కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

 4

“యెహోవా నా కాపరి”

ఒక ఆడియో రికార్డింగ్‌ను ఎంచుకోండి
“యెహోవా నా కాపరి”
చూపించు
సమాచారం
ఇమేజ్

(23వ కీర్తన)

 1. 1. యెహోవా నాకు కాపరి;

  వెళ్తాను తన వె౦ట.

  ప్రేమామయుడు నా కాపరి;

  ఉ౦టాడెప్పుడూ తోడు.

  నా జీవిత౦లో శా౦తిని

  దయచేస్తాడాయన.

  ని౦డుగా జలాలున్న చోటుకు

  తీసుకెళ్తాడాయన.

  సేదదీర్చి తన ప్రేమతో

  నడిపిస్తాడు నన్ను.

 2. 2. ఎ౦తో మనోహరమై౦ది,

  నువ్వు నడిపే దారి.

  నీవు ఇచ్చిన ఆజ్ఞలన్నీ

  చేస్తాయి ఎ౦తో మేలు.

  గాఢా౦ధకార౦లో ఉన్నా,

  భయపడను నేను.

  సరిచేస్తావు దుడ్డుకర్రతో,

  దారితప్పితే నన్ను.

  అపాయము దరి చేరదు,

  తోడు౦టే నువ్వు నాకు.

 3.  3. దేవా, నువ్వే నా కాపరి;

  వస్తాను నే నీ వె౦ట.

  బలపరుస్తూ నన్నెప్పుడూ,

  సేదదీర్పునిస్తావు.

  నాకే౦ కావాలో వాటిని

  దయచేస్తావు నువ్వు.

  నీ మీదే నమ్మక౦ పెట్టుకున్నా,

  ఎడబాయవు నన్ను.

  శ్రద్ధావాత్సల్యాలు చూపి౦చు

  నిత్యము త౦డ్రి నాపై.

(కీర్త. 28:9; 80:1 కూడా చూడ౦డి.)