కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను డేటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానా?

నేను డేటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానా?

 డేటింగ్‌ అంటే ఏంటి?​

  •   మీరు అబ్బాయి అయితే ఒక అమ్మాయిని లేదా అమ్మాయి అయితే ఒక అబ్బాయిని ప్రత్యేకంగా కలుస్తూ బయటకు వెళ్తూ ఉంటే, మీరు ఆ అమ్మాయి లేదా అబ్బాయితో డేటింగ్‌ చేస్తున్నట్లా?

  •   మీరూ ఒక అమ్మాయి లేదా మీరూ ఒక అబ్బాయి ఒకర్నొకరు ఇష్టపడుతుంటే, రోజులో చాలాసార్లు వాళ్లకు మెసేజులు పంపడం లేదా ఫోన్లో మాట్లాడడం చేస్తుంటే వాళ్లతో డేటింగ్‌ చేస్తున్నట్లా?

  •   మీ స్నేహితులను కలిసిన ప్రతీసారి, మీరు ఆ అమ్మాయి/అబ్బాయితోనే కలిసి ఎక్కువ సమయం గడుపుతుంటే మీరు వాళ్లతో డేటింగ్‌ చేస్తున్నట్లా?

 మొదటి ప్రశ్నకు మీరు చాలా సులభంగా జవాబు చెప్పేసి ఉండవచ్చు. కానీ రెండు, మూడు ప్రశ్నలకు జవాబు చెప్పడానికి మీరు కాస్త ఆలోచిస్తున్నారా? అసలు డేటింగ్‌ అంటే ఏంటి?

 నిజమే, అందరూ కలిసే ఏ కార్యక్రమంలోనైనా, మీరు ఒకే వ్యక్తిపై ఆసక్తి చూపిస్తూ వాళ్లు కూడా మీమీదే అలాంటి ఆసక్తినే చూపిస్తుంటే దాన్ని డేటింగ్‌ అంటారు.

 కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు జవాబు అవును అనే చెప్పాలి. మీరూ, మీ స్నేహితుడు/స్నేహితురాలు కలిసి తరచూ ఫోన్లోనైనా, కంప్యూటర్‌ ద్వారానైనా, ఎదురుఎదురుగానైనా, అందరి ముందైనా, రహస్యంగానైనా ప్రణయాత్మకంగా ఒకరి మీద ఒకరికి ఉన్న భావాల గురించి మాట్లాడుకుంటుంటే దాన్ని డేటింగ్‌ అంటారు.

 అసలు డేటింగ్‌ ఎందుకు చేస్తారు?​

 డేటింగ్‌ వెనుక ఒక గౌరవప్రదమైన కారణం ఉంది. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఒకరికొకరు సరిపోతారో లేదో తెలుసుకోవడానికే డేటింగ్‌ చేస్తారు.

 మీ వయసువాళ్లు కొంతమంది డేటింగ్‌ని సరదాగా తీసుకోవచ్చు. వాళ్లు బహుశా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా ఒక అమ్మాయి/అబ్బాయితో కలిసి సమయం గడపడాన్ని ఇష్టపడవచ్చు. కొంతమంది అలాంటి అమ్మాయి/అబ్బాయిని దాదాపు ఒక పోటీలో గెల్చుకున్న కప్పులానో, లేదా తమ ఆత్మగౌరవం పెంచుకోవడానికి పదిమందిలో గొప్పగా చూపించుకునే ఒక వస్తువులానో చూస్తారు.

 తరచూ అలాంటప్పుడు, పైకి చూపించుకోవడానికే ఉన్న ఆ బంధం ఎక్కువ కాలం నిలువదు. హీదర్‌ అనే అమ్మాయి ఇలా అంటుంది, “డేటింగ్‌ చేసే చాలామంది యువత, ఒక వారం లేదా రెండు వారాల్లోనే విడిపోతారు. వాళ్లు బంధాలను తాత్కాలికమైనవిగా చూస్తారు అంటే ఒక విధంగా వాళ్లు పెళ్లి చేసుకోవడానికి కాదు, విడాకులకు సిద్ధపడుతున్నారు.”

 మీరు ఎవరితోనైనా డేటింగ్‌ చేస్తునప్పుడు, ఖచ్చితంగా వాళ్ల భావాలను ప్రభావితం చేస్తారు. కాబట్టి మీరు ఒకవేవ డేటింగ్‌ చేస్తే సరైన ఉద్దేశంతో మాత్రమే చేయండి.—లూకా 6:31.

పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా డేటింగ్‌ చేస్తుంటే, ఒక కొత్త బొమ్మ దొరకగానే ఉత్సాహంగా దాంతో కాసేవు ఆడేసుకొని ఆ తర్వాత దాన్ని విసిరిపారేసే చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తున్నారని దాని అర్థం.

 ఆలోచించండి: పిల్లలు ఎలాగైతే బొమ్మల్ని ఉత్సాహంగా చేతుల్లోకి లాక్కొని మళ్లీ వాటిని వెంటనే విసిరేస్తారో, అలా మీ భావాలతో కూడా ఎవరైనా ఆడుకుంటే మీకు ఇష్టం ఉంటుందా? అలాంటప్పుడు మీరు కూడా ఇతరుల భావాలతో ఆడుకోకండి. బైబిలు ఇలా చెప్తుంది, ప్రేమ “అమర్యాదగా నడువదు.”—1 కొరింథీయులు 13:4, 5.

 చల్సీ అనే అమ్మాయి ఇలా అంటుంది, “కొన్నిసార్లు నేను డేటింగ్‌ అంటే సరదాకోసం అనుకుంటాను. కానీ ఒకరు దాన్ని సరదాగా తీసుకుని మరొకరు సీరియస్‌గా తీసుకుంటే అది సరదా అవ్వదు.”

  టిప్‌: డేటింగ్‌, పెళ్లి ఇలాంటి వాటికోసం సిద్ధపడడానికి 2 పేతురు 1:5-7 చదివి మీరు మెరుగు చేసుకోవాలనుకుంటున్న ఒక లక్షణాన్ని ఎంపిక చేసుకోండి. ఒక నెలరోజులపాటు ప్రయత్నించి, మీరు ఆ లక్షణం గురించి ఎంత ఎక్కువ నేర్చుకోగలిగారో, దాంట్లో ఎంత మెరుగుపడ్డారో సరిచూసుకోండి.

 డేటింగ్‌ చేసేంత వయసు నాకు ఉందా?​

  •    ఎంత వయసు వచ్చాక యువత డేటింగ్‌ చేయవచ్చని మీరు అనుకుంటున్నారు?

  •    ఇప్పుడు ఇదే ప్రశ్న మీ అమ్మనుగానీ నాన్ననుగానీ అడగండి.

 మీ జవాబు మీ అమ్మా/నాన్న ఇచ్చిన జవాబుకు వేరుగా ఉండవచ్చు, లేదా వాళ్ల జవాబు మీ జవాబు ఒకటే అయ్యి ఉండవచ్చు. చాలామంది యువత వాళ్ల గురించి వాళ్లు బాగా తెలుసుకోగల వయసు వచ్చే వరకూ డేటింగ్‌ చేయకూడదని జ్ఞానయుక్తంగా నిర్ణయించుకుంటున్నారు. మీరూ అలాగే అనుకుంటున్నారా?

 17 ఏళ్ల డానియల్‌ అదే చేయాలనుకుంది. ఆమె ఇలా చెప్తుంది, “ఒక మంచి భర్తలో ఏ లక్షణం ఉండాలని నేను ఇప్పుడు కోరుకుంటానో, రెండేళ్ల క్రితం కూడా ఆ లక్షణమే కావాలనుకునేదాన్ని కాదేమో. నిజానికి ఇప్పుడు కూడా నాకు దాని గురించి ఖచ్చితంగా తెలుసని నేను అనుకోవడం లేదు. కొన్ని సంవత్సరాలుగా నేను ఒకేలా ఉండగలుగుతున్నానని, నా ఆలోచనలు స్థిరంగా ఉన్నాయని నాకు అనిపించినప్పుడే నేను డేటింగ్‌ గురించి ఆలోచిస్తాను.”

 కాస్త నిదానించడం జ్ఞానయుక్తం అని చెప్పడానికి మరో కారణం ఉంది. జీవితంలో శరీర కోరికలు, ప్రణయాత్మక భావాలు చాలా బలంగా ఉండే “ఈడు” గురించి బైబిలు మాట్లాడుతుంది. (1 కొరింథీయులు 7:36) కాబట్టి ఇలాంటి ఈడులో ఒకే అమ్మాయి/అబ్బాయితో చాలా దగ్గరగా ఉండడం వల్ల కోరికలు మంటల్లా చెలరేగి, తప్పు చేయాడానికి దారితీయవచ్చు.

 నిజానికి మీ వయసువాళ్లు దాన్ని అంతగా పట్టించుకోకపోవచ్చు. వాళ్లలో చాలామంది తమ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఆశపడుతూ ఉంటారు. కానీ అలాంటి ఆలోచన నుండి మీరు బయటపడగలరు. బయటపడాలి కూడా! (రోమీయులు 12:2) “జారత్వమునకు దూరముగా పారిపోవుడి ”అని బైబిలు మనల్ని బ్రతిమాలుతుంది. (1 కొరింథీయులు 6:18) కాబట్టి ఈడు మించిపోయేంతవరకూ ఆగడం ద్వారా ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.—ప్రసంగి 11:10.

 డేటింగ్‌ చేయడానికి ఎందుకు తొందరపడకూడదు?​

 మీరు చక్కగా సిద్ధపడకముందే డేటింగ్‌ చేయమని ఒత్తిడి చేయడం, ఏమీ చదవకుండానే పరీక్ష రాయమని ఒత్తిడి చేయడం లాంటిది. అది న్యాయం కాదు. మీకు పరీక్షలో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకొని, వాటి కోసం సిద్ధపడడానికి మీకు కొంత సమయం కావాలి కదా!

 డేటింగ్‌ కూడా అంతే.

 డేటింగ్‌ తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. కాబట్టి మీరు ఒక వ్యక్తితో కలిసి సమయం గడపాలని నిర్ణయించుకునేముందు మంచి స్నేహితులు ఎలా అవ్వాలి అనే ప్రాముఖ్యమైన “విషయం” గురించి నేర్చుకోవాలి.

 తర్వాతి రోజుల్లో మీరు అందుకు తగిన వ్యక్తిని కలిసినప్పుడు వాళ్లతో బలమైన బంధాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. మంచి వివాహం అంటే ఇద్దరు మంచి స్నేహితులు కలయికే కదా!

 డేటింగ్‌ చేసేందుకు తొందరపడకుండా కాస్త ఆగడం వల్ల మీ స్వేచ్ఛకు భంగం కలుగదు. బదులుగా ‘మీ యవ్వనాన్ని బట్టి సంతోషించడానికి’ మీకు ఇంకా ఎక్కువ  స్వేచ్ఛ లభిస్తుంది. (ప్రసంగి 11:9) మీ వ్యక్తిత్వాన్ని మరిముఖ్యంగా దేవునితో మీకున్న సంబంధాన్ని వృద్ధి చేసుకోవడానికి మీకు మంచి సమయం దొరుకుతుంది.—విలాపవాక్యములు 3:27.

 ఈలోగా మీరు ఆ అమ్మాయి/అబ్బాయితో సరదాగా సమయం గడపవచ్చు. కానీ ఎలా గడిపితే బాగుంటుంది? చక్కగా పెద్దవాళ్ల పర్యవేక్షణలో అమ్మాయిలూ అబ్బాయిలూ అందరూ ఉండే చోట కలిసి సమయం గడపడం మంచిదే. ట్యామీ అనే అమ్మాయి ఇలా అంటుంది, “అది చాలా సరదాగా ఉంటుంది. మనకు చాలామంది స్నేహితులౌతారు.” మోనికా కూడా అది నిజమే అంటూ ఇంకా ఇలా చెప్తుంది, “అందరి మధ్యలో ఉండడం చాలా మంచి ఆలోచన, ఎందుకంటే అలాంటి సమయంలో రకరకాల వాళ్లను కలిసే అవకాశం దొరుకుతుంది.”

 అలా కాకుండా మీరు తొందరపడి ఒకరికి ఫిక్స్‌ అయిపోతే భవిష్యత్తులో మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి తగినంత సమయం తీసుకోండి. మీ జీవితంలో ఉన్న ఈ సమయంలో, మంచి స్నేహితులను సంపాదించుకోవడం, ఆ స్నేహితులతో మీ బంధాన్ని చక్కగా కొనసాగించడం ఎలాగో నేర్చుకోండి. ఆ తర్వాత ఎప్పుడైనా మీరు డేటింగ్‌ చేయాలనుకుంటే మీరేంటో, మీతో జీవితాంతం కలిసుండే భాగస్వామిలో మీరేమి కోరుకుంటున్నారో మీకు ఇంకా బాగా తెలుస్తుంది.