యువత అడిగే ప్రశ్నలు

బాప్తిస్మం తర్వాత ఏం చేయాలి?​—1వ భాగం: బాప్తిస్మం కోసం చేసిన పనులే చేస్తూ ఉండండి

బాప్తిస్మం తర్వాత ఏం చేయాలి?​—1వ భాగం: బాప్తిస్మం కోసం చేసిన పనులే చేస్తూ ఉండండి

 ఇల్లు, కారు లాంటి విలువైన వాటిని ఎప్పుడూ మంచి స్థితిలో ఉంచుకోవాలి. దేవునితో మీ స్నేహం కూడా అంతే. బాప్తిస్మం తర్వాత ఆ స్నేహాన్ని బలంగా ఉంచుకోవాలంటే ఏంచేయాలి?

ఈ ఆర్టికల్‌లో ...

 దేవుని వాక్యాన్ని లోతుగా చదువుతూ ఉండండి

 ముఖ్య లేఖనం: ‘మీరు ప్రతీ మంచిపని చేస్తూ, దేవుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఎదుగుతూ ఉండండి.’—కొలొస్సయులు 1:10.

 దానర్థం: బాప్తిస్మం తర్వాత కూడా మీరు బైబిలు చదువుతూ, నేర్చుకునే వాటి గురించి లోతుగా ఆలోచిస్తూ ఉండాలి.—కీర్తన 25:4; 119:97.

 ఏం జరగవచ్చు? ఒక్కోసారి మీకు బైబిలు చదవాలని అనిపించకపోవచ్చు. దానివల్ల, మీకు స్వతహాగా చదివే అలవాటు లేదని అనుకోవచ్చు.

 ఇలా చేయండి: బైబిల్లో మీకు ఆసక్తిగా అనిపించే విషయాల గురించి ఎక్కువ తెలుసుకోండి. మీరు బైబిల్ని, బైబిలు ప్రచురణల్ని ఎప్పుడు చదువుతారో ఎంతసేపు చదువుతారో మీ పరిస్థితులకు తగినట్టు నిర్ణయించుకుంటే మీకు భారంగా అనిపించదు. యెహోవా మీద, ఆయన వాక్యం మీద ప్రేమ పెంచుకోవడమే మీ లక్ష్యం. అలా చదివితే మీరు ప్రయోజనం పొందుతారు, అలాగే సంతోషంగా ఉంటుంది.—కీర్తన 16:11.

 టిప్‌: స్టడీ నుండి వీలైనంత ప్రయోజనం పొందాలంటే, ప్రశాంతమైన చోటును ఎంచుకోండి; వేరే విషయాల వల్ల మీ ధ్యాస పక్కకు మళ్లకుండా చూసుకోండి.

 ఇంకా సహాయం కావాలా?

 యెహోవాకు ప్రార్థిస్తూ ఉండండి

 ముఖ్య లేఖనం: “ఏ విషయం గురించీ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అలాగే కృతజ్ఞతలు చెప్పండి.”—ఫిలిప్పీయులు 4:6.

 దానర్థం: దేవునితో సంభాషించాలంటే, ఆయన చెప్పేది వినాలి అలాగే ఆయనతో మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మీరు ఆయన చెప్పేది వింటారు; ప్రార్థించినప్పుడు ఆయనతో మాట్లాడతారు. మీరు ప్రార్థించేటప్పుడు సహాయం కోసం అడగవచ్చు, దేవుడు ఇప్పటికే మీకు ఇచ్చిన వాటి కోసం కృతజ్ఞతలు చెప్పవచ్చు.

 ఏం జరగవచ్చు? కొన్నిసార్లు మీ ప్రార్థనలు, ఏదో చేయాలి కదా అని చేస్తున్నట్టు మీకు అనిపించవచ్చు. మీ ప్రార్థనల్ని యెహోవా వింటున్నాడా లేదా వినాలనుకుంటున్నాడా అని మీకు సందేహం కూడా రావచ్చు.—కీర్తన 10:1.

 ఇలా చేయండి: రోజంతా, మీరు ఏ విషయాల గురించి ప్రార్థించవచ్చో ఆలోచించండి. మీరున్న పరిస్థితిలో ఎక్కువసేపు ప్రార్థన చేయడం వీలుకాకపోతే, గుర్తుపెట్టుకొని ఆ తర్వాత వాటి గురించి ప్రార్థించండి. మీ ఆందోళనల గురించే కాకుండా ఇతరుల కోసం కూడా ప్రార్థించండి.—ఫిలిప్పీయులు 2:4.

 టిప్‌: మీ ప్రార్థనలు ఏదో చేయాలి కదా అని చేస్తున్నట్టు అనిపిస్తే, దానిగురించి యెహోవాకు ప్రార్థించండి. ప్రార్థన గురించి మీకున్న ఆందోళనలతో సహా మీ ఆందోళనలన్నీ ఆయన వినాలనుకుంటున్నాడు.—1 యోహాను 5:14.

 ఇంకా సహాయం కావాలా?

 మీ నమ్మకాల గురించి వేరేవాళ్లకు చెప్తూ ఉండండి

 ముఖ్య లేఖనం: “నీ మీద, నీ బోధ మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టు. … అలాచేస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ బోధ వినేవాళ్లను కూడా రక్షిస్తావు.”—1 తిమోతి 4:16.

 దానర్థం: మీ నమ్మకాల గురించి ఇతరులకు చెప్తూ ఉంటే, మీ విశ్వాసం కూడా బలపడుతుంది. దానివల్ల, మీరు చెప్పేది వినేవాళ్ల ప్రాణాన్ని, మీ ప్రాణాన్ని కాపాడుకుంటారు.

 ఏం జరగవచ్చు? ఒక్కోసారి, మీ నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడాలని మీకు అనిపించకపోవచ్చు. ముఖ్యంగా, స్కూల్‌లో ఉన్నప్పుడు అలా మాట్లాడాలంటే భయంగా కూడా అనిపించవచ్చు.

 ఇలా చేయండి: భయం లాంటి ప్రతికూల భావాలు మిమ్మల్ని అదుపు చేయకుండా చూసుకోండి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ఒకవేళ నేను … ఇష్టం లేకుండా [మంచివార్త ప్రకటించినా], దేవుడు అప్పగించిన బాధ్యత నా మీద అలాగే ఉంటుంది.”—1 కొరింథీయులు 9:16, 17.

 టిప్‌: మీ అమ్మానాన్నలు ఒప్పుకుంటే, మీకు మంచి ఆదర్శంగా ఉంటూ సహాయం చేయడానికి ఒకరిని ఎంచుకోండి. వాళ్లు చక్కగా పరిచర్య చేసే ఒక యెహోవాసాక్షి అయ్యుండాలి.—సామెతలు 27:17.

 ఇంకా సహాయం కావాలా?

 మీటింగ్స్‌కి వెళ్తూ ఉండండి

 ముఖ్య లేఖనం: ‘ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా పురికొల్పుకోవడానికి మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం. కూటాలు మానేయకుండా ఉందాం.’—హెబ్రీయులు 10:24, 25.

 దానర్థం: మనం ముఖ్యంగా యెహోవాను ఆరాధించడానికే మీటింగ్స్‌కి వెళ్తాం. అయితే దానివల్ల ఇంకో రెండు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకటి, మీరు తోటి సహోదరసహోదరీల నుండి ప్రోత్సాహం పొందుతారు. ఇంకొకటి, మీటింగ్స్‌కి వెళ్లడం ద్వారా, అందులో పాల్గొనడం ద్వారా మీరు వాళ్లను ప్రోత్సహిస్తారు.—రోమీయులు 1:11, 12.

 ఏం జరగవచ్చు? ఒక్కోసారి మీ మనసు పక్కకు మళ్లడం వల్ల, మీటింగ్స్‌లో చెప్పే విలువైన వాటి నుండి ప్రయోజనం పొందలేకపోవచ్చు. లేదా అప్పుడప్పుడూ మీటింగ్స్‌కి వెళ్లకపోవచ్చు. స్కూల్‌ వర్క్‌ లాంటి ఇతర విషయాల మీద ఎక్కువగా మనసుపెట్టడం వల్ల మీటింగ్స్‌కి సమయం లేకపోవచ్చు.

 ఇలా చేయండి: మీ చదువు నిర్లక్ష్యం చేయకుండానే మీటింగ్స్‌కి క్రమంగా వెళ్లాలని, వాటినుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందాలని బలంగా అనుకోండి. కామెంట్‌ చెప్పడం ద్వారా మీటింగ్స్‌లో పాల్గొనండి. మీటింగ్‌ అయిపోయాక, అందులో పాల్గొన్నవాళ్లలో కనీసం ఒక్కరినైనా మెచ్చుకోండి.

 టిప్‌: ముందే సిద్ధపడండి. JW లైబ్రరీ® యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకొని, మీటింగ్‌లో ఏ విషయాలు చర్చిస్తారో “మీటింగ్స్‌” ట్యాబ్‌ కింద చూడండి.

 ఇంకా సహాయం కావాలా?