యువత అడిగే ప్రశ్నలు
ఓరల్ సెక్స్ నిజంగా ఓ రకమైన సెక్స్ ఏనా?
యు.ఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం, వాళ్లు ఇంటర్వ్యూ చేసిన 15 నుండి 19 ఏళ్లు మధ్య వయసున్న వాళ్లలో సగంమంది ఓరల్ సెక్స్‌లో పాల్గొన్నారు అని తేలింది. “ఒకవేళ మీరు దీనిగురించి [ఓరల్ సెక్స్ గురించి] టీనేజీ వయసున్నవాళ్లతో మాట్లాడితే, అదేమీ పెద్ద తప్పుకాదని అంటారు. అసలు వాళ్లు ఓరల్ సెక్స్‌ను సెక్స్‌లానే చూడరు” అని ఓరల్ సెక్స్ ఈజ్ ద న్యూ గుడ్‌నైట్ కిస్ అనే పుస్తకాన్ని రాసిన షార్లీన్ ఏజమ్ అంటోంది.
మీరేమనుకుంటున్నారు?
ఈ కింది ప్రశ్నలకు అవును లేదా కాదు అని జవాబు చెప్పండి.
ఓరల్ సెక్స్‌లో పాల్గొన్న అమ్మాయి గర్భవతి అవుతుందా?
అవును
కాదు
ఓరల్ సెక్స్‌లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా?
అవును
కాదు
ఓరల్ సెక్స్ నిజంగా ఓ రకమైన సెక్స్ ఏనా?
అవును
కాదు
నిజాలేంటి?
ఈ కిందివాటితో మీ జవాబుల్ని సరిచూసుకోండి.
ఓరల్ సెక్స్‌లో పాల్గొన్న అమ్మాయి గర్భవతి అవుతుందా?
జవాబు: అవ్వదు. అందుకే ఓరల్ సెక్స్ చేయడంవల్ల ఏ హానీ ఉండదని చాలామంది తప్పుగా అనుకుంటారు.
ఓరల్ సెక్స్‌లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా?
జవాబు: వస్తాయి. ఓరల్ సెక్స్‌లో పాల్గొనే వాళ్లకు హెపటైటిస్ (ఎ లేదా బి), జననేంద్రియాల దగ్గర పుండ్లు, గనేరియా, హెర్పిస్, హెచ్‌ఐవి, సిఫిలిస్ వంటి రోగాలు రావచ్చు
ఓరల్ సెక్స్ నిజంగా ఓ రకమైన సెక్స్ ఏనా?
జవాబు: అవును. ఓ వ్యక్తి మర్మాంగాలతో చేసే ఏ పనైనా సెక్సే. శారీరకంగా కలవడం, ఓరల్ సెక్స్, ఏనల్ సెక్స్, వేరే వ్యక్తి మర్మాంగాలను నిమరడం వంటివి ఏవైనా సెక్స్ చేయడమే.
అది ఎందుకు ప్రాముఖ్యమైన విషయం?
ఓరల్ సెక్స్ గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి ఈ కింది లేఖనాల్ని పరిశీలించండి.
బైబిలు ఇలా చెప్తుంది: “మీరు ... లైంగిక పాపానికి దూరంగా ఉండాలి అనేదే దేవుని ఇష్టం.”—1 థెస్సలొనీకయులు 4:3.
“లైంగిక పాపం” అని అనువదించబడిన పదం భర్త/భార్యతో కాకుండా వేరేవాళ్లతో పెట్టుకునే అక్రమ సంబంధాల్ని సూచిస్తుంది. అది శారీరకంగా కలవడం కావచ్చు, ఓరల్ సెక్స్ కావచ్చు, ఏనల్ సెక్స్ కావచ్చు, వేరే వ్యక్తి మర్మాంగాలను నిమరడం కావచ్చు. ఇలాంటివి చేసేవాళ్లు చాలా పెద్దపెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా దేవునితో వాళ్లకున్న స్నేహం పాడవుతుంది.—1 పేతురు 3:12.
బైబిలు ఇలా చెప్తుంది: “లైంగిక పాపం చేసేవాడు ... తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.”—1 కొరింథీయులు 6:18.
ఓరల్ సెక్స్ చేయడం వల్ల మన ఆరోగ్యమే కాదు, ఆధ్యాత్మికత కూడా పాడవుతుంది. మానసికంగా కూడా ఇబ్బందులు పడతాం. టాకింగ్ సెక్స్ విత్ యువర్ కిడ్స్ అనే పుస్తకం ఇలా చెప్తుంది, “చెడిపోయాననే ఫీలింగ్, తప్పు చేశాను, నేనేమీ చేయలేను అనే బాధ కేవలం వజైనల్ సెక్స్ చేయడం వల్ల మాత్రమే కలగదు. అనుకోని సమయంలో శారీరకంగా కలవడం వల్ల మానసికంగా ఎంత బాధ అనుభవిస్తారో, అనుకోని సమయంలో వేరే ఏ రకమైన సెక్స్ చేసినా అంతే బాధ పడాల్సి వస్తుంది. ఏదైనా సెక్స్ చేసినట్లే.”
బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి. నీకు ప్రయోజనం కలిగేలా నేనే నీకు బోధిస్తున్నాను.”—యెషయా 48:17.
సెక్స్ విషయంలో దేవుడిచ్చిన నియమాలు మీకు నిజంగా మంచి చేస్తాయి అని మీరు నమ్ముతున్నారా? లేదా అవి మీ స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నాయని అనిపిస్తుందా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ముందు దీని గురించి ఆలోచించండి. ఎప్పుడూ ట్రాఫిక్‌తో బిజీగా ఉండే హైవే మీద స్పీడ్ లిమిట్‌ని సూచించే గుర్తులు, ట్రాఫిక్ సిగ్నల్‌లు, stop అనే గుర్తులు అక్కడక్కడ ఉన్నాయనుకోండి. అవి చూసినప్పుడు మీరేమనుకుంటారు? మీకు అడ్డుగా ఉన్నాయనుకుంటారా లేక మీ ప్రాణాలు కాపాడడం కోసమే ఉన్నాయనుకుంటారా? ఒకవేళ ఆ గుర్తులను మీరు, వేరే డ్రైవర్లు పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది?
ట్రాఫిక్ రూల్స్ మీ స్వేచ్ఛను కాస్త తగ్గించినప్పటికీ అవి మీ ప్రాణాల్ని కాపాడతాయి. అదేవిధంగా దేవుని నియమాలు మీకు కొన్ని హద్దులు పెట్టినప్పటికీ అవి మీకు మంచే చేస్తాయి
దేవుడిచ్చిన నియమాలు కూడా అలాంటివే. వాటిని పట్టించుకోకపోతే, చేసినవాటికి తగ్గ ఫలితం మనం అనుభవించాల్సి వస్తుంది. (గలతీయులు 6:7) “మీ నమ్మకాలను, విలువలను పక్కన పెట్టేసి, చేయకూడని పనులని తెలిసి కూడా వాటిని చేస్తే, మీమీద మీకున్న గౌరవం తగ్గిపోతుంది” అని సెక్స్ స్మార్ట్ అనే పుస్తకం అంటోంది. దానికి బదులు, మీరు దేవుడిచ్చిన నియమాల ప్రకారం జీవిస్తే, మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకుంటారు. అంతకన్నా ముఖ్యంగా తప్పు చేశావని మీ మనస్సాక్షి మిమ్మల్ని నిందించదు.—1 పేతురు 3:16.