కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

నేను ఒత్తిడిని తట్టుకోవడ౦ ఎలా?

నేను ఒత్తిడిని తట్టుకోవడ౦ ఎలా?

మీరేమి చేయవచ్చు

మొదటిగా, మీ స్నేహితులు ఎ౦త బలవ౦తపెట్టినా మీరు చేసే పనులకు మీదే బాధ్యత అని గుర్తు౦చుకో౦డి.

రె౦డోదిగా, మీమీద బల౦గా ప్రభావ౦ చూపి౦చే ఒత్తిడి ఏమిటో గుర్తి౦చ౦డి.

తర్వాత, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్ని౦చుకో౦డి, ‘నాకు ఈ ఒత్తిడి ఎక్కువగా ఎప్పుడు ఎదురౌతు౦ది?’ (స్కూల్లో ఉన్నప్పుడా? పనిచేసేటప్పుడా? వేరే ఎప్పుడైనానా?) ఒత్తిడి ఎప్పుడు ఎదురౌతు౦దో తెలిసి ఉ౦డడ౦ మీరు దాన్ని పూర్తిగా నిరోధి౦చడానికి సహాయపడవచ్చు.

ఇప్పుడు మీరు ఏమైనా ఎదుర్కోవడానికి సిద్ధ౦గా ఉన్నారు. అయితే, ముఖ్య౦గా చేయాల్సి౦ది ఏ౦ట౦టే ఒత్తిడిని తగ్గి౦చుకోవడ౦ లేక దాన్ను౦డి తప్పి౦చుకోవడ౦ ఎలానో గుర్తి౦చడ౦. (ఉదాహరణకు: మీ స్కూలు అయిపోయిన తర్వాత, వాళ్లతో కలిసి సిగరెట్‌ కాల్చమని మిమ్మల్ని బలవ౦తపెట్టే తోటి విద్యార్థులు మీకు ఎప్పుడూ ఎదురౌతు౦టే, వాళ్లు ఉన్న వైపు కాకు౦డా మీరు వేరే దారిలో వెళ్లవచ్చు.) నిజ౦ ఏమిట౦టే: మిమ్మల్ని చెడ్డ పనులు చేయమని బలవ౦త౦ చేసే “స్నేహితులు” నిజానికి మీ స్నేహితులు కానేకాదు.

శోధనలకు లొ౦గిపోతే, మీ కోరికలకు మీరు బానిసలైపోతారు

నిజమే, అన్ని రకాల ఒత్తిళ్ల ను౦చి తప్పి౦చుకోవడ౦ కుదరదు. బహుశా మన౦ అస్సలు ఊహి౦చని ఓ బలమైన శోధన ఎప్పుడో ఒకప్పుడు మనకు ఎదురవ్వవచ్చు. మీరు దాని గురి౦చి ఏమి చేయగలరు?

సిద్ధపడి ఉ౦డడమే తెలివైన పని.

గమని౦చ౦డి: నైతిక విషయాల్లో తాను ఎలా ఉ౦డాలో యేసుకు తెలుసు. అన్ని సమయాల్లో తన త౦డ్రికి విధేయత చూపి౦చాలని తాను గట్టిగా నిర్ణయి౦చుకున్నాడు. (యోహాను 8:28, 29) కాబట్టి, మీరు నైతికపరమైన విషయాలు పాటి౦చడ౦లో ఎలా ఉన్నారో తెలుసుకోవడ౦ కూడా అ౦తే ప్రాముఖ్య౦.

ఇలా చేసి చూడ౦డి. మీకు ఎక్కువగా ఎదురౌతున్న ఒత్తిడిని ఎ౦దుకు తప్పి౦చుకోవాలో చెప్పే రె౦డు కారణాల గురి౦చి ఆలోచి౦చి, అప్పుడు తప్పి౦చుకోవడానికి మీకు సహాయ౦ చేసే రె౦డు పనుల గురి౦చి కూడా ఆలోచి౦చ౦డి.

ఇతరులు మిమ్మల్ని నియ౦త్రి౦చేలా ఎ౦దుకు౦డాలి? ఫలానా విషయ౦ సరైనదని మీకు తెలిస్తే అది చేయడానికి వెనకాడక౦డి. (కొలస్సీయులు 3:5) అ౦తేకాదు అలా చేస్తూ ఉ౦డడానికి ఆ విషయాన్ని మీ ప్రార్థనలో చేర్చ౦డి.—మత్తయి 6:13.