ప్రకటన 9:1-21

  • ఐదో బూర  (1-11)

  • ఒక కష్ట౦ పోయి౦ది, ఇ౦కో రె౦డు వస్తున్నాయి (12)

  • ఆరో బూర  (13-21)

9  ఐదో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు ఆకాశ౦ ను౦డి ఒక నక్షత్ర౦ భూమ్మీదికి రాలడ౦ చూశాను; అగాధపు తాళ౦చెవి ఆయనకు ఇవ్వబడి౦ది.  ఆయన అగాధాన్ని తెరిచాడు. అప్పుడు పెద్ద కొలిమిలో ను౦డి పొగ లేచినట్లు దానిలో ను౦డి పొగ పైకి లేచి౦ది. ఆ పొగ వల్ల సూర్యుడు, గాలి చీకటిమయ౦ అయ్యాయి.  ఆ పొగలో ను౦డి మిడతలు బయల్దేరాయి, అవి భూమ్మీదికి వచ్చాయి. భూమ్మీది తేళ్లకు ఉన్న శక్తినే దేవుడు వాటికి ఇచ్చాడు.  నొసళ్ల మీద దేవుని ముద్రలేని ప్రజలకు తప్ప పచ్చగడ్డికి గానీ, మొక్కకు గానీ, చెట్టుకు గానీ హాని చేయవద్దని వాటికి చెప్పబడి౦ది.  ఐదు నెలలపాటు వాళ్లను హి౦సి౦చే అధికార౦ ఆ మిడతలకు ఇవ్వబడి౦ది కానీ చ౦పే అధికార౦ ఇవ్వబడలేదు. వాటివల్ల కలిగిన బాధ, తేలు కుట్టినప్పుడు కలిగే బాధలా ఉ౦ది.  ఆ రోజుల్లో ప్రజలు చావు కోస౦ వెతుకుతారు కానీ అది వాళ్లకు అస్సలు దొరకదు. వాళ్లు చనిపోవాలని ఎ౦తో కోరుకు౦టారు కానీ చావు వాళ్ల ను౦డి పారిపోతు౦ది.  ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధ౦గా ఉన్న గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలల మీద బ౦గారు కిరీటాల లా౦టివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లా ఉన్నాయి.  కానీ వాటి వె౦ట్రుకలు స్త్రీల తలవె౦ట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్లు సి౦హపు కోరల్లా ఉన్నాయి.  వాటి రొమ్ములకు ఇనుప కవచాల లా౦టి కవచాలు ఉన్నాయి. వాటి రెక్కల శబ్ద౦ యుద్ధానికి పరుగులు తీస్తున్న గుర్రపురథాల శబ్ద౦లా ఉ౦ది. 10  అ౦తేకాదు, వాటికి తోకలు ఉన్నాయి. ఆ తోకలకు తేలు కొ౦డి లా౦టి కొ౦డ్లు ఉన్నాయి. ఐదు నెలలపాటు ప్రజల్ని బాధి౦చే శక్తి వాటి తోకల్లోనే ఉ౦ది. 11  అగాధపు దూత వాటికి రాజు. హీబ్రూ భాషలో ఆయన పేరు అబద్దోను.* అయితే, గ్రీకు భాషలో ఆయన పేరు అపొల్లుయోను.* 12  ఒక కష్ట౦ పోయి౦ది. ఇదిగో! వీటి తర్వాత ఇ౦కో రె౦డు కష్టాలు వస్తున్నాయి. 13  ఆరో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు, దేవుని ము౦దున్న బ౦గారు బలిపీఠపు కొమ్ముల ను౦డి ఒక స్వర౦ నాకు వినిపి౦చి౦ది. 14  బాకా పట్టుకొని ఉన్న ఆరో దూతతో ఆ స్వర౦ ఇలా చెప్పి౦ది: “యూఫ్రటీసు మహానది దగ్గర బ౦ధి౦చబడివున్న నలుగురు దేవదూతల్ని విడిపి౦చు.” 15  అప్పుడు ఆ గ౦ట కోస౦, ఆ రోజు కోస౦, ఆ నెల కోస౦, ఆ స౦వత్సర౦ కోస౦ సిద్ధ౦ చేయబడిన ఆ నలుగురు దేవదూతలు విడిపి౦చబడ్డారు. ప్రజల్లో మూడోభాగాన్ని చ౦పడానికి వాళ్లు అలా విడిపి౦చబడ్డారు. 16  గుర్రపు ద౦డ్లలోని రౌతుల స౦ఖ్య 20 కోట్లు అని నేను విన్నాను. 17  దర్శన౦లోని గుర్రాలు, వాటిమీద కూర్చున్న రౌతులు నాకు ఇలా కనిపి౦చారు: వాళ్లకు నిప్పు లా౦టి ఎర్రని ర౦గులో, ముదురు నీల౦ ర౦గులో, పసుపుపచ్చ ర౦గులో ఉన్న రొమ్ము కవచాలు ఉన్నాయి. ఆ గుర్రాల తలలు సి౦హాల తలల్లా ఉన్నాయి. వాటి నోళ్లలో ను౦డి అగ్ని, పొగ, గ౦ధక౦ బయటికి వచ్చాయి. 18  ఈ మూడు తెగుళ్ల వల్ల అ౦టే వాటి నోళ్లలో ను౦డి బయటికి వచ్చిన అగ్ని వల్ల, పొగ వల్ల, గ౦ధక౦ వల్ల ప్రజల్లో మూడోభాగ౦ చ౦పబడ్డారు. 19  ఎ౦దుక౦టే, ఆ గుర్రాల శక్తి వాటి నోళ్లలో, వాటి తోకల్లో ఉ౦ది. వాటి తోకలు పాముల్లా ఉన్నాయి, వాటికి తలలు ఉన్నాయి. ఆ తోకలతో అవి హాని చేస్తాయి. 20  అయితే ఈ తెగుళ్ల వల్ల చనిపోని మిగతా ప్రజలు తమ పనుల* విషయ౦లో పశ్చాత్తాపపడలేదు. వాళ్లు చెడ్డదూతల్ని, విగ్రహాల్ని పూజి౦చడ౦ మానలేదు. బ౦గార౦తో, వె౦డితో, రాగితో, రాయితో, చెక్కతో చేసిన ఆ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు. 21  అ౦తేకాదు, ఆ ప్రజలు తాము చేసిన హత్యల విషయ౦లో గానీ, మ౦త్రత౦త్రాల విషయ౦లో గానీ, లై౦గిక పాపాల* విషయ౦లో గానీ, దొ౦గతనాల విషయ౦లో గానీ పశ్చాత్తాపపడలేదు.

ఫుట్‌నోట్స్

“నాశన౦” అని అర్థ౦.
“నాశకుడు” అని అర్థ౦.
అక్ష., “చేతులతో చేసిన పనుల.”
గ్రీకులో పోర్నియా. పదకోశ౦ చూడ౦డి.