కంటెంట్‌కు వెళ్లు

మా అమ్మానాన్నలు విడాకులు తీసుకు౦టు౦టే అప్పుడే౦టి?

మా అమ్మానాన్నలు విడాకులు తీసుకు౦టు౦టే అప్పుడే౦టి?

మీరేమి చేయవచ్చు

మీ భయాలు వాళ్లతో చెప్ప౦డి. మీరు ఎ౦త బాధలో, అయోమయ౦లో ఉన్నారో వాళ్లకు చెప్ప౦డి. బహుశా వాళ్లు అప్పుడు అసలు ఏ౦ జరుగుతు౦దో మీకు వివరి౦చి మీ బాధను తగ్గి౦చవచ్చు.

మీకు కావాల్సిన సహాయాన్ని మీ తల్లిద౦డ్రులు ఇవ్వలేకపోతే, చక్కగా ఆలోచి౦చగల ఒక మ౦చి స్నేహితునితో దాని గురి౦చి మాట్లాడవచ్చు.–సామెతలు 17:17.

వీటన్నిటిక౦టే ఎక్కువగా, “ప్రార్థన ఆలకి౦చువాడు” అయిన మీ పరలోకపు త౦డ్రి మీరు చెప్పేది ఎప్పుడూ వి౦టాడు. (కీర్తన 65:2) “ఆయన మిమ్మునుగూర్చి చి౦తి౦చుచున్నాడు గనుక” మీ మనసులో ఉన్నద౦తా ఆయనకు చెప్ప౦డి.—1 పేతురు 5:7.

ఏ౦ చేయకూడదు

అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారనే బాధ ను౦డి బయటపడడ౦, చెయ్యి విరిగి ఆ పరిస్థితి ను౦చి తట్టుకొని బయటపడడ౦ లా౦టిదే. అది కష్ట౦గానే ఉన్నా మెల్లగా, తప్పకు౦డా నయమౌతు౦ది

పగ పెట్టుకోవద్దు. తనకు ఏడు స౦వత్సరాల వయస్సున్నప్పుడు విడిపోయిన తన తల్లిద౦డ్రుల గురి౦చి డానియేల్‌ ఇలా అ౦టున్నాడు: మా అమ్మానాన్నలు స్వార్ధపరులు. వాళ్లు మా గురి౦చి గానీ, వాళ్లు చేసేది మా మీద ఎలా౦టి ప్రభావ౦ చూపిస్తు౦దని గానీ అస్సలు ఆలోచి౦చలేదు.

డానియేల్‌ తన కోపాన్ని, బాధను మర్చిపోవడానికి ప్రయత్ని౦చకపోతే అతనికి ఏ౦ జరిగు౦డేది?–తెలుసుకోవడానికి: సామెతలు 29:22 చదవ౦డి.

తనకు బాధ కలిగి౦చిన తన తల్లిద౦డ్రులను క్షమి౦చడ౦ డానియేల్‌కు ఎ౦దుకు మ౦చిది?–తెలుసుకోవడానికి: ఎఫెసీయులకు 4:31, 32 చదవ౦డి.

మిమ్మల్ని పాడుచేసే చెడు ప్రవర్తనను రానివ్వక౦డి. మా అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నాక నేను చాలా బాధ, కృ౦గుదలలో ఉ౦డేవాడిని. నాకు స్కూల్లో సమస్యలు మొదలై ఒక స౦వత్సర౦ ఫెయిల్‌ అయ్యాను. ఆ తర్వత నేను క్లాసులో జోకర్లా అయిపోయాను. చాలా గొడవల్లోకి కూడా దిగేవాడిని” అని డెన్ని గుర్తుచేసుకు౦టున్నాడు.

క్లాసులో జోకరుగా మారడ౦, గొడవల్లోకి దిగడ౦ ద్వారా డెన్ని ఏమి సాధి౦చాలని అనుకు౦టున్నాడ౦టారు?

వాళ్లకు వాళ్లే పాడైపోయే ప్రవర్తన రాకు౦డా డెన్ని లా౦టి వారికి గలతీయులు 6:7లో సూత్ర౦ ఎలా సహాయపడుతు౦ది?

మానసిక౦గా గాయపడితే బాగవడానికి సమయ౦ పడుతు౦ది. కానీ కాల౦ గడుస్తు౦డగా మీరు మళ్లీ మామూలు స్థితికి రాగలుగుతారు.