వివాహం, కుటుంబం

మేము సహజీవనం చేయవచ్చా?

తెలుగు
మేము సహజీవనం చేయవచ్చా?
https://cms-imgp.jw-cdn.org/img/p/500300124/univ/art/500300124_univ_sqr_xl.jpg
ijwhf ఆర్టికల్‌ 34

కుటుంబం కోసం | పెళ్లి

మేము సహజీవనం చేయవచ్చా?

మేము సహజీవనం చేయవచ్చా?

 చాలామంది జంటలు పెళ్లికి ముందే కలిసి జీవిస్తారు. ఒకరికొకరు సరిపోతారో లేదో తెలుసుకోవడానికి, పెళ్లి తర్వాత సమస్యలు రాకుండా చూసుకోవడానికి కొంతమంది అలా సహజీవనం చేయాలని అనుకుంటారు. మరి, పెళ్లికి ముందే అలా కలిసి ఉండడం తెలివైన పనేనా?

ఈ ఆర్టికల్‌లో

 బైబిలు ఏం చెప్తుంది?

  •   పెళ్లి కాకుండా సెక్స్‌ చేయడం తప్పని బైబిల్లో ఉంది. అది ఇలా చెప్తుంది: “లైంగిక పాపానికి దూరంగా ఉండాలి.” (1 థెస్సలొనీకయులు 4:3; 1 కొరింథీయులు 6:18) దానర్థం, ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అనే ఆలోచనతో సహజీవనం చేస్తున్నవాళ్లు సెక్స్‌ చేయడం తప్పు. a పెళ్లికి ముందే గర్భం రాకుండా, సహజీవనం వల్ల వచ్చే చెడు పర్యవసానాలు రాకుండా బైబిలు ప్రమాణాలు కాపాడతాయి.

  •   పెళ్లిని దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఇలా అన్నాడు: “పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి, తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లు ఒక్క శరీరం అవుతారు.” (ఆదికాండం 2:24) కుటుంబం నిలబడాలన్నా, దాంట్లో ప్రేమ ఉండాలన్నా పెళ్లే దాని పునాది.

 సహజీవనం మిమ్మల్ని పెళ్లికి సిద్ధం చేస్తుందా?

 కొంతమంది అవుననే అంటారు. కలిసి ఇంటి పనులు చేసుకున్నప్పుడు, ఒకరినొకరు దగ్గరగా గమనించిన్నప్పుడు ఒక జంటగా తమకు మంచి అనుభవం వస్తుందని అనుకుంటారు. కానీ పెళ్లిలో అన్నిటికన్నా ఎక్కువగా కావాల్సింది, ఒకరినొకరు అస్సలు విడిచిపెట్టరనే ధీమా.

 కష్టం వచ్చినా, నష్టం వచ్చినా విడిపోకుండా ఉండడం ఒక జంట ఎలా నేర్చుకోవచ్చు? ట్రై చేసి చూద్దాంలే, నచ్చితే ఉంటాం లేదా విడిపోతాం అనేలాంటి బంధాల్లో అడుగుపెట్టి మాత్రం కాదు. దానికి బదులు, చావు తప్ప మమ్మల్ని ఏది వేరు చేయలేదు అనే నమ్మకం, కష్టం వస్తే కలిసి పోరాడతాం అనే ధీమా ఉంటే బంధాలు బలంగా ఉంటాయి.

 ఒక్క మాటలో: నిజానికి, సహజీవనం చేస్తున్నవాళ్లు పెళ్లికి కాదు, విడిపోవడానికి సిద్ధపడుతున్నారు.

 బైబిలు సూత్రం: “మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు.”—గలతీయులు 6:7.

 సహజీవనం చేయడం వల్ల డబ్బులు ఆదా చేయవచ్చా?

 కొంతమంది అవుననే అంటారు. అమెరికాలో సహజీవనం చేస్తున్న ప్రతీ పదిమందిలో నలుగురు, డబ్బులు ఆదా చేయడానికే అలా కలిసి ఉంటున్నారని ప్యూ రీసర్చ్‌ సెంటర్‌ చేసిన ఒక సర్వేలో తేలింది. అలా కొంతకాలం కలిసి జీవించిన తర్వాత కూడా, పెళ్లి చేసుకునేంత డబ్బులు లేవని చాలామంది చెప్తున్నారు.

 పెళ్లికి ముందే సహజీవనం చేస్తే ఇంకొన్ని సమస్యలు కూడా రావచ్చు, ముఖ్యంగా ఆడవాళ్లకి. ఎందుకంటే, ఒక్కసారి సహజీవనం ఆగిపోతే దానివల్ల పుట్టిన పిల్లల ఆలనా-పాలనా చాలావరకు ఆడవాళ్ల మీదే పడుతుంది.

 ఒక్క మాటలో: సహజీవనంలో ఉన్న లాభాల మాట అటుంచితే, నష్టాలు మాత్రం ఎక్కువే.

 బైబిలు సూత్రం: “యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి. నీకు ప్రయోజనం కలిగేలా నేనే నీకు బోధిస్తున్నాను.”—యెషయా 48:17.

 మనకు సరిపోని వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా సహజీవనం కాపాడుతుందా?

 కొంతమంది అవుననే అంటారు. కానీ, “పెళ్లికి ముందే కలిసి జీవిస్తే ఆ తర్వాత బ్రేకప్‌ చెప్పడం చాలా చాలా కష్టం” అని ఫైటింగ్‌ ఫర్‌ యువర్‌ మ్యారేజ్‌ అనే పుస్తకం చెప్తుంది. ఎందుకు? సహజీవనం చేసే జంటలకు, తాము ఒకరికొకరం అస్సలు సరిపోమని అర్థం అవ్వొచ్చు. కానీ కలిసి అద్దె కట్టుకోవడం, కలిసి ఇష్టంగా ఒక జంతువును పెంచుకోవడం, లేదా అనుకోకుండా ప్రెగ్నెన్సీ రావడం లాంటి కారణాలవల్ల, ఇక వేరే దారి లేక కలిసి ఉంటున్నారని పరిశోధకులు చెప్తున్నారు. ఫైటింగ్‌ ఫర్‌ యువర్‌ మ్యారేజ్‌ అనే పుస్తకం ఇంకా ఇలా చెప్తుంది: “కలిసి ఉండడం అలవాటు అవ్వడం వల్ల, కొంతమంది బ్రేకప్‌ చెప్పాలని ఉన్నా పెళ్లి చేసేసుకుంటున్నారు.”

 ఒక్క మాటలో: సాధారణంగా, తమకు సరిపోయే వ్యక్తిని ఎంచుకోవడానికి సహజీవనం చేస్తామని కొంతమంది అనుకుంటారు. కానీ నిజానికి సహజీవనం చేయడం వల్ల ఆ వ్యక్తి సరిపోరని తెలిసినా, ఆ బంధాన్ని తెంచేసుకోవడం కష్టంగా మారవచ్చు.

 బైబిలు సూత్రం: “వివేకం గలవాడు అపాయాన్ని చూసి దాక్కుంటాడు, అనుభవం లేనివాడు నేరుగా ముందుకెళ్లి పర్యవసానాలు అనుభవిస్తాడు.”—సామెతలు 22:3.

 ఇంకేదైనా మంచి మార్గం ఉందా?

 సహజీవనం అనే తప్పుదారిలో వెళ్లకుండా కూడా మీరు ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. అదెలా? పెళ్లి విషయంలో బైబిలు ప్రమాణాల్ని అంటిపెట్టుకోవడం వల్ల అలా చేయవచ్చు. భార్యాభర్తలుగా మీరు కలిసి జీవించడం మొదలుపెట్టకముందే, ఆ వ్యక్తి మీకు సరిపోతారా లేరా అని టైం తీసుకుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. అందం, రూపం కాకుండా మీకూ వాళ్లకూ ఒకేలాంటి విలువలు, నమ్మకాలు ఉన్నాయో లేవో చూసుకోండి అప్పుడు మీ పెళ్లి జీవితం బావుంటుంది.

 ఒక పెళ్లి నిలబడడానికి, సంతోషంతో కళకళలాడడానికి బైబిలు సలహాలే మంచి పునాది. b ఉదాహరణకు, బైబిలు సూత్రాలు ఈ కింది పనులు చేసేలా మీకు సహాయం చేస్తాయి . . .

 ఇలాంటి అంశాల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి jw.orgలో “వివాహం, కుటుంబం“ అనే సెక్షన్‌ చూడండి.

 బైబిలు సూత్రం: ‘లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి బోధించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.’—2 తిమోతి 3:16.

b కొన్ని సంస్కృతుల్లో, అమ్మానాన్నలే తమ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తారు. అయితే, వాళ్లు ఒక అబ్బాయిలో గానీ, అమ్మాయిలో గానీ ఏ లక్షణాలు చూడాలో బైబిలు చెప్తుంది.