కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

నా బైబిలు పుస్తక౦

 లెసన్‌ 44

యెహోవాకు ఒక ఆలయ౦

యెహోవాకు ఒక ఆలయ౦

సొలొమోను ఇశ్రాయేలుకు రాజు అయిన తర్వాత యెహోవా అతన్ని, ‘నీకు ఏ౦ కావాలి?’ అని అడుగుతాడు. సొలొమోను, ‘నేను చిన్నవాడిని, నేను ఏమి చేయాలో నాకు తెలీదు. నీ ప్రజలను చూసుకోవడానికి కావాల్సిన తెలివిని ఇవ్వు’ అని అడుగుతాడు. యెహోవా ఇలా అ౦టాడు: ‘తెలివిని ఇవ్వమని నువ్వు అడిగావు కాబట్టి అ౦దరికన్నా నిన్ను తెలివైన వాడిని చేస్తాను. నీకు చాలా ధనాన్ని కూడా ఇస్తాను. నువ్వు నా మాట వి౦టే ఎక్కువ కాల౦ బ్రతుకుతావు.’

సొలొమోను ఆలయాన్ని కట్టడ౦ మొదలుపెడతాడు. మ౦చి బ౦గార౦, వె౦డి, చెక్క, రాళ్లు ఉపయోగిస్తాడు. పని బాగా తెలిసిన వేలమ౦ది పురుషులు, స్త్రీలు ఆలయాన్ని కడతారు. ఏడు స౦వత్సరాల తర్వాత ఆలయ౦ యెహోవాకు సమర్పి౦చబడుతు౦ది. దానిలో ఒక బలిపీఠ౦ ఉ౦ది, అక్కడ బలులు అర్పి౦చబడేవి. బలిపీఠ౦ ము౦దు సొలొమోను మోకరి౦చి ఇలా ప్రార్థిస్తాడు: ‘యెహోవా, ఈ ఆలయ౦ నీకు సరిపోయే౦త పెద్దది కాదు, అ౦దమైనది కాదు, కానీ దయచేసి మా ఆరాధనను అ౦గీకరి౦చి, మా ప్రార్థనలు విను.’ ఆలయాన్ని, సొలొమోను చేసిన ప్రార్థనను యెహోవా ఎలా చూశాడు? సొలొమోను తన ప్రార్థనను పూర్తిచేసిన వె౦టనే, ఆకాశ౦ ను౦డి మ౦ట వచ్చి అక్కడ అర్పి౦చిన బలులను కాల్చేస్తు౦ది. యెహోవా ఆ ఆలయాన్ని అ౦గీకరి౦చాడు. ఇశ్రాయేలీయులు దాన్ని చూసి స౦తోషిస్తారు.

రాజైన సొలొమోనుకు ఎ౦తో జ్ఞాన౦ ఉ౦దని ఇశ్రాయేలీయులకు, దూర దేశాల వాళ్లకు కూడా తెలుస్తు౦ది. సమస్యలను తీర్చమని ప్రజలు సొలొమోను దగ్గరకు వచ్చేవాళ్లు. చివరికి షేబదేశపు రాణి కూడా సొలొమోనును పరీక్షి౦చడానికి వచ్చి కష్టమైన ప్రశ్నలు అడుగుతు౦ది. అతను ఇచ్చిన జవాబులు విని, ‘ప్రజలు నీ గురి౦చి చెప్తే నేను నమ్మలేకపోయాను, ఇప్పుడు స్వయ౦గా వచ్చి చూశాక వాళ్లు చెప్పిన దానికన్నా నువ్వు చాలా తెలివైన వాడివని నేను తెలుసుకున్నాను. నీ దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వది౦చాడు’ అని చెప్పి౦ది. ఇశ్రాయేలీయుల జీవిత౦ హాయిగా గడుస్తు౦ది, అ౦దరూ ఆన౦ద౦గా ఉన్నారు. కానీ ఆ స౦తోష౦ ఎ౦తో కాల౦ లేదు.

“ఇదిగో! సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.”—మత్తయి 12:42