎప్పుడైనా అనుభవించారా? అనుభవించివుంటే ఈ ఆర్టికల్‌ మీకోసమే.

 ఎలా అనిపిస్తుంది?

 బ్రేకప్‌ అయినప్పుడు అబ్బాయి, అమ్మాయి ఇద్దరి మనసులు బాధపడతాయి.

 •   ఒకవేళ బ్రేకప్‌ అవ్వాలనే ఆలోచన ముందు మీకు వచ్చివుంటే, జాస్మిన్‌లాగే మీకూ అనిపించివుంటుంది. ఆమె ఏమంటుందంటే, “నేను ఇష్టపడ్డ వ్యక్తిని బాధపెట్టినందుకు నా మనస్సాక్షి నన్ను వేధించింది. జీవితంలో ఇంకోసారి అలాంటి బాధను అనుభవించాలని అనుకోవట్లేదు.”

 •   ఒకవేళ ఆ ఆలోచన మీది కాకపోతే, మీరు చాలా బాధపడి ఉంటారు. సాధారణంగా ఇలా జరిగినప్పుడు, ఇష్టమైనవాళ్లు చనిపోయినంత బాధగా అనిపిస్తుందని కొంతమంది అంటారు. జానెట్‌​ అనే యువతి అలాంటి బాధనే అనుభవించింది. ఆమె ఇలా చెప్తుంది, “నేను చాలా బాధపడ్డాను. మేము విడిపోయామనే ఆలోచనను జీర్ణించుకోలేకపోయాను, కోపమొచ్చింది, కలిసుందామని బ్రతిమలాడాను, డిప్రెస్‌​ అయ్యాను, చివరికి, అంటే దాదాపు సంవత్సరం అయ్యాక మామూలు మనిషయ్యాను.”

 ఒక్క మాటలో: బ్రేకప్‌ మీ మనసును చాలా గాయపరుస్తుంది, జీవితం శూన్యంలా అనిపిస్తుంది. ఒక బైబిలు రచయిత కూడా ఇలా అన్నాడు, ‘నలిగిన మనస్సు ఒంట్లోని శక్తినంతా లాగేస్తుంది.’—సామెతలు 17:22, NW.

 మీరేమి చేయవచ్చు?​

 •  మీరు నమ్మే పెద్దవాళ్లలో ఎవరితోనైనా మాట్లాడండి. బైబిలు ఇలా చెప్తోంది: ‘నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను నీకు సోదరుడిలా ఉంటాడు.’ (సామెతలు 17:17, NW) మీ మనసులోని భావాల్ని అమ్మానాన్నలతో లేదా బాగా ఆలోచించగలిగే స్నేహితులతో పంచుకుంటే విషయాన్ని సరిగ్గా అర్థంచేసుకోవడానికి వాళ్లు మీకు సహాయం చేస్తారు.

   “కొన్ని నెలలపాటు ఎవర్నీ కలవలేదు, బాధను నాలోనే దాచుకున్నాను. కానీ అలాంటి బాధ నుండి తేరుకోవడానికి స్నేహితులు సహాయం చేయగలుగుతారు. వాళ్లతో నా బాధను పంచుకున్న తర్వాత మనసు కాస్త తేలికైంది.”—జానెట్‌​.

 •  జరిగిన దాన్నుండి పాఠం నేర్చుకోండి. బైబిల్లో ఒక సామెత ఉంది, అదేంటంటే, ‘జ్ఞానము సంపాదించు, బుద్ధి సంపాదించు.’ (సామెతలు 4:5) మనల్ని మనం అర్థంచేసుకోవడానికి, అనుకున్నది జరగనప్పుడు ఎలా స్పందిస్తామో తెలుసుకోవడానికి ఇలాంటి చేదు అనుభవాలు సహాయం చేస్తాయి.

   “బ్రేకప్‌ తర్వాత, ఒక ఫ్రెండ్‌ నన్ను ‘జరిగిన దాన్నుండి ఏమి నేర్చుకున్నావు? ఈ అనుభవాన్ని బట్టి, ఈసారి మళ్లీ ఎవరితోనైనా డేటింగ్‌ చేసినప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నావు?’ అని అడిగాడు.”—స్టీవెన్‌.

 •  ప్రార్థన చేసుకోండి. బైబిలు ఇలా చెప్తోంది, ‘నీ భారం యెహోవామీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు.’ (కీర్తన 55:22) బాధ నుండి బయటపడడానికి, బ్రేకప్‌ వల్ల కృంగిపోకుండా ఉండడానికి ప్రార్థన మీకు సహాయం చేస్తుంది.

   “ప్రార్థన చేస్తూ ఉండండి. యెహోవా మీ బాధను అర్థంచేసుకుంటాడు, మీ పరిస్థితి ఏమిటో మీకన్నా బాగా ఆయనకు తెలుసు.”—మార్ష.

 •  ఇతరులకు సహాయం చేయండి. బైబిలు ఇలా చెప్తోంది, “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.” (ఫిలిప్పీయులు 2:4) ఇతరులకు సహాయం చేస్తూ మీరు ఎంత బిజీగా ఉంటే, బ్రేకప్‌ వల్ల కలిగిన బాధ నుండి అంత త్వరగా బయటపడతారు.

   “బ్రేకప్‌ అయినప్పుడు ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. శరీరానికి తగిలిన గాయంకన్నా మనసుకు తగిలిన గాయం ఎక్కువ నొప్పి పెడుతుంది. కానీ దాన్నుండి కోలుకోవడం సాధ్యంకాని విషయమేమీ కాదని నేను గ్రహించాను. కాకపోతే నా గతం తాలూకు గాయాలు మానడానికి కాస్త సమయం పడుతుంది.”—ఎవ్లిన్‌.