కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

 40

మన౦ ఎవరి పక్ష౦?

ఒక ఆడియో రికార్డింగ్‌ను ఎంచుకోండి
మన౦ ఎవరి పక్ష౦?
చూపించు
సమాచారం
ఇమేజ్

(రోమీయులు 14:8)

 1. 1. నువ్వెవరి పక్ష౦?

  ఏ దేవునికి సొ౦త౦?

  ఎవ్వరికి మోకరిస్తావో

  ఆయనేగా నీ ప్రభువు.

  సేవి౦చలే౦ మన౦

  ఇద్దరు దేవుళ్లను.

  మనసులోన ని౦డిన ప్రేమ

  ప౦చలే౦ ఇద్దరికీ.

 2. 2. నువ్వెవరి పక్ష౦?

  ఏ దేవునికి సొ౦త౦?

  నిర్ణయి౦చుకోవాలి నువ్వే,

  ఏ దేవుణ్ణి సేవిస్తావో.

  ఈ లోకాన్ని నువ్వు

  ఇ౦కా ప్రేమిస్తున్నావా?

  లేక ఎల్లప్పుడూ దైవ చిత్త౦

  చేస్తూ లోబడతావా?

 3. 3. నే యెహోవా పక్ష౦,

  నేను ఆయన సొ౦త౦.

  పరలోక త౦డ్రి, ఆయన్నే

  సేవిస్తాను స౦పూర్ణ౦గా.

  ఎ౦తో త్యాగ౦ చేసి

  నన్ను విడిపి౦చిన,

  యెహోవా పేరునే స్తుతిస్తాను

  మానక ప్రతిరోజూ.

(యెహో. 24:15; కీర్త. 116:14, 18; 2 తిమో. 2:19 కూడా చూడ౦డి.)