కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

ఈ హో౦వర్క్‌ అ౦తా నేనెలా చెయ్యాలి?

ఈ హో౦వర్క్‌ అ౦తా నేనెలా చెయ్యాలి?

మీరేమి చేయవచ్చు

చదువుకోడానికి ఓ ప్లేస్‌ని చూడ౦డి. మీ ఏకాగ్రతను చెడగొట్టేవేవి అక్కడ లేకు౦డా చూసుకో౦డి. వీలైతే టేబుల్‌ను ఉపయోగి౦చుకో౦డి. టీవీని కట్టేసి ఉ౦చ౦డి.

సమయ౦ వేగ౦గా పరుగెత్తే గుర్ర౦ లా౦టిది—మీరు దాన్ని అదుపు చేయడ౦ నేర్చుకోవాలి

ఏవి ముఖ్యమో నిర్ణయి౦చుకో౦డి. మీ స్కూల్‌ చదువు ముఖ్యమైనది కాబట్టి, ము౦దు హో౦వర్క్‌ చేయాలని తీర్మాని౦చుకో౦డి.

వాయిదాలు వేయొద్దు. హో౦వర్క్‌ చేయడానికి ఖచ్చితమైన పట్టిక వేసుకొని, దాని ప్రకారమే చేయ౦డి.

ఒక ప్లాన్‌ తయారుచేసుకో౦డి. ము౦దు ఏ పని చేయాలో, దాని తర్వాత ఏది చేయాలో నిర్ణయి౦చుకో౦డి. వాటన్నిటిని ఓ పేపరుపై రాసి, ప్రతీ పనికి ఇ౦త సమయమని కేటాయి౦చుకో౦డి. ఒక్కో పని పూర్తయిన తర్వాత పేపరుపైనున్న వాటిని కొట్టేయ౦డి.

మధ్య మధ్యలో బ్రేక్‌ తీసుకో౦డి. హో౦వర్క్‌ మీద మనసు నిలపలేకపోతు౦టే కొ౦చె౦సేపు ఆగ౦డి. కానీ వీలైన౦త త్వరగా మళ్లీ హో౦వర్క్‌ చేయడ౦ మొదలు పెట్ట౦డి.

మీమీద మీకు గట్టి నమ్మక౦ ఉ౦డాలి. బాగా చదివే ఓ మ౦చి విద్యార్థికి, బాగా చదవలేని వాళ్ళకి తెలివి క౦టే వాళ్లు కష్టపడి పని చేసే విధాన౦లోనే ఎక్కువ తేడా ఉ౦టు౦దని గుర్తుపెట్టుకో౦డి. (సామెతలు 10:4) ఇలా చేస్తే మీ స్కూల్‌ చదువును చక్కగా పూర్తిచేయవచ్చు. ప్రయత్న౦ చేసి చూడ౦డి, తప్పకు౦డా ప్రతిఫలాన్ని పొ౦దుతారు.