కంటెంట్‌కు వెళ్లు

నాకు ఫ్రెండ్స్‌ ఎవరూ లేక ఒంటరితనంతో బాధపడుతుంటే?

నాకు ఫ్రెండ్స్‌ ఎవరూ లేక ఒంటరితనంతో బాధపడుతుంటే?

మీరేమి చేయవచ్చు

 1. మీకున్న సామర్థ్యాల మీద దృష్టి పెట్టండి. (2 కొరింథీయులు 11:6) మీరు చేసే తప్పులు మీకు తెలిస్తే మంచిదే కాని, మీరు మంచి పనులు కూడా చేస్తారు. మీ సామర్థ్యాలను గుర్తిస్తే మీమీద మీకున్న చెడ్డ అభిప్రాయం పోయి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది దానివల్ల ఒంటరితనాన్ని జయిస్తారు. మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘నాకున్న సామర్థ్యాలు ఏమిటి?’ మీకున్న టాలెంట్స్‌ లేదా మంచి లక్షణాల గురించి ఆలోచించండి.

 2. ఇతరుల పైన నిజమైన శ్రద్ధ చూపించండి. అందరినీ కాకపోయినా కొంతమందిని పలకరించడం నేర్చుకోండి. “ఇతరుల గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఎలా ఉన్నారో, ఏమి చేస్తున్నారో వంటి చిన్న ప్రశ్నలు అడగండి” అని హార్హే అనే యువకుడు అంటున్నాడు.

ఇతరులకు, మీకు మధ్య ఉన్న అగాధాన్ని దాటడానికి మీరే వంతెన కట్టండి

 ఓ సలహా: మీ వయస్సు వాళ్ళతో మాత్రమే స్నేహం చేయకండి. మీకన్నా వయస్సులో పెద్ద వాళ్ళతో కూడా స్నేహం చెయ్యండి. బైబిల్లో మంచి స్నేహితులుగా పేరు తెచ్చుకున్న రూతు-నయోమి, దావీదు-యోనాతాను, పౌలు-తిమోతి అనే వాళ్ళ వయస్సుల్లో చాలా తేడా ఉంది. (రూతు 1:16, 17; 1 సమూయేలు 18:1; 1 కొరింథీయులు 4:17) ఎప్పుడూ మనమే మాట్లాడకూడదు అని గుర్తుంచుకోండి. వేరేవాళ్లు చెప్పేది కూడా వినాలి. ఒకవేళ ఇతరులతో మాట్లాడడం మీకు చాలా సిగ్గు అనుకోండి అప్పుడు వాళ్లు మాట్లాడుతుంటే వినండి. అలా శ్రద్ధగా వినే వాళ్లంటే అందరికీ ఇష్టం.

 3. ఇతరులను అర్థం చేసుకోవడం నేర్చుకోండి. (1 పేతురు 3:8) ఇతరులు చెప్పే విషయం మీకు నచ్చకపోయినా, వాళ్లు పూర్తిగా చెప్పేదాకా ఓపిగ్గా వినండి. మీరిద్దరూ అంగీకరించే విషయాల గురించి ఆలోచించండి. మీకు నచ్చని దాని గురించి వాళ్లకు చెప్పాలనుకుంటే నెమ్మదిగా, జాగ్రత్తగా చెప్పండి.

 ఓ సలహా: ఇతరులు మీతో ఎలా మాట్లాడితే మీకు ఇష్టమో, మీరూ అలాగే మాట్లాడండి. అనవసరంగా వాదించడం, వెక్కిరించడం, అవమానించడం, అంతా మీకే తెలుసని చెప్పడం ఇతరులను మీకు దూరం చేస్తుంది. “మీ సంభాషణ ... ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” అప్పుడు మీరు అందరికీ దగ్గరౌతారు.—కొలొస్సయులు 4:6.