కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను పాజిటివ్‌గా ఎలా ఆలోచించగలను?

నేను పాజిటివ్‌గా ఎలా ఆలోచించగలను?

 మీ గురించి మీ అభిప్రాయం ఏంటి?

 •   ఆశావాది

   “నేను వీలైనంత ఎక్కువ సంతోషంగా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను ప్రతీరోజు నవ్వుతూ, సరదాగా ఉండాలనుకుంటాను.”—వాలెరీ.

 •   నిరాశావాది

   “ఏదైనా మంచి విషయం జరగగానే సంతోషించే బదులు, అది నిజం కాదేమో అని సందేహించడం మొదలుపెడతాను.”—రెబెకా.

 •   వాస్తవికంగా ఆలోచించే వ్యక్తి

   “ఆశావాది తాను అనుకున్నది జరగనప్పుడు నిరుత్సాహపడతాడు, నిరాశావాది ఎప్పుడూ దిగులుగానే ఉంటాడు. కానీ వాస్తవికంగా ఆలోచించే వ్యక్తి విషయాల్ని ఉన్నదున్నట్టుగా చూడగలుగుతాడు.”—యానా.

 దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి?

 “సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 15:15) కాబట్టి, ప్రతీది నెగిటివ్‌గా ఆలోచించే బదులు జీవితాన్ని పాజిటివ్‌గా తీసుకునేవాళ్లు సంతోషంగా ఉండగలుగుతారు. వాళ్లకు ఎక్కువమంది ఫ్రెండ్స్‌ దొరుకుతారు. ఎప్పుడూ దిగులుగా ఉండేవాళ్లతో సమయం గడపాలని ఎవరు కోరుకుంటారు?

 మీరు ఎంత పాజిటివ్‌గా ఆలోచించేవాళ్లయినా మీకు కూడా కొన్ని సమస్యలు రావచ్చు. ఉదాహరణకు:

 •   యుద్ధం, ఉగ్రవాదం, నేరం గురించిన వార్తలు వినాల్సి రావచ్చు.

 •   మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.

 •   మీ సొంత బలహీనతలతో, లోపాలతో పోరాడుతుండవచ్చు.

 •   మీ ఫ్రెండ్‌ మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు.

 ఆ వాస్తవాల్ని చూసీచూడనట్లు వదిలేయకండి లేదా వాటి గురించే ఆలోచిస్తూ దిగులు పడకండి, బదులుగా వాస్తవికంగా ఆలోచించండి. అప్పుడు మీరు అనవసరమైన నెగిటివ్‌ ఆలోచనలకు దూరంగా ఉంటూ, కృంగిపోకుండా ఉంటారు.

కారు మబ్బులు తొలగిపోయి సూర్యుని వెలుగు మళ్లీ వస్తుందనే నమ్మకంతో, మీరు తుఫానులాంటి సమస్యల్ని తట్టుకోగలరు

 మీరేం చేయవచ్చు?

 •   పొరపాట్లు చేయడం సహజమని గుర్తించండి.

   “ఎన్నడూ తప్పిదం చేయకుండా, ఎప్పుడూ మంచివే చేసే న్యాయవంతుడు ఈ భూమిమీద ఎవ్వడూ లేడు” అని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 7:20, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) మీరు చేసే తప్పులు లేదా పొరపాట్లు మీరు కూడా ఒక మనిషే అని గుర్తుచేస్తాయి. తప్పులు చేసినంత మాత్రాన మీరు దేనికీ పనికిరానివాళ్లు అని అనుకోవద్దు.

   వాస్తవికంగా ఎలా ఆలోచించాలి: మీ పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి, మీరు పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకోకండి. కేలెబ్‌ అనే అబ్బాయి ఇలా అంటున్నాడు, “నా పొరపాట్ల గురించి ఆలోచిస్తూ నిరుత్సాహపడే బదులు, వాటి నుండి పాఠాలు నేర్చుకుని నన్ను నేను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తాను.”

 •   వేరేవాళ్లతో పోల్చుకోకండి.

   “అహంకారంతో, ఎదుటివాళ్లలో పోటీతత్వాన్ని కలిగించకుండా, ఒకరిని చూసి ఒకరు అసూయపడకుండా ఉందాం” అని బైబిలు చెప్తుంది. (గలతీయులు 5:26) మీ ఫ్రెండ్స్‌ మిమ్మల్ని పిలవకుండా పార్టీలు చేసుకుని, ఆ ఫోటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టారనుకోండి. అవన్నీ చూసినప్పుడు మీకు బాధ కలగవచ్చు. అప్పుడు మీ ప్రాణ స్నేహితులు కూడా మీకు బద్ధ శత్రువుల్లా కనిపించవచ్చు.

   వాస్తవికంగా ఎలా ఆలోచించాలి: మీ ఫ్రెండ్స్‌ మిమ్మల్ని ప్రతీ పార్టీకి పిలవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. అంతేకాదు, సోషల్‌ మీడియాలో పెట్టిన ఫోటోలు వాళ్ల జీవితంలో జరిగిన కొన్ని సంగతుల్నే తెలియజేస్తాయి. అలెక్సిస్‌ అనే టీనేజీ అబ్బాయి ఇలా చెప్తున్నాడు, “సాధారణంగా ప్రజలు తమ జీవితంలో జరిగిన ప్రత్యేకమైన సంఘటనల్నే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు, మామూలు సంఘటనల్ని వదిలేస్తారు.”

 •   అందరితో శాంతిగా ఉండండి, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో.

   బైబిలు ఇలా చెప్తుంది: “సాధ్యమైతే, మీకు చేతనైనంత వరకు మనుషులందరితో శాంతిగా మెలగండి.” (రోమీయులు 12:18) వేరేవాళ్లు మీతో ఎలా ప్రవర్తిస్తారనేది మీ చేతుల్లో లేదు. అయితే మీరెలా స్పందిస్తారనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. మీరు శాంతిగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు.

   వాస్తవికంగా ఎలా ఆలోచించాలి: కుటుంబంలో ఒత్తిడి ఉన్నప్పుడు దాన్ని ఇంకా పెంచే బదులు, మీ ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటారో అలాగే శాంతిగా ఉండడానికి ప్రయత్నించండి. మెలిండ అనే టీనేజీ అమ్మాయి ఇలా అంటుంది: “ఎవ్వరూ పర్ఫెక్ట్‌ కాదు, మనందరం ఏదోక సమయంలో ఒకరినొకరం నొప్పించుకుంటాం. కానీ ఎలా స్పందించాలి, ప్రశాంతంగా ఉండాలా లేదా అనేది మనమే నిర్ణయించుకోవాలి.”

 •   కృతజ్ఞత చూపించడం నేర్చుకోండి.

   “కృతజ్ఞులై ఉండండి” అని బైబిలు చెప్తుంది. (కొలొస్సయులు 3:15) అలా ఉండడం వల్ల, మీ జీవితంలో మీకు నచ్చని విషయాల మీద కాకుండా మంచి విషయాల మీద మనసుపెట్టగలుగుతారు.

   వాస్తవికంగా ఎలా ఆలోచించాలి: సమస్యల్ని గుర్తించండి, కానీ వాటి గురించే ఆలోచిస్తూ మీ జీవితంలో జరుగుతున్న మంచి విషయాల్ని మర్చిపోకండి. రెబెకా అనే అమ్మాయి ఏమంటుందంటే, “ప్రతీరోజు నా జీవితంలోని ఒక మంచి విషయం నా డైరీలో రాసుకుంటాను. అలా చేయడం వల్ల, సమస్యలు ఉన్నప్పటికీ నేను ఆలోచించాల్సిన మంచి విషయాలు చాలా ఉన్నాయని నాకు గుర్తొస్తుంది.”

 •   మీకు ఎలాంటి ఫ్రెండ్స్‌ ఉన్నారో చూసుకోండి.

   బైబిలు ఇలా చెప్తుంది: “చెడు సహవాసాలు మంచి అలవాట్లను పాడుచేస్తాయి.” (1 కొరింథీయులు 15:33) విమర్శిస్తూ, వ్యంగ్యంగా మాట్లాడే ఫ్రెండ్స్‌తోనే ఎక్కువగా ఉంటే వాళ్ల చెడు లక్షణాలు మీకు కూడా వస్తాయి.

   వాస్తవికంగా ఎలా ఆలోచించాలి: ఫ్రెండ్స్‌కి కూడా కష్టాలు వస్తాయి, అప్పుడు వాళ్లు నిరుత్సాహపడవచ్చు. అలాంటి సమయాల్లో వాళ్లకు అండగా ఉండండి, అంతేకానీ వాళ్ల సమస్యలన్నీ మీ మీద వేసుకోకండి. “నెగిటివ్‌గా ఆలోచించేవాళ్లతో మాత్రమే స్నేహం చేయడం మంచిది కాదు” అని మిషెల్‌ అనే అమ్మాయి అంటోంది.

 పాజిటివ్‌గా ఉండడానికి సహాయం చేసే సమాచారం చదవండి

 మనం “ప్రమాదకరమైన, కష్టమైన” కాలాల్లో జీవిస్తున్నామని బైబిలు చెప్తుంది. (2 తిమోతి 3:1) లోకంలో ఇన్ని నెగిటివ్‌ విషయాలు ఉండగా పాజిటివ్‌గా ఆలోచించడం ఎలా సాధ్యం అని మీకు అనిపిస్తుందా? అయితే, “ఎందుకు ఇన్ని బాధలు?” అనే ఆర్టికల్‌ చదవండి.