యువత అడిగే ప్రశ్నలు
నేను చూడడానికి ఎలా ఉన్నానో అని బాధపడుతున్నానా?
క్విజ్: నేను బాధపడుతున్నానా?
కింది చెప్పిన వాటిలో మీరు ఏ విధంగా భావిస్తారు?
నేను ఎప్పుడూ అందంగా ఉండను.
నేను కొన్నిసార్లు అందంగా ఉంటాను.
నేను ఎప్పుడూ బాగానే ఉంటాను.
మీరు దేన్ని మార్చుకోవాలని బాగా కోరుకుంటున్నారు?
ఎత్తు
బరువు
శరీర ఆకారం
జుట్టు
రంగు
మజిల్స్
మరేదైనా
కింది వాక్యాన్ని పూర్తి చేయండి.
నేను ఎప్పుడు బాగా దిగులు పడతానంటే . . .
నా బరువు చూసుకున్నప్పుడు.
నన్ను అద్దంలో చూసుకున్నప్పుడు.
నన్ను నేను ఇతరులతో పోల్చుకున్నప్పుడు (స్నేహితులతో, ఫ్యాషన్ మోడల్స్‌తో, సినిమా స్టార్స్‌తో).
కింది వాక్యాన్ని పూర్తి చేయండి.
నేను నా బరువును . . .
ప్రతీరోజు చూసుకుంటాను.
ప్రతీవారం చూసుకుంటాను.
వారానికి ఒక్కసారి కూడా చూసుకోను.
కింద చెప్పిన వాటిలో మీ భావాలకు ఏది సరిగ్గా సరిపోతుంది?
నా శరీరానికి మంచి ఆకారం లేదు. (ఉదాహరణకు: “నేను ఎప్పుడు అద్దంలో చూసుకున్నా లావుగా, వికారంగా ఉంటానని అనుకుంటాను. బరువు తగ్గాలని కడుపు మాడ్చుకునేదాన్ని.”—సేరీనా.)
సరైన శరీర ఆకారం. (ఉదాహరణకు: “మనం కనబడే తీరులో ప్రతీసారి మనకు ఏదోఒకటి నచ్చదు. కానీ కొన్నిటిని మనం అంగీకరించాల్సిందే. మనం మార్చలేని వాటి కోసం దిగులు పడడం అనవసరం.”—నతన్యా.)
మన గురించి మనం అవసరమైన దానికంటే ఎక్కువ ఆలోచించకూడదని బైబిలు చెప్తుంది. (రోమీయులు 12:3) కాబట్టి కొంతవరకూ మన గురించి మనం ఆలోచించుకోవడం మంచిదే. అది అవసరం కూడా. అందుకే మీరు పళ్లు తోముకుంటారు, శుభ్రంగా ఉంటారు.
మీ శరీరాన్ని చూసుకున్నప్పుడల్లా మీకు కృంగిపోయేంత నిరుత్సాహం కలుగుతుందా? అలాగైతే మీరు ఈ విధంగా అనుకుంటూ ఉండవచ్చు. . .
‘నాకు ఎందుకు మంచి శరీర ఆకారం లేదు?’
దానికి చాలా కారణాలు ఉండవచ్చు. అవి:
మీడియా లేదా ప్రకటనల ప్రభావం. “ఇప్పుడు వస్తున్న ఫోటోల్ని చూసి యౌవనులు, వాళ్లలా ఎప్పుడూ ఎముకలు కనిపించేంత సన్నగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా ఉండలేకపోతే అస్సలు తట్టుకోలేకపోతున్నారు.”—కెల్లీ.
తల్లిదండ్రుల ప్రభావం. “తల్లి తన శరీర ఆకారం గురించి బాగా దిగులు పడిపోతుంటే, అది చూస్తున్న వాళ్ల అమ్మాయి కూడా అలాగే చేస్తుంది. తండ్రీ కొడుకుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది.”—రీట.
తక్కువ ఆత్మవిశ్వాసం. “తమ శరీర ఆకారం గురించి దిగులు పడేవాళ్లు, వాళ్లను ఎప్పుడూ ఇతరులు పొగుడుతూ ఉండాలని కోరుకుంటారు. నిజానికి అది చాలా కష్టం!”—జాన్.
ప్రత్యేకించి ఏ కారణమూ లేకపోయినా మీరిలా అనుకుంటూ ఉండవచ్చు. . .
‘నేను కనబడే తీరును మార్చుకోవాలా?’
మీ వయసువాళ్లు ఏమంటున్నారో వినండి.
“మీలో మీకు నచ్చనివాటిని మార్చడం అన్నిసార్లు కుదరదు. కాబట్టి మీ లోపాల్ని అంగీకరించడమే మంచిది. అలా అంగీకరించినప్పుడు ఇతరులు కూడా వాటిని పెద్దగా పట్టించుకోరు.”—రొరీ.
“ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేయండి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చక్కగా ఎలా ఉండాలో అలాగే ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని మీరుగా (మీరు ఎలా కనిపించినా సరే) చూడలేకపోతే, వాళ్లు మీ స్నేహితులే కాదు.”—ఓలివియా.
ఒక్కమాటలో: చక్కగా కనబడడానికి మీరు చేయగలిగింది చేయండి. తర్వాత దేని గురించీ దిగులు పడొద్దు. మీరు ఎలా కనిపిస్తున్నారో అని ఎక్కువగా దిగులు పడడం ప్రమాదానికి దారితీయవచ్చు. (“ జూలియా కథ” చదవండి.)
కానీ సరైన ఆలోచనా విధానం ఉంటే నిజంగా మీరేంటో తెలుసుకోగలుగుతారు. ఎరిన్ అనే యౌవనురాలు కూడా ఈ పాఠాన్నే నేర్చుకుంది. ఆమె ఇలా అంటుంది, “నిజమే, నాకు అభద్రతా భావాలు ఉన్నాయి. కానీ నేను అనవసరమైన విషయాల గురించి ఆలోచించినప్పుడు మాత్రమే నాకు బాధ కలుగుతుందని అర్థమైంది. ఇప్పుడు నేను క్రమంగా ఎక్సర్‌సైజ్ చేస్తూ, పద్ధతిగా ఆహారం తింటున్నాను. మిగిలినవన్నీ వాటంతట అవే చక్కబడ్డాయి.”
చక్కగా కనిపించడానికి అత్యంత గొప్ప మార్పు!
మీరు కనబడే తీరు గురించి సరైన విధంగా ఆలోచిస్తే, మీరు చక్కగా ఉన్నట్లు మీకే అనిపిస్తుంది (అలాగే కనిపిస్తారు కూడా). అందుకు బైబిలు మీకు సహాయం చేయగలదు. కింద చెప్పిన వాటిని అలవాటు చేసుకోమని అది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది:
సంతృప్తి. “మనకు లేని దాని కోసం ప్రాకులాడడం కంటే, ఉన్నదానితో సంతోషించడం చాలా మంచిది. ఎందుకంటే అలా లేని దానికోసం ప్రాకులాడడం, గాలిని పట్టుకోవడం కోసం దాని వెంట పరిగెత్తడం లాంటిది.”—ప్రసంగి 6:9, కంటెంపరరీ ఇంగ్లిష్ వర్షన్.
తగిన విధంగా వ్యాయామం (ఎక్సర్‌సైజ్) చేయండి. “శారీరక వ్యాయామము కొంత విలువైనదే.”—1 తిమోతి 4:8, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.
పైకి కనిపించని మీ లోపలి అందం. “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”—1 సమూయేలు 16:7.
“మన గురించి మనం ఏమనుకుంటున్నామో మన హావభావాలు చూపించేస్తాయి. ఎవరైనా తనకున్న వాటితో సంతోషంగా, సంతృప్తిగా ఉంటే ఇతరులు వాళ్లంతటవాళ్లే అతనికి దగ్గరౌతారు.”—శారా.
“నిజమే అందం అందరినీ వెంటనే ఆకర్షిస్తుంది. కానీ మీరు ఎలాంటి వ్యక్తి, మీలో ఏమేం మంచి లక్షణాలు ఉన్నాయి అనే వాటినే ప్రజలు చివరకు బాగా గుర్తుంచుకుంటారు.”—ఫిలీశ్యా.
సామెతలు 11:22; కొలొస్సయులు 3:9-10, 12; 1 పేతురు 3:3, 4 కూడా చూడండి.