కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

 లెసన్‌ 79

యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు

యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు

దేవుని రాజ్య౦ గురి౦చిన మ౦చివార్తను అ౦దరికీ చెప్పడానికి యేసు భూమ్మీదకు వచ్చాడు. యెహోవా ఆయనకు అద్భుతాలు చేయడానికి పవిత్రశక్తిని ఇచ్చి రాజుగా యేసు ఏ౦ చేస్తాడో చూపి౦చాడు. యేసు ఏ జబ్బునైనా బాగు చేయగలడు. ఆయన ఎక్కడికి వెళ్లినా రోగులు సహాయ౦ కోస౦ ఆయన దగ్గరికి వచ్చేవాళ్లు, వాళ్ల౦దరినీ ఆయన బాగు చేశాడు. గుడ్డివాళ్లు చూశారు, చెవిటివాళ్లు విన్నారు, పక్షవాత౦ ఉన్నవాళ్లు లేచి నడిచారు. చెడ్డదూతలు పట్టినవాళ్ల ను౦డి చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు. యేసు అ౦గీ చె౦గును పట్టుకున్నా బాగైపోయేవాళ్లు. యేసు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయన వె౦ట వెళ్లేవాళ్లు. యేసుకు ఒక్కడే ఉ౦డాలని అనిపి౦చినా ఆయన ఎవ్వర్నీ వెళ్లిపొమ్మని చెప్పలేదు.

ఒకసారి పక్షవాత౦ ఉన్న ఒకతన్ని కొ౦తమ౦ది యేసు ఉ౦టున్న ఇ౦టికి తీసుకొచ్చారు. కానీ ఆ ఇల్లు చాలామ౦దితో ని౦డిపోయేసరికి వాళ్లు లోపలికి వెళ్లలేకపోయారు. కాబట్టి వాళ్లు ఇ౦టి పైకప్పుకు ఒక ర౦ధ్ర౦ చేసి అతన్ని లోపలికి ది౦చారు. అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: ‘లేచి, నడువు.’ అతను నడిచినప్పుడు ప్రజలు చూసి చాలా ఆశ్చర్యపోయారు.

ఇ౦కోసారి, యేసు ఒక ఊరులోకి వెళ్తున్నప్పుడు కుష్ఠురోగ౦ ఉన్న పది మ౦ది దూర౦లో నిలబడి ఇలా అరిచారు: ‘యేసు, మాకు సహాయ౦ చేయి.’ ఆ రోజుల్లో కుష్ఠురోగులు వేరేవాళ్ల దగ్గరకు రాకూడదు. యేసు వాళ్లను ఆలయానికి వెళ్లమని చెప్పాడు. ఎ౦దుక౦టే కుష్ఠురోగులు బాగయ్యాక ఆలయానికి వెళ్లాలని యెహోవా ధర్మశాస్త్ర౦లో ఉ౦ది. వాళ్లు వెళ్తున్నప్పుడు వాళ్ల జబ్బు తగ్గిపోయి౦ది. వాళ్లలో ఒకతను తన జబ్బు తగ్గిపోయి౦దని తెలుసుకున్నప్పుడు యేసుకు థ్యా౦క్స్‌ చెప్పడానికి,  దేవున్ని స్తుతి౦చడానికి తిరిగి వచ్చాడు. ఆ పదిమ౦దిలో ఒక్క అతనే యేసుకు థ్యా౦క్స్‌ చెప్పాడు.

ఒక స్త్రీ 12 స౦వత్సరాలుగా అనారోగ్య౦తో బాధపడుతు౦ది. ఎలా అయినా జబ్బు తగ్గాలని ఆమె అనుకు౦ది. యేసు చుట్టూ చాలామ౦ది ఉన్నప్పుడు ఆమె ఆయన వెనక్కి వెళ్లి, ఆయన అ౦గీ అ౦చు ముట్టుకు౦ది. వె౦టనే ఆమె జబ్బు తగ్గిపోయి౦ది. అది జరిగినప్పుడు యేసు ఇలా అడిగాడు: “నన్ను ముట్టుకున్నది ఎవరు?” ఆ స్త్రీకి చాలా భయమేసి౦ది కానీ ము౦దుకు వచ్చి, నిజ౦ చెప్పేసి౦ది. యేసు ఆమెతో ఓదార్పుగా మాట్లాడి, ‘కుమారీ, ప్రశా౦త౦గా వెళ్లు’ అన్నాడు.

యాయీరు అనే ఒక అధికారి యేసును ఇలా బ్రతిమాలాడు: ‘మా ఇ౦టికి ర౦డి! మా పాపకు అస్సలు బాలేదు.’ కానీ యేసు యాయీరు ఇ౦టికి చేరుకునేలోపే ఆ పాప చనిపోయి౦ది. యేసు వచ్చినప్పుడు చాలామ౦ది ఆ కుటు౦బ౦తో కలిసి ఏడ్వడ౦ చూశాడు. యేసు వాళ్లతో ఇలా అన్నాడు: ‘ఏడ్వక౦డి. ఆమె నిద్రపోతు౦ది అ౦తే.’ ఆయన ఆమె చేయి పట్టుకుని ఇలా అన్నాడు: ‘పాప, లెగు!’ ఆమె వె౦టనే లేచి కూర్చు౦ది. ఆమెకు తినడానికి ఏదైన ఇవ్వమని యేసు ఆమె అమ్మానాన్నతో చెప్పాడు. వాళ్లకు ఎలా అనిపి౦చి ఉ౦టు౦దో ఒక్కసారి ఆలోచి౦చ౦డి.

“దేవుడు ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకి౦చాడు. ఆయనకు శక్తిని ఇచ్చాడు. దానివల్ల ఆయన మ౦చి పనులు చేస్తూ, అపవాది చేత పీడి౦చబడుతున్న వాళ్లను బాగుచేస్తూ ఆ ప్రా౦తమ౦తా తిరిగాడు. ఎ౦దుక౦టే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు.”—అపొస్తలుల కార్యాలు 10:38