కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి?

నేను కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి?

 క్విజ్‌

 •  మీకు ఎంత తరచుగా కోపం వస్తుంది?

  •  అసలు ఎప్పుడూ రాదు

  •  అప్పుడప్పుడు

  •  ప్రతీరోజు

 •  మీకెంత కోపం వస్తుంది?

  •  కొంచెం

  •  చాలా

  •  పిచ్చికోపం

 •  మీకు ఎవరి మీద ఎక్కువగా కోపమొస్తుంది?

  •  అమ్మానాన్నలు

  •  తోబుట్టువులు

  •  స్నేహితులు

 కోపం తగ్గించుకోవాలని మీరు అనుకుంటుంటే, ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేస్తుంది. అసలు, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండడం ఎందుకు ముఖ్యమో కొన్ని కారణాలను చూద్దాం.

 కోపాన్ని ఎందుకు తగ్గించుకోవాలి?

 మీ మంచికోసం. సామెతలు 14:30 లో బైబిలు ఇలా చెప్తుంది, “ప్రశాంత హృదయం శరీరానికి జీవం కలిగిస్తుంది.” (పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) కానీ ద జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ లైఫ్‌, “కోపం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది” అని చెప్తుంది.

 మీ స్నేహితులు. “కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 22:24) కాబట్టి మీకు ఎక్కువ కోపం ఉంటే, అందరూ మీకు దూరంగా ఉంటారు. జాస్మిన్‌ అనే ఓ యువతి ఇలా అంటోంది, “కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలీకపోతే, మీరు విలువైన మీ స్నేహితులందర్నీ పోగొట్టుకుంటారు.”

 మీకున్న పేరు. “మీకు బాగా కోప్పడే అలవాటు ఉంటే, అది అందరికీ తెలిసిపోతుంది. దాన్నిబట్టి వాళ్లు మీ గురించి ఓ అభిప్రాయానికి వస్తారు” అని 17 ఏళ్ల ఈతన్‌ అంటున్నాడు. ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను ఎలాంటి పేరు సంపాదించుకోవాలి అనుకుంటున్నాను, ప్రశాంతంగా ఉండే వ్యక్తిని అనా లేక ముక్కు మీద కోపం ఉండే వ్యక్తిని అనా?’ బైబిలు ఇలా చెప్తోంది, “దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.”—సామెతలు 14:29.

ఎక్కువ కోపంగా ఉండేవాళ్లతో స్నేహం చేయడం ఎవ్వరికీ ఇష్టముండదు.

 కోపాన్ని తగ్గించుకోవాలంటే ఏమి చేయాలి?

 ఈ లేఖనాలను, కొంతమంది చెప్పిన మాటలను పరిశీలించండి. ఆ తర్వాత కింద ఉన్న ప్రశ్నల గురించి ఆలోచించండి.

 •   సామెతలు 29:22: “కోపిష్ఠుడు కలహము రేపును. ముంగోపి అధికమైన దుష్ర్కియలు చేయును.”

   “నేను టీనేజీలోకి వచ్చినప్పుడు, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. మా నాన్న తరఫు బంధువులందరికీ కూడా కోపం బాగా ఎక్కువ. అది వంశ పారంపర్యంగా వచ్చింది. మాకు కోపం వచ్చిందంటే దాన్ని అదుపు చేసుకోవడం చాలా కష్టం.”—కెరీ.

   నాకు త్వరగా కోపం వస్తుందా? నాలో ఉన్న మంచి లక్షణాలకు నేనే బాధ్యుణ్ణని అనుకున్నప్పుడు, కోపమనే చెడు లక్షణానికి మాత్రం జన్యువులదే బాధ్యత అనడం ఎంత వరకు సరైనది?

 •   సామెతలు 15:1: “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.”

   “భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి, అదే సమస్యలన్నిటికీ పరిష్కారం. సాధు స్వభావాన్ని అలవర్చుకుని, మంచి మీద మనసుపెడితే కోపాన్ని అణుచుకోవడం పెద్ద కష్టంగా ఉండదు.”—డారల్‌.

   నన్ను ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు, నేను వెంటనే ఎలా స్పందిస్తాననేది ఎందుకు చాలా ముఖ్యం?

 •   సామెతలు 26:20: “కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.”

   “నేను కోప్పడకుండా మాట్లాడితే సాధారణంగా అవతలి వ్యక్తి కూడా తగ్గుతాడు. అప్పుడు ఇద్దరం అరుచుకోకుండా ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతాం.”—జాస్మిన్‌.

   నా మాటలు, చేతలు పరిస్థితిని ఇంకా ఎలా దిగజార్చే అవకాశం ఉంది?

 •   సామెతలు 22:3: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.”

   “కొన్నిసార్లు నేను అక్కడి నుండి వెళ్లిపోయి, అసలు ఏమి జరిగిందో ఆలోచించుకోవడం మంచిది. అలా చేస్తే, నా కోపం చల్లారాక దాంతో సరిగ్గా డీల్‌ చేయగలుగుతాను.”—గ్యారీ.

   పరిస్థితి అదుపులో లేనప్పుడు అక్కడి నుండి వెళ్లిపోవడం మంచిది, అయితే మీరు ఎదుటి వ్యక్తిని లెక్కచేయట్లేదు అనే భావన కలిగించకుండా ఉండాలంటే, అక్కడ నుండి ఎప్పుడు వెళ్లిపోవడం మంచిది?

 •   యాకోబు 3:2: “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము.”

   “మనం చేసిన తప్పుల గురించి పశ్చాత్తాపపడాలి, అదే సమయంలో వాటి నుండి పాఠాలు కూడా నేర్చుకోవాలి. మనం ఏదైనా తప్పు చేస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకుని, ఇంకోసారి దాన్ని చేయకుండా జాగ్రత్తపడాలి.”—కెరీ.

 టిప్‌: ఓ లక్ష్యాన్ని పెట్టుకోండి. బహుశా ఓ నెల రోజులు, ఎలాంటి పరిస్థితి వచ్చినా కోప్పడకూడదు అని తీర్మానించుకోండి. ఓ డైరీ పెట్టుకుని మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎంతవరకు సాధించారో ఎప్పుటికప్పుడు చూసుకుంటూ ఉండండి.