కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

తప్పులు చేసినప్పుడు నేనేమి చేయాలి?

తప్పులు చేసినప్పుడు నేనేమి చేయాలి?

 మీరు ఏమి చేస్తారు?

 కరీనాకు ఏం జరిగిందో చదివి అది మీకే జరుగుతునట్టుగా ఊహించుకోండి. ఆమె పరిస్థితిలో మీరే ఉంటే మీరు ఏం చేస్తారు?

 కరీనా: “నేను కాలేజ్‌కి వెళ్లేటప్పుడు చాలా వేగంగా కారు నడుపుతున్నాను. అప్పుడు ఒక పోలిస్‌ నన్ను ఆపి, ఫైన్‌ కట్టమని నాకు చలానా ఇచ్చారు. అది నాకు అస్సలు నచ్చలేదు. జరిగింది అమ్మకు చెప్పాను. నేను నాన్న దగ్గరకు కూడా వెళ్లి ఆ విషయం చెప్పాలని అమ్మ నాతో అంది. అది నాకు ఏ మాత్రం ఇష్టం లేదు.”

  మీరు ఏమి చేస్తారు?

 1.  ఆప్షన్‌ ఎ: ఆ విషయాన్ని దాచిపెట్టి, నాన్నకు అది ఎప్పటికీ తెలియకూడదని కోరుకోవడం.

 2.  ఆప్షన్‌ బి: జరిగింది జరిగినట్టు నాన్నకు చెప్పడం.

 మీకు ఆప్షన్‌ ఎ ఎంచుకోవాలని అనిపిస్తుండవచ్చు. మీరు జరిగిన విషయం నాన్నకు చెప్పారనే అమ్మ అనుకోవచ్చు. కానీ మీరు తప్పులు చేసినప్పుడు వాటిని ఎందుకు ఒప్పుకోవాలో చెప్పే మూడు మంచి కారణాలు ఉన్నాయి. అది ఫైన్‌ వేసిన చలానా అయినా లేక మరేదైనా కావొచ్చు.

 మీ తప్పులు ఒప్పుకోవడానికి మూడు కారణాలు

 1.  1. తప్పులు ఒప్పుకోవడం సరైన పని. క్రైస్తవులకు ఉండే ప్రమాణాలను వివరిస్తూ బైబిలు ఇలా చెప్తుంది “అన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప” కోరబడుచున్నాము.—హెబ్రీయులు 13:18.

   “నేను నిజాయితీగా ఉంటూ, నేను చేసే ప్రతీ పనికి నేనే బాధ్యత వహించడానికి చాలా కృషి చేశాను. తప్పు చేసిన వెంటనే దాన్ని ఒప్పుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాను.”—అలెక్సిస్‌.

 2.  2. ప్రజలు ఎక్కువగా తప్పులు ఒప్పుకునేవాళ్లను క్షమించడానికి ఇష్టపడతారు. బైబిలు ఇలా చెప్తుంది: “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.”—సామెతలు 28:13.

   “తప్పును ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలి. కానీ మీరలా చేసినప్పుడు ప్రజల నమ్మకాన్ని సంపాదించుకుంటారు. మీరు నిజాయితీపరులని వాళ్లు గమనిస్తారు. తప్పును ఒప్పుకోవడం ద్వారా ఒక చెడ్డ విషయాన్ని మంచి విషయంగా మార్చగలుగుతారు.”—రిచర్డ్‌.

 3.  3. అన్నిటికన్నా ముఖ్యంగా అలా చేస్తే యెహోవా దేవుడు సంతోషిస్తాడు. బైబిలు ఇలా చెప్తుంది, “కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.”—సామెతలు 3:32.

   “నేనొక పెద్ద తప్పు చేసిన తర్వాత, నా అంతట నేనే ఆ తప్పు ఒప్పుకోవాలని గుర్తించాను. యెహోవా చెప్పిన విధంగా ఈ పని చేయకపోతే నేను ఆయనిచ్చే ఆశీర్వాదం పొందే అవకాశమే లేదు.”—రేచల్‌.

 కరీనా తన తప్పును సరిచేసుకుందా? స్పీడుగా నడిపినందుకు ఫైన్‌ వేసిన చలానాని ఆమె వాళ్ల నాన్నకు చూపించలేదు. కానీ అదొక రోజు బయటపడిపోయింది. దాని గురించి కరీనా ఇలా అంటుంది, “ఒక సంవత్సరం తర్వాత మా న్నాన్నగారు మా ఇన్‌స్యూరెన్స్‌ రికార్డులు చూస్తున్నారు. అప్పుడు నా పేరు మీదున్న ఆ చలానాని కూడా చూసేశారు. నాకు పెద్ద సమస్యే వచ్చిపడింది. తను చెప్పినట్టు చేయలేదని మా అమ్మకు కూడా కోపం వచ్చింది.”

 ఏం పాఠం నేర్చుకుంది: “తప్పుల్ని దాచిపెట్టడం వల్ల పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుంది. తర్వాతైనా మీరు దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే” అంటుంది కరీనా.

 మీరు చేసిన తప్పుల నుండి ఎలా పాఠం నేర్చుకోవచ్చు

 అందరూ తప్పులు చేస్తారు. (రోమీయులు 3:23; 1 యోహాను 1:8) మనం ఇంతకుముందు చూసినట్టుగా, తప్పుల్ని ఒప్పుకోవడం వల్ల మనకు వినయం ఉందని, మనం ఎదిగిన వాళ్లమని చూపిస్తుంది. కాబట్టి మనం దాన్ని వెంటనే చేయాలి.

 తర్వాత, మీరు చేసిన తప్పుల నుండి పాఠం నేర్చుకోవాలి. బాధాకరంగా, కొంతమంది యౌవనులు ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఒకప్పుడు ప్రిస్కిల్లా అనే టీనేజీ అమ్మాయి అనుకునట్టుగానే వాళ్లు కూడా అనుకొని ఉండొచ్చు. ఆమె ఇలా అంటుంది: “నేను చేసిన తప్పులకు ఎక్కువగా కృంగిపోయేదాన్ని. నన్ను నేను చిన్నచూపు చూసుకోవడం వల్ల నా తప్పులు మోయలేనంత బరువైనవని అనిపించేది. వాటిలోనే మునిగిపోయి, ఇక నేను ఎందుకూ పనికిరానని అనుకునేదాన్ని.”

 ఒక్కోసారి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అలాగైతే ఈ విషయం గుర్తుంచుకోండి జరిగిపోయిన తప్పుల గురించే ఆలోచిస్తూ ఉండడం అంటే, కారుకు వెనకాల వచ్చేవాటిని చూపించే అద్దాన్నే చూస్తూ కారు నడపడం లాంటిది. జరిగిపోయిన వాటిమీద దృష్టి పెట్టడం వల్ల మీరు ఎందుకూ పనికిరారని అనిపించడమే కాదు, ముందుముందు రాబోయే సమస్యలను ఎదుర్కొనే శక్తి కూడా మీకు ఉండదు.

 దాని బదులు మీరు ఈ విషయం గురించి ఇంకా చక్కగా ఎందుకు ఆలోచించకూడదు?

 “మీరు గతంలో ఏం తప్పులు చేశారో చూడండి. అయితే అవే తప్పులు మళ్లీ చేయకుండా వాటినుండి మంచి పాఠం నేర్చుకోండి. కానీ మీరు కృంగిపోయేంతలా వాటి గురించే ఆలోచిస్తూ ఉండకండి.”—అల్లీయట్‌.

 “నేను తప్పుల్ని గుణపాఠం నేర్పించే అనుభవాలుగా చూడడానికి ప్రయత్నిస్తాను. ప్రతీ తప్పు నుండి ఏదోక పాఠం నేర్చుకుంటాను. ఇది నేను మెరుగైన వ్యక్తిగా తయారవ్వడానికి, ఈసారి అలాంటి పరిస్థితే వస్తే మరోవిధంగా ప్రవర్తించడానికి నాకు సహాయం చేస్తుంది. ఏదేమైనా మనం చేయాల్సింది అదే. ఎందుకంటే అది మన ఎదుగుదలకు తోడ్పడుతుంది.”—విర.