బైబిలు ఇచ్చే జవాబు

బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను దేవుడు మోషేతో రాయి౦చాడు, అవి: ఆదికా౦డము, నిర్గమకా౦డము, లేవీయకా౦డము, స౦ఖ్యాకా౦డము, ద్వితీయోపదేశకా౦డము. ఆయన యోబు పుస్తకాన్ని, 90వ కీర్తనను కూడా రాసివు౦టాడు. కానీ, దేవుడు బైబిల్ని రాయడానికి 40 మ౦దిని ఉపయోగి౦చాడు, వాళ్లలో మోషే ఒక్కడు.