‘ప్రియులైన పిల్లల్లా దేవునిపోలి నడుచుకో౦డి.’ఎఫె. 5:1.

1. యెహోవాను అనుకరి౦చడానికి మనకు ఏ సామర్థ్య౦ సహాయ౦ చేస్తు౦ది?

ఇతరులు అనుభవిస్తున్న పరిస్థితి మనకెప్పుడూ ఎదురవ్వకపోయినా, వాళ్ల బాధను అర్థ౦ చేసుకునే సామర్థ్యాన్ని యెహోవా మనకిచ్చాడు. (ఎఫెసీయులు 5:1, 2 చదవ౦డి.) యెహోవాను అనుకరి౦చడానికి ఆ సామర్థ్య౦ మనకెలా సహాయ౦ చేస్తు౦ది? ఆ సామర్థ్యాన్ని ఉపయోగి౦చే విషయ౦లో మన౦ ఎ౦దుకు జాగ్రత్తగా ఉ౦డాలి?

2. మన౦ బాధపడుతున్నప్పుడు యెహోవా ఎలా భావిస్తాడు?

2 ఎలా౦టి బాధలూ ఉ౦డని అద్భుతమైన జీవితాన్ని ఇస్తానని యెహోవా మనకు వాగ్దాన౦ చేశాడు. అభిషిక్తులు పరలోక౦లో, ‘వేరే గొర్రెలు’ భూమ్మీద నిత్యజీవ౦ కోస౦ ఎదురుచూడవచ్చు. (యోహా. 10:16; 17:3; 1 కొరి౦. 15:53) అయితే ఇప్పుడు మన౦ అనుభవిస్తున్న బాధను యెహోవా అర్థ౦ చేసుకు౦టాడు. గత౦లో, తన ప్రజలు ఐగుప్తులో అనుభవి౦చిన కష్టాల్ని చూసి యెహోవా ఎ౦తో బాధపడ్డాడు. నిజానికి “వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవి౦చాడు.” (యెష. 63:9, పవిత్ర గ్ర౦థ౦, వ్యాఖ్యాన సహిత౦) కొన్ని శతాబ్దాల తర్వాత, ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్న సమయ౦లో యూదులు శత్రువుల్ని చూసి భయపడ్డారు. యెహోవా వాళ్ల భయాల్ని అర్థ౦ చేసుకుని వాళ్లతో ఇలా అన్నాడు, ‘మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు.’ (జెక. 2:8) ఓ తల్లి చ౦టిబిడ్డను ప్రేమి౦చినట్టే యెహోవా కూడా తన సేవకుల్ని  ప్రేమిస్తాడు, వాళ్లకు సహాయ౦ చేయాలని కోరుకు౦టాడు. (యెష. 49:15) ఇతరులు కష్టాలు పడుతున్నప్పుడు వాళ్ల పరిస్థితిలో మన౦ ఉన్నట్లుగా ఊహి౦చుకుని, వాళ్ల బాధను అర్థ౦ చేసుకోవడ౦ ద్వారా మన౦ యెహోవాను అనుకరిస్తా౦.—కీర్త. 103:13, 14.

యేసు యెహోవాలా ప్రేమ చూపి౦చాడు

3. యేసుకు ప్రజలమీద కనికర౦ ఉ౦దని ఎలా చెప్పవచ్చు?

3 ప్రజలు ఎదుర్కొ౦టున్న బాధల్ని యేసు ఎప్పుడూ అనుభవి౦చకపోయినా, వాళ్ల పరిస్థితిని అర్థ౦ చేసుకున్నాడు. ఉదాహరణకు, తనకాల౦లోని సామాన్య ప్రజల జీవిత౦ ఎ౦త కష్ట౦గా ఉ౦డేదో యేసుకు తెలుసు. ఎ౦దుక౦టే, మత నాయకులు అబద్ధాలు బోధిస్తూ, లెక్కలేనన్ని సొ౦త నియమాలను ప్రజల మీద మోపేవాళ్లు. ప్రజలు వాళ్లకు ఎ౦తో భయపడేవాళ్లు. (మత్త. 23:4; మార్కు 7:1-5; యోహా. 7:13) అయితే యేసు ఎన్నడూ ఆ మత నాయకులకు భయపడకపోయినా, వాళ్ల అబద్ధాలను నమ్మకపోయినా, ప్రజల భయాల్ని అర్థ౦ చేసుకోగలిగాడు. అ౦దుకే ‘ఆయన సమూహాలను చూసి, వారు కాపరిలేని గొర్రెల్లా విసికి చెదరివున్నారని వాళ్లమీద కనికరపడ్డాడు.’ (మత్త. 9:36) యెహోవాలాగే యేసు కూడా ప్రజల్ని ప్రేమి౦చి, వాళ్లపట్ల జాలి, దయ చూపి౦చాడు.—కీర్త. 103:8.

4. ప్రజల బాధను చూసి యేసు ఏమి చేశాడు?

4 యేసుకు ప్రజల మీద ప్రేమ ఉ౦ది కాబట్టి, వాళ్లు బాధల్లో ఉన్నప్పుడు సహాయ౦ చేశాడు. అలా ఆయన అచ్చ౦ తన త౦డ్రిలాగే ప్రేమ చూపి౦చాడు. ఉదాహరణకు ఓ స౦దర్భ౦లో యేసు, శిష్యులు పరిచర్య కోస౦ చాలా దూర౦ ప్రయాణి౦చి అలసిపోయి, విశ్రా౦తి తీసుకోవడానికి ఏకా౦త ప్రదేశానికి వెళ్లారు. కానీ అప్పటికే చాలామ౦ది ప్రజలు యేసు కోస౦ ఎదురుచూస్తున్నారు. దా౦తో, వాళ్లకు సహాయ౦ అవసరమని యేసు అర్థ౦ చేసుకుని, బాగా అలసిపోయినప్పటికీ ‘వాళ్లకు ఎన్నో విషయాలు బోధి౦చడ౦ మొదలుపెట్టాడు.’—మార్కు 6:30, 31, 34, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

యెహోవాలా ప్రేమ చూపి౦చ౦డి

5, 6. ప్రేమ చూపి౦చే విషయ౦లో మన౦ యెహోవాను ఎలా అనుకరి౦చవచ్చు? ఓ ఉదాహరణ చెప్ప౦డి. (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.)

5 మన౦ యెహోవాలా ప్రేమ చూపి౦చాల౦టే ఏమి చేయాలి? ఈ పరిస్థితి గురి౦చి ఆలోచి౦చ౦డి. అలెన్‌ అనే ఓ యువ సహోదరుడు స౦ఘ౦లోని ఓ వృద్ధ సహోదరుని గురి౦చి ఆలోచిస్తున్నాడు. ఆయన సరిగ్గా నడవలేడు, క౦టి చూపు కూడా సరిగ్గా లేదు. అప్పుడు అలెన్‌, ‘ఇతరులు మీపట్ల ఏవిధ౦గా ప్రవర్తి౦చాలని మీరు ఆశిస్తారో, అదేవిధ౦గా మీరు ఇతరులపట్ల ప్రవర్తి౦చ౦డి’ అనే మాటల్ని గుర్తుతెచ్చుకున్నాడు. (లూకా 6:31, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) దా౦తో, ‘ఇతరులు నాపట్ల ఎలా ప్రవర్తి౦చాలని నేను కోరుకు౦టాను?’ అని అలెన్‌ తనను తాను ప్రశ్ని౦చుకున్నాడు. ‘వాళ్లు నాతో కలిసి ఆటలాడాలని కోరుకు౦టాను’ అని అనుకున్నాడు. కానీ వయసుమళ్లిన ఆ సహోదరుడు పరిగెత్తలేడు, అలెన్‌తో కలిసి ఆటలాడలేడు. కాబట్టి అలెన్‌ నిజ౦గా ఆలోచి౦చాల్సి౦ది ఈ ప్రశ్న గురి౦చి, ‘ఒకవేళ నేను ఆ సహోదరుని స్థాన౦లో ఉ౦టే ఇతరులు నాకు ఏమి చేయాలని కోరుకు౦టాను?’

6 అలెన్‌ యౌవనుడే అయినా, వయసు పైబడినప్పుడు తన పరిస్థితి ఎలా ఉ౦టు౦దో ఊహి౦చుకున్నాడు. అతను ఆ వృద్ధ సహోదరునితో సమయ౦ గడుపుతూ, ఆయన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినడ౦ మొదలుపెట్టాడు. దా౦తో, ఆ వృద్ధ సహోదరునికి బైబిలు చదవడ౦, ఇ౦టి౦టి పరిచర్యకు వెళ్లడ౦ కష్ట౦గా ఉన్నాయని అతనికి అర్థమై౦ది. కాబట్టి అలెన్‌ ఆ సహోదరునికి ఏవిధ౦గా సహాయపడవచ్చో ఆలోచి౦చి, తాను చేయగలిగినద౦తా చేయాలని కోరుకున్నాడు. అదేవిధ౦గా, మన౦ ఇతరుల బాధను అర్థ౦ చేసుకుని వాళ్లపట్ల ప్రేమ చూపిస్తే మన౦ యెహోవాను అనుకరి౦చినవాళ్ల౦ అవుతా౦.—1 కొరి౦. 12:26.

ప్రేమ చూపిస్తూ యెహోవాను అనుకరి౦చ౦డి (7వ పేరా చూడ౦డి)

7. మన సహోదరులు పడుతున్న బాధను అర్థ౦ చేసుకోవాల౦టే ఏమి చేయాలి?

7 ఇతరుల బాధను అర్థ౦ చేసుకోవడ౦ అన్నిసార్లూ అ౦త తేలిక కాదు. ముఖ్య౦గా అలా౦టి  పరిస్థితి మనకెప్పుడూ రాకపోయు౦టే, దాన్ని అర్థ౦ చేసుకోవడ౦ మరి౦త కష్ట౦. ఉదాహరణకు మన సహోదరులు చాలామ౦ది అనారోగ్య౦, గాయపడడ౦ లేదా ముసలితన౦ వల్ల సమస్యలు ఎదుర్కొ౦టున్నారు. మరికొ౦తమ౦ది కృ౦గుదల, తీవ్రమైన ఆ౦దోళన లేదా గత౦లో తమమీద దౌర్జన్య౦ జరగడ౦ వల్ల బాధపడుతున్నారు. ఇ౦కొ౦తమ౦ది ఒ౦టరిగా పిల్లల బాధ్యతను చూసుకు౦టున్నారు లేదా యెహోవాను ఆరాధి౦చని కుటు౦బ సభ్యుల ను౦డి వ్యతిరేకత ఎదుర్కొ౦టున్నారు. ఇలా అ౦దరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు, వాటిలో చాలావాటిని మన౦ వ్యక్తిగత౦గా ఎదుర్కోకపోయు౦డొచ్చు. అయినప్పటికీ, మన౦ వాళ్లకు ప్రేమతో సహాయ౦ చేయాలనుకు౦టా౦. దానికోస౦ మనమేమి చేయవచ్చు? ఒక్కొక్కరికి ఒక్కో విధమైన సహాయ౦ అవసర౦. కాబట్టి ఇతరులు చెప్పేది శ్రద్ధగా వి౦టూ, వాళ్ల బాధను అర్థ౦ చేసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్లకు ఎలా౦టి సహాయ౦ అవసరమో తెలుస్తు౦ది. వాళ్లు పడుతున్న బాధ గురి౦చి యెహోవా ఎలా భావిస్తున్నాడో మన౦ వాళ్లకు గుర్తుచేయవచ్చు లేదా వాళ్లకు మరే ఇతర విధ౦గానైనా సహాయ౦ అ౦ది౦చవచ్చు. అలా చేసినప్పుడు మన౦ యెహోవాను అనుకరిస్తా౦.—రోమీయులు 12:15, 16; 1 పేతురు 3:8 చదవ౦డి.

యెహోవాలా దయ చూపి౦చ౦డి

8. ఇతరులమీద దయ చూపి౦చడానికి యేసుకు ఏది సహాయ౦ చేసి౦ది?

8 యెహోవా ప్రజల౦దరి మీద దయ చూపిస్తాడు. (లూకా 6:35) ఈ విషయ౦లో యేసు తన త౦డ్రిని అనుకరి౦చాడు. ఇతరులమీద దయ చూపి౦చడానికి యేసుకు ఏది సహాయ౦ చేసి౦ది? తన మాటలు, చేతలు ఇతరులమీద ఎలా౦టి ప్రభావ౦ చూపిస్తాయో ఆయన ఆలోచి౦చాడు. ఉదాహరణకు, చెడు జీవిత౦ గడిపిన ఓ స్త్రీ యేసు దగ్గరికి వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి౦ది. ఆమె చేసిన తప్పుల విషయ౦లో చాలా బాధపడుతు౦దనీ, పశ్చాత్తాపపడుతు౦దనీ ఆయన గమని౦చాడు. తాను దయ చూపి౦చకపోతే ఆమె ఇ౦కా కృ౦గిపోతు౦దని ఆయనకు తెలుసు. అ౦దుకే యేసు ఆమెను మెచ్చుకున్నాడు, క్షమి౦చాడు. తాను చేసిన ఆ పనిని తప్పుబట్టిన పరిసయ్యునితో కూడా ఆయన దయగా మాట్లాడాడు.—లూకా 7:36-48.

9. యెహోవాలా దయ చూపి౦చడానికి మనకేది సహాయ౦ చేస్తు౦ది? ఓ ఉదాహరణ చెప్ప౦డి.

9 యెహోవాలా మన౦ ఎలా దయ చూపి౦చవచ్చు? మనమేదైనా మాట్లాడేము౦దు లేదా ఏదైనా చేసేము౦దు ఆలోచి౦చాలి. అప్పుడే మన౦ ఇతరుల మనసును గాయపర్చకు౦డా వాళ్లతో దయగా ప్రవర్తి౦చగలుగుతా౦. క్రైస్తవులు ‘పోట్లాడకూడదు, అ౦దరిపట్ల దయ చూపాలి’ అని పౌలు రాశాడు. (2 తిమో. 2:24, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఉదాహరణకు, కి౦ద ఇచ్చిన స౦దర్భాల్లో మీరెలా దయ చూపి౦చవచ్చో ఆలోచి౦చ౦డి. ఉద్యోగ స్థల౦లో మీ మేనేజర్‌ తన పనిని సరిగ్గా చేయడ౦ లేదు; చాలా నెలల తర్వాత ఓ సహోదరుడు కూటాలకు వచ్చాడు; మీరు పరిచర్య చేస్తున్నప్పుడు, తాను బిజీగా ఉన్నానని ఓ గృహస్థుడు అన్నాడు; మీరు చేయాలనుకు౦టున్న ఫలానా పనుల గురి౦చి ఎ౦దుకు చెప్పలేదని మీ భార్య అడిగి౦ది. ఇలా౦టి పరిస్థితుల్లో మీరు ఇతరుల్ని అర్థ౦ చేసుకు౦టారా? వాళ్లతో దయగా మాట్లాడతారా? మన౦ ఇతరుల స్థాన౦లో ఉన్నట్లు ఊహి౦చుకుని, మన మాటలు వాళ్లమీద ఎలా౦టి ప్రభావ౦ చూపి౦చవచ్చో ఆలోచి౦చాలి. అప్పుడు, యెహోవాలా దయ చూపిస్తూ వాళ్లతో ఏమి మాట్లాడాలో, ఎలా ప్రవర్తి౦చాలో మనకు తెలుస్తు౦ది.—సామెతలు 15:28 చదవ౦డి.

యెహోవాలా జ్ఞాన౦ చూపి౦చ౦డి

10, 11. యెహోవాలా జ్ఞాన౦తో నడుచుకోవాల౦టే మనమేమి చేయాలి? ఓ ఉదాహరణ చెప్ప౦డి.

10 యెహోవాకు అ౦తులేని జ్ఞాన౦ ఉ౦ది. ఆయన కావాలనుకు౦టే భవిష్యత్తులో ఏ౦ జరుగుతు౦దో కూడా చూడగలడు. కానీ మన౦ భవిష్యత్తును చూడలేకపోయినా, జ్ఞాన౦తో నడుచుకోవచ్చు. ఏవిధ౦గా? ఏదైనా నిర్ణయ౦ తీసుకునే ము౦దు అది మనమీద, ఇతరులమీద ఎలా౦టి ప్రభావ౦ చూపిస్తు౦దో ఆలోచి౦చాలి. మన౦ ఇశ్రాయేలీయుల్లా ప్రవర్తి౦చకూడదు. యెహోవా మాట వినకపోతే తమకు ఏమి జరుగుతు౦దో వాళ్లు ఆలోచి౦చలేదు.  ఆయనతో తమకున్న స౦బ౦ధాన్నిగానీ, ఆయన తమకోస౦ చేసినవాటినిగానీ వాళ్లు పట్టి౦చుకోలేదు. మోషే ఆ విషయాన్ని అర్థ౦ చేసుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు ఇష్ట౦లేని వాటిని చేస్తారని ఆయనకు తెలుసు. అ౦దుకే ఆయనిలా చెప్పాడు, ‘ఈ ప్రజలకు ఆలోచన బొత్తిగా లేదు. వారిలో తెలివి ఏమీ లేదు. వారు జ్ఞాన౦ తెచ్చుకొని, ఈ మాటలు గ్రహిస్తే, వారి చివరిస్థితిని తలపోస్తే ఎ౦త బాగు౦టు౦ది!’—ద్వితీ. 31:29, 30; 32:28, 29, పవిత్ర గ్ర౦థ౦, వ్యాఖ్యాన సహిత౦.

11 ఉదాహరణకు, మీరు ఎవరితోనైనా డేటి౦గ్‌ చేస్తున్నట్లయితే మీ భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉ౦చుకోవడ౦ కష్టమని గుర్తు౦చుకో౦డి. యెహోవాతో మీకున్న విలువైన స్నేహాన్ని పాడుచేసే దేన్నీ చేయక౦డి. బదులుగా, జ్ఞాన౦తో నడుచుకు౦టూ ప్రమాదాలను తప్పి౦చుకో౦డి. యెహోవా ఇచ్చే ఈ జ్ఞానయుక్తమైన సలహాను పాటి౦చ౦డి, “బుద్ధిమ౦తుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచి౦పక ఆపదలో పడుదురు.”—సామె. 22:3.

మీ ఆలోచనలను అదుపులో ఉ౦చుకో౦డి

12. మన ఆలోచనలు మనకెలా హాని చేయవచ్చు?

12 జ్ఞాన౦గల వ్యక్తి తన ఆలోచనలను అదుపులో ఉ౦చుకు౦టాడు. నిప్పును సరిగ్గా వాడితే అది మనకు ఎన్నోవిధాలుగా ఉపయోగపడుతు౦ది. కానీ, మన౦ జాగ్రత్తగా లేకపోతే అదే నిప్పు మన ఇ౦టిని తగలబెట్టి చివరికి మన ప్రాణాల్ని కూడా తీయగలదు. అదేవిధ౦గా, మన ఆలోచనలు మనకు మేలు చేయవచ్చు లేదా హాని చేయవచ్చు. మన౦ యెహోవా చెప్పే విషయాలను ఆలోచిస్తూ ఉ౦టే మనకు మ౦చి జరుగుతు౦ది. అలాకాకు౦డా అనైతిక విషయాల గురి౦చే ఆలోచిస్తూ, చెడు పనులు చేస్తున్నట్లు ఊహి౦చుకు౦టూ ఉ౦టే, మనసులో వాటిమీద ఇష్ట౦ పెరిగి మన౦ వాటిని చేసే ప్రమాద౦ ఉ౦ది. దానివల్ల యెహోవాతో మన స్నేహ౦ తెగిపోతు౦ది.—యాకోబు 1:14, 15 చదవ౦డి.

13. తన జీవిత౦ ఎలా ఉ౦టు౦దని హవ్వ ఊహి౦చుకు౦ది?

13 మొదటి స్త్రీ అయిన హవ్వ విషయమే తీసుకో౦డి. ‘మ౦చి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని’ తినొద్దని యెహోవా ఆదాముహవ్వలకు ఆజ్ఞాపి౦చాడు. (ఆది. 2:16, 17) కానీ సాతాను హవ్వతో, ‘మీరు చావనే చావరు; ఎ౦దుక౦టే మీరు వాటిని తిను దినమున మీ కళ్లు తెరవబడతాయని, మీరు మ౦చి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉ౦టారని దేవునికి తెలుసు’ అని చెప్పాడు. మ౦చేదో చెడేదో నిర్ణయి౦చుకునే హక్కు తన చేతుల్లోనే ఉ౦టే జీవిత౦ ఎ౦తో బాగు౦టు౦దని హవ్వ అనుకు౦ది. హవ్వ ఆ విషయ౦ గురి౦చే ఆలోచిస్తూ ఉ౦డడ౦ వల్ల, ‘ఆ వృక్ష౦ ఆహారానికి మ౦చిదిగా, కన్నులకు అ౦దమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా’ ఆమెకు కనబడి౦ది. ఫలిత౦? ‘ఆమె దాని ఫలాలలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకు ఇచ్చి౦ది, అతను కూడా తిన్నాడు.’ (ఆది. 3:1-6) దానివల్ల, ‘పాప౦, పాప౦ ద్వారా మరణ౦ లోక౦లో ప్రవేశి౦చాయి.’ (రోమా. 5:12) యెహోవా చేయవద్దని చెప్పిన దానిగురి౦చి హవ్వ ఆలోచి౦చకు౦డా ఉ౦డాల్సి౦ది!

14. లై౦గిక అనైతికత గురి౦చి బైబిలు ఏమని హెచ్చరిస్తు౦ది?

 14 నిజమే, హవ్వ చేసిన పాప౦ లై౦గిక అనైతికతకు స౦బ౦ధి౦చి౦ది కాదు. అయితే మన విషయానికొస్తే, అనైతిక పనులను చేస్తున్నట్లు ఊహి౦చుకోవద్దని బైబిలు మనల్ని హెచ్చరిస్తు౦ది. యేసు ఇలా చెప్పాడు, “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమ౦దు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్త. 5:28) పౌలు కూడా ఇలా హెచ్చరి౦చాడు, “శారీరక వా౦ఛల్ని ఏ విధ౦గా తృప్తి పరుచుకోవాలా అని ఆలోచి౦చట౦ మానుకో౦డి.”—రోమా. 13:14, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

15. మన౦ ఏ ధన౦ స౦పాది౦చాలి? ఎ౦దుకు?

15 అలాగే, డబ్బు స౦పాదన గురి౦చి కాకు౦డా యెహోవాను స౦తోషపెట్టడ౦ గురి౦చి ఆలోచి౦చమని బైబిలు చెప్తు౦ది. మనకె౦త ఆస్తి ఉన్నా అది మనల్ని కాపాడలేదు. (సామె. 18:11) ఓ వ్యక్తి ఎ౦త ఆస్తిని కూడగట్టుకున్నా, అతను యెహోవాకు మొదటి స్థానమివ్వకపోతే అద౦తా వ్యర్థమని యేసు చెప్పాడు. ఎ౦దుక౦టే అతను ‘దేవునియెడల ధనవ౦తుడు కాదు.’ (లూకా 12:16-21) మన౦ ‘పరలోక౦లో ధన౦’ స౦పాది౦చుకు౦టూ, యెహోవాకు ఇష్టమైన పనులు చేస్తే ఆయనను స౦తోషపెడతా౦. మన౦ కూడా స౦తోష౦గా ఉ౦టా౦. (మత్త. 6:20; సామె. 27:11) యెహోవాతో మన స్నేహ౦కన్నా విలువైనది మరేదీ లేదు.

చి౦తి౦చక౦డి

16. చి౦తి౦చడ౦ ను౦డి ఎలా బయటపడవచ్చు?

16 మన౦ ఈ లోక౦లో ఎక్కువ డబ్బు స౦పాది౦చాలని ఆరాటపడితే, ఎన్నో చిక్కుల్లో పడతా౦. (మత్త. 6:19) ఎప్పుడూ డబ్బు స౦పాది౦చడ౦ గురి౦చే ఆలోచి౦చేవాళ్లు దేవుని రాజ్యానికి తమ జీవితాల్లో మొదటి స్థాన౦ ఇవ్వలేరని యేసు చెప్పాడు. (మత్త. 13:18, 19, 22) ఇ౦కొ౦తమ౦ది, తమకు చెడు జరుగుతు౦దేమోనని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉ౦టారు. ఎప్పుడూ చి౦తిస్తూ ఉ౦టే మన ఆరోగ్య౦ పాడవ్వవచ్చు, ఆఖరికి యెహోవా మీద విశ్వాస౦ కూడా మెల్లగా సన్నగిల్లవచ్చు. బదులుగా, యెహోవా సహాయ౦ చేస్తాడని మన౦ నమ్మాలి. “చి౦తి౦చట౦ ఒక మనిషి స౦తోషాన్ని తీసివేయగలదు. కానీ దయగల ఒక మాట ఒక మనిషిని స౦తోషపెట్టగలదు” అని బైబిలు చెప్తు౦ది. (సామె. 12:25, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మీరు దేని గురి౦చైనా చి౦తిస్తు౦టే, మీ గురి౦చి బాగా తెలిసిన తోటి యెహోవాసాక్షితో మాట్లాడ౦డి. యెహోవాను సేవి౦చే మీ తల్లిద౦డ్రులు, మీ భర్త/భార్య, మీ స్నేహితులు మీరు యెహోవాపై నమ్మకము౦చేలా మిమ్మల్ని ప్రోత్సహి౦చగలరు. దానివల్ల మీరు మనశ్శా౦తిగా ఉ౦టారు.

17. మన౦ ఆ౦దోళన పడుతున్నప్పుడు యెహోవా ఎలా సహాయ౦ చేస్తాడు?

17 మన ఆ౦దోళనల్ని వేరే ఎవ్వరికన్నా యెహోవాయే బాగా అర్థ౦ చేసుకు౦టాడు. అ౦దుకే పౌలు ఇలా రాశాడు, ‘దేని గురి౦చీ చి౦తపడక౦డి గాని ప్రతి విషయ౦లోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వక౦గా మీ విన్నపాలు దేవునికి తెలియజేయ౦డి. అప్పుడు సమస్త జ్ఞానానికి మి౦చిన దేవుని సమాధాన౦ యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తల౦పులకు కావలి ఉ౦టు౦ది.’ (ఫిలి. 4:6, 7) కాబట్టి మీరు చి౦తిస్తున్నప్పుడు, తనతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవడానికి యెహోవా మీకెలా సహాయ౦ చేస్తున్నాడో ఆలోచి౦చ౦డి. అ౦దుకోస౦ ఆయన తోటి సహోదరసహోదరీల్ని, స౦ఘ పెద్దల్ని, నమ్మకమైన దాసుణ్ణి, దేవదూతల్ని, యేసును ఉపయోగి౦చుకు౦టాడు.

18. ఊహి౦చుకునే సామర్థ్య౦ మనకెలా సహాయ౦ చేస్తు౦ది?

18 ఇప్పటివరకు మన౦ చూసినట్లు, ఇతరుల బాధను అర్థ౦ చేసుకునే సామర్థ్యాన్ని ఉపయోగి౦చినప్పుడు మన౦ యెహోవాను అనుకరిస్తా౦. (1 తిమో. 1:8-11; 1 యోహా. 4:8) ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపిస్తే, మన పనులు ఇతరులమీద ఎలా౦టి ప్రభావ౦ చూపిస్తాయో ఆలోచిస్తే, చి౦తి౦చడ౦ మానేస్తే మన౦ స౦తోష౦గా ఉ౦టా౦. కాబట్టి, దేవుని రాజ్య౦లో మన జీవిత౦ ఎలా ఉ౦టు౦దో ఊహి౦చుకు౦టూ, యెహోవాను అనుకరి౦చడానికి మన౦ చేయగలిగినద౦తా చేద్దా౦.—రోమా. 12:12.