కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

మీడియా చూపించేవాటిని ఎందుకు అనుసరించకూడదు?—2వ భాగం: అబ్బాయిల కోసం

మీడియా చూపించేవాటిని ఎందుకు అనుసరించకూడదు?—2వ భాగం: అబ్బాయిల కోసం

 మీడియా ఏమి చూపిస్తుంది?

 ఈ పదాలను చూసి తర్వాత వచ్చే ప్రశ్నలకు జవాబివ్వండి.

1వ వరుస

2వ వరుస

తిరుగుబాటు స్వభావం గలవాడు

గౌరవనీయుడు

స్వార్థపరుడు

నమ్మదగినవాడు

బలవంతుడు

తథానుభూతి గలవాడు

సోమరిపోతు

కష్టపడి పనిచేసే తత్వం

బాధ్యతారాహిత్యంగా ఉంటాడు

బాధ్యతాయుతంగా ఉంటాడు

మోసం చేసే స్వభావం గలవాడు

నిజాయితీపరుడు

  1.   టీనేజీ అబ్బాయిలను మీడియా (అందులో సినిమాలు, టీ.వీ., ప్రకటనలు కూడా ఉన్నాయి) ఎలా చూపిస్తుంది?

  2.   ఈ పదాల్లో చెప్పిన ఎలాంటి వ్యక్తిగా ఇతరులు మిమ్మల్ని చూడాలని మీరు కోరుకుంటారు?

 బహుశా మొదటి ప్రశ్నకు మీ జవాబులు 1వ కాలమ్‌ నుంచి, రెండవ ప్రశ్నకు మీ జవాబులు 2వ కాలమ్‌ నుంచి ఎంపిక చేసుకొని ఉంటారు. అలా చేసుంటే మంచి పని చేశారు. ఎందుకంటే వాస్తవానికి మీరు ఎలాంటి వ్యక్తో, లేదా మీరు ఎలాంటి వ్యక్తిగా ఉంటే మంచిదో మీడియా అబ్బాయిలను అలా చూపించడం లేదు. అదెందుకో గమనించండి.

  •   మీడియా తరచూ మగవాళ్లను క్రూరమైన వ్యక్తులుగా, తిరుగుబాటు చేసేవాళ్లుగా చిత్రీకరిస్తుంది. వై బాయ్స్‌ డోంట్‌ టాక్‌ అండ్‌ వై ఇట్‌ మ్యాటర్స్‌ అనే పుస్తకం ఏం చెప్తుందంటే, టీ.వీ.ల్లో, సినిమాల్లో, క్రీడారంగంలో బాగా పేరుతెచ్చుకున్న మగవాళ్లు “మంచి శారీరిక బలంతో, ఆవేశంగా కనిపిస్తారు. . . . కాబట్టి బలంగా, తిరిగుబాటు చేసేవాళ్లుగా ఉండడమే గొప్పని వాళ్లు చూపిస్తున్నారు.”

     ఆలోచించండి: మీరు మంచి స్నేహితులు, చక్కగా కలిసి పని చేసేందుకు తగిన వ్యక్తి, మంచి భర్త అయ్యేందుకు ఉద్రేకంగా ప్రవర్తించేవాళ్లు ఎవరైనా మీకు సహాయం చేయగలరా? రెచ్చగొట్టినప్పుడు కోపాన్ని వెళ్లగక్కడానికి ఎక్కువ శక్తి కావాలా? లేక నిగ్రహించుకోవడానికి ఎక్కువ శక్తి కావాలా? మీరు చక్కగా పరిణతి చెందిన వ్యక్తని ఏది రుజువు చేస్తుంది?

     బైబిలు ఇలా చెప్తుంది: “పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు.”—సామెతలు 16:32.

    మీ కోపాన్ని కంట్రోల్‌ చేసుకోగలిగితే, మీరు యుద్ధం చేసే గొప్ప యోధుని కంటే బలంగా ఉన్నట్లే

  •   మగవాళ్లు ఎక్కువగా సెక్స్‌ గురించే ఆలోచిస్తారన్నట్లు మీడియా వాళ్లను చూపిస్తుంది. “సినిమాల్లో, టీ.వీ.ల్లో అబ్బాయిలు షర్టు మార్చినంత తేలిగ్గా గర్ల్‌​ఫ్రెండ్స్‌ని మార్చేస్తారు” అని 17 ఏళ్ల క్రిస్‌ అంటున్నాడు. 18 ఏళ్ల గ్యారీ దీని గురించే ఇంకొంచెం వివరిస్తూ ఇలా అంటున్నాడు, “సాధారణంగా అబ్బాయిలు సెక్స్‌ గురించే ఎక్కువగా ఆలోచిస్తారన్నట్లు మీడియా వాళ్లను చూపిస్తుంది.” ఉదాహరణకు కొన్ని సినిమాలు పార్టీ చేసుకోవడం, తాగడం, సెక్స్‌లో పాల్గోనడం ఇవే ఒక అబ్బాయికి ఉండే జీవిత లక్ష్యాలు అన్నట్లు చూపిస్తాయి.

     ఆలోచించండి: నిజానికి మీరు ఎలాంటి వాళ్లని పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు? మీడియా కూడా అదే చూపిస్తుందా? ఒక నిజమైన మగాడు ఆడవాళ్లను సెక్స్‌ కోసం వాడకునే వస్తువుల్లా చూస్తాడా? లేక వాళ్లను గౌరవిస్తాడా?

     బైబిలు ఇలా చెప్తుంది: “మీలో ప్రతివాడును . . . కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.”​—1 థెస్సలొనీకయులు 4:4, 5.

  •   మీడియా అబ్బాయిలను బాధ్యతలేనివాళ్లుగా చూపిస్తుంది. చాలామంది బాగా చూసే సినిమాలు, టీ.వీ. కార్యక్రమాల్లో తరచూ అబ్బాయిలను సోమరిపోతులుగా, పోటిపడి పనిచేసే తత్వం లేనివాళ్లుగా చూపిస్తారు. బహుశా అందుకే కొంతమంది పెద్దవాళ్లు అబ్బాయిలకు ఉండే శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేస్తారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న గ్యారీ ఇలా చెప్తున్నాడు, “నాకు 16 ఏళ్లు వచ్చినప్పుడు, ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. ఎందుకంటే మా ప్రాంతంలోని వ్యాపార యజమానులు కేవలం అమ్మాయిలనే పనిలో పెట్టుకోవాలి అనుకునేవాళ్లు. టీనేజీ అబ్బాయిలు అందరూ బాధ్యతగా ఉండరని, నమ్మదగినవాళ్లు కాదని వ్యాపార యజమానులు అనుకోవడమే అందుకు కారణం.”

     ఆలోచించండి: ఒక టీనేజీ అబ్బాయిని బాధ్యతలేనివాడిగా, నమ్మదగని వ్యక్తిగా చూపించడం కరక్టేనా? మీరు అలాంటి వాళ్లు కాదని ఎలా చూపించవచ్చు?

     బైబిలు ఇలా చెప్తుంది: “నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.”—1 తిమోతి 4:12.

 మీరు తెలుసుకోవాల్సినవి

  •   మీడియా మీపై బలంగా ప్రభావం చూపించవచ్చు. ఉదాహరణకు మీరు బాగా పావులర్‌ అవ్వాలంటే, ఇప్పుడు అందరూ ఫాలో అయ్యే ఫ్యాషన్‌ ట్రెండునే మీరూ ఫాలో అవ్వాలని మీరు భావించేలా చేయగలదు మీడియా. దీని గురించి 17 ఏళ్ల కోలిన్‌ ఇలా అంటున్నాడు “ప్రకటనల్లో అబ్బాయిలు ఎలా డ్రస్‌ చేసుకోవాలో చూపిస్తూ, అలాంటి అబ్బాయిలకు అమ్మాయిలు ఆకర్షితులై వాళ్ల చుట్టూనే ఉంటారు అన్నట్టుగా చూపిస్తారు. అవి చూసినవాళ్లు తాము కూడా అలాంటి బట్టలే కొనుక్కోవాలి అనుకుంటారు. కొన్నిసార్లు నేను కూడా అలాగే చేశాను.”

     ఆలోచించండి: మీ బట్టలు మీరు నిజంగా ఎలాంటి వాళ్లో చూపిస్తున్నాయా? లేదా అందరూ ఏంచేస్తే మీరూ అదే చేస్తున్నారా? ఫ్యాషన్‌ అని చెప్పే ఇప్పుడన్న సరికొత్త ట్రెండ్స్‌ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తూ, వాటిమీద డబ్బు ఖర్చుపెట్టడం వల్ల ఎవరు నిజంగా లాభం పొందుతారు?

     బైబిలు ఇలా చెప్తుంది: ‘ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు.’—రోమీయులు 12:2.

  •   మీడియా చూపించేవాటిని అనుసరిస్తే అమ్మాయిలు మిమ్మల్ని అంతగా ఇష్టపడకపోవచ్చు. ఇలాంటి అనుభవం ఉన్న కొంతమంది ఏం చెప్తున్నారో గమనించండి:

    •  “అభద్రతా భావంతో, ఎదుటివాళ్లను ఇంప్రెస్‌ చేయడానికి తనది కాని వ్యక్తిత్వాన్ని నటించే అబ్బాయికంటే, ఏ మాత్రం నటించకుండా నిజంగా తను ఎలాంటివాడో అలాగే కనిపించే అబ్బాయిని నేను ఎక్కువ ఇష్టపడతాను. ఇది నిజం, ఎదుటివాళ్లను ఇంప్రెస్‌ చేయడానికి అతిగా ప్రయత్నించే అబ్బాయి మరింత అద్వానంగా కనిపిస్తాడు.”—అన్న.

    •  “అమ్మాయిలకు ఆకర్షణీయంగా కనిపించాలంటే అబ్బాయిలకు కొన్ని ఆధునిక పరికరాలు ఉండాలని (స్మార్ట్‌ ఫోన్‌), వాళ్లు కనబడే తీరు ఫలానా విధంగానే ఉండాలని అబ్బాయిలు అనుకుంటున్నారు. వాటిని ప్రచారం చేసేవాళ్లే అందుకు కారణం. అమ్మాయిలు పరిణతి సాధించే కొద్దీ ఇలా పైపైన కనిపించేవాటికి పడిపోరు. అబ్బాయిలకు ఉండే లక్షణాలను, వాళ్లు ఇతరులతో ప్రవర్తించే తీరును గమనిస్తారు. ఉదాహరణకు నిజాయితీగా, నమ్మకంగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు.”—డానియెల్‌.

    •  “తరచూ ‘చాలా ఆకర్షణీయంగా కనిపించే అబ్బాయిలు’ పొగరుబోతులుగా ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి చుట్టుపక్కల ఉండడానికి కూడా నేను ఇష్టపడను. మీరు ప్రపంచంలోకెల్లా అందమైన అబ్బాయే కావొచ్చు, కానీ అందుకు తగిన మంచి ప్రవర్తన లేకపోతే చాలా అందవిహీనంగా కనిపిస్తారు.”—డయానా.

     ఆలోచించండి: సమూయేలు అనే అబ్బాయిని వర్ణిస్తూ అతను “ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను” అని లేఖనాలు చెప్తున్నాయి. (1 సమూయేలు 2:26) మీరు కూడా అలాంటి మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎలాంటి లక్షణాలు వృద్ధి చేసుకోవడానికి మరింత కృషి చేయాలి?

     బైబిలు ఇలా చెప్తుంది: “పౌరుషముగలవారై యుండుడి.”—1 కొరింథీయులు 16:13.

 మీరిలా చేయవచ్చు

  •   మీరు చూసేవాటి గురించి ప్రశ్నించుకోండి. బైబిలు చెప్తున్న ఈ మాటను గమనించండి: “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.”—1 యోహాను 2:16.

     మీడియా అలాంటివాటిని పెంచిపోషిస్తూ అవన్నీ సర్వసాధారణం అన్నట్టు చూపిస్తుంది. కాబట్టి మీరు చూసేవాటి గురించి ప్రశ్నించుకోవడం నేర్చుకోండి. మీరు మీడియా ద్వారా చూసేవి తరచూ వ్యాపారవేత్తలు డబ్బులు సంపాదించుకోవడానికి సృష్టించినవే.

  •   మిమ్మల్ని మీరు మలుచుకోండి. మీడియా చూపిస్తున్నట్లు కాకుండా “జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును” ధరించుకోండి అని బైబిలు చెప్తున్నట్లుగా మిమ్మల్ని మీరు మలుచుకోండి.—కొలొస్సయులు 3:10.

     ఈ ఆర్టికల్‌ మొదట్లో చర్చించిన లక్షణాల గురించి, ముఖ్యంగా మీరు ఎలాంటి వ్యక్తిగా గుర్తింపు పొందాలనుకుంటున్నారో ఆ మంచి లక్షణాల గురించి మరోసారి ఆలోచించండి. బైబిలిచ్చే సలహాలను పాటించడానికి అవి మీకు సహాయం చేస్తాయి. ఆ మంచి లక్షణాలను సంపాదించుకోవడానికి లేదా వాటిని వృద్ధిచేసుకోవడానికి ఇప్పుడే ఎందుకు కృషి చేయకూడదు?

  •   మంచి స్పూర్తినిచ్చే వాళ్ల కోసం చూడండి. “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 13:20) మీ జీవితంలో మీకు తెలిసిన అలాంటి జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారా? మీ కుటుంబంలో మీ న్నాన్నగారు గానీ, మీ అంకుల్‌ గానీ ఎవరైనా అలాంటి వాళ్లు ఉండి ఉండొచ్చు. పరిణతి చెందిన స్నేహితుడో లేక పరిచయం ఉన్న ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో ఆలోచించండి. యెహోవాసాక్షుల్లోని క్రైస్తవసంఘంలో అలాంటి చాలామంది మాదిరికరమైన సహోదరులు ఉన్నారు. యౌవనులు అనుసరించేందుకు మంచి మాదిరి ఉంచిన తీతుతోపాటు బైబిల్లో అలాంటి చాలామంది మాదిరికరమైన వ్యక్తులు ఉన్నారు.—తీతు 2:6-8.

     సలహా: హేబెలు, నోవహు, అబ్రాము, సమూయేలు, ఏలీయా, యోనా, యోసేపు, పేతురుతోసహా పురుషులకు మంచి ఆదర్శంగా ఉన్న బైబిల్లోని అనేకమంది గురించి వాళ్లలా విశ్వాసాన్ని అనుకరించండి పుస్తకం సహాయంతో నేర్చుకోండి.