బైబిలు ఇచ్చే జవాబు

యేసుక్రీస్తు, “నేను దేవుని కుమారుడను” చెప్పాడు. (యోహాను 10:35; 11:4) యేసు తాను సర్వశక్తిగల దేవుడని ఎప్పుడూ చెప్పుకోలేదు.

అ౦తేకాదు, యేసు దేవునికి ప్రార్థి౦చాడు. (మత్తయి 26:39) తన అనుచరులకు ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్తూ యేసు ఇలా అన్నాడు, “పరలోకమ౦దున్న మా త౦డ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక”—మత్తయి 6:9.

చాలాకాల౦ క్రిత౦ రాసిన లేఖనాలను ఎత్తి మాట్లాడుతూ యేసు, దేవుని పేరును అ౦దరికీ చెప్పాడు, “ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు [“యెహోవా,” NW] అద్వితీయ ప్రభువు [“యెహోవా,” NW].”—మార్కు 12:29; ద్వితీయోపదేశకా౦డము 6:4.