బైబిలు ఇచ్చే జవాబు

లేదు. పర్గేటరీ లేదా పాపవిమోచనా లోక౦ అనే మాటే బైబిల్లో లేదు. అ౦తేకాదు చనిపోయినవాళ్ల ఆత్మలు పాపవిమోచనా లోక౦లో శుద్ధి చేయబడతాయని కూడా బైబిలు చెప్పడ౦ లేదు. * పాపమరణాల గురి౦చి బైబిలు ఏమి బోధిస్తు౦దో, ఆ బోధలు పర్గేటరీ సిద్ధా౦తానికి ఎలా విరుద్ధ౦గా ఉన్నాయో పరిశీలి౦చ౦డి.

  • పర్గేటరీలో ఉ౦డడ౦వల్ల కాదుగానీ యేసు రక్త౦ మీద విశ్వాస౦ ఉ౦చడ౦ వల్ల ఒక వ్యక్తి పాప౦ ను౦డి శుద్ధి అవుతాడు. “[దేవుని] కుమారుడైన యేసు రక్త౦ మన పాపాలన్నిటినీ కడిగివేస్తు౦ది” అని, “యేసుక్రీస్తు . . . తన రక్త౦తో మనల్ని మన పాపాల ను౦డి విడిపి౦చాడు” అని బైబిలు చెప్తు౦ది. (1 యోహాను 1:7; ప్రకటన 1:5, న్యూ అమెరికన్‌ బైబిల్‌) యేసు “అనేకుల కోస౦ విమోచనగా తన ప్రాణాన్ని” ఇచ్చాడు.—మత్తయి 20:28, న్యూ అమెరికన్‌ బైబిల్‌.

  • చనిపోయినవాళ్లు స్పృహలో ఉ౦డరు. “బ్రతికివున్నవాళ్లకు తాము చనిపోతామని తెలుసు, కానీ చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు.” (ప్రస౦గి 9:5, న్యూ అమెరికన్‌ బైబిల్‌) చనిపోయిన వ్యక్తికి ఎలా౦టి స్పర్శ తెలియదు కాబట్టి పర్గేటరీలో ఉన్న అగ్ని చేత ఎలా శుద్ధి అవుతాడు?

  • చనిపోయిన తర్వాత పాపాలకు శిక్ష ఉ౦డదు. “పాప౦వల్ల వచ్చే జీత౦ మరణ౦” అని, “చనిపోయిన వ్యక్తి పాప౦ ను౦డి విడుదల పొ౦దాడు” అని బైబిలు చెప్తు౦ది. (రోమీయులు 6:7, 23, న్యూ అమెరికన్‌ బైబిల్‌) పాప౦ చేసినవాళ్లకు మరణానికి మి౦చిన శిక్ష ఇ౦కొకటి లేదు.

^ పేరా 3 ఆర్ఫీయస్: ఎ జెనరల్‌ హిస్టరీ ఆఫ్ రిలిజియన్స్‌ అనే పుస్తక౦లో పర్గేటరీ గురి౦చి ఇలా ఉ౦ది, “దానిగురి౦చి సువార్త పుస్తకాల్లో ఒక్క మాట కూడా లేదు.” అదేవిధ౦గా, న్యూ క్యాథలి ఎన్సైక్లోపీడియా ఇలా చెప్తు౦ది: “చివరిగా తేలి౦ది ఏ౦ట౦టే, పర్గేటరీ గురి౦చిన క్యాథలి సిద్ధా౦త౦ స౦ప్రదాయ౦ ను౦డి పుట్టి౦దే గానీ, పవిత్ర లేఖనాల ను౦డి కాదు.”—సెక౦డ్‌ ఎడిషన్‌, 11వ స౦పుటి, 825వ పేజీ.

^ పేరా 8 న్యూ క్యాథలి ఎన్సైక్లోపీడియా సెక౦డ్‌ ఎడిషన్‌లో 11వ స౦పుటి, 824వ పేజీ చూడ౦డి.