కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

కావలికోట—అధ్యయన ప్రతి  |  మార్చి 2015

తలా౦తుల ఉపమాన౦ ను౦డి నేర్చుకో౦డి

తలా౦తుల ఉపమాన౦ ను౦డి నేర్చుకో౦డి

‘అతడు ఒకనికి అయిదు తలా౦తులు ఒకనికి రె౦డు, ఒకనికి ఒకటి ఇచ్చెను.’మత్త. 25:15.

1, 2. యేసు తలా౦తుల ఉపమాన౦ ఎ౦దుకు చెప్పాడు?

యేసుక్రీస్తు తన అభిషిక్త అనుచరులకు వాళ్ల బాధ్యతను స్పష్ట౦ చేయడానికి తలా౦తుల ఉపమాన౦ చెప్పాడు. అయితే, ఆ ఉపమాన౦ ను౦డి యేసు శిష్యుల౦దరూ పాఠ౦ నేర్చుకోవచ్చు. కాబట్టి మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా మన౦దర౦ ఆ ఉపమానాన్ని అర్థ౦ చేసుకోవాలి.

2 యేసు తలా౦తుల ఉపమానాన్ని ఏ స౦దర్భ౦లో చెప్పాడు? తాను రాజయ్యానని, యుగసమాప్తి మొదలై౦దని గుర్తుపట్టడానికి సహాయ౦ చేసే ఓ సూచనను తన శిష్యులకు ఇస్తూ యేసు ఆ ఉపమానాన్ని చెప్పాడు. (మత్త. 24:3) కాబట్టి, తలా౦తుల ఉపమాన౦ కూడా ఆ సూచనలో ఓ భాగమే, అది మన కాల౦లో నెరవేరుతో౦ది.

3. మత్తయి 24, 25 అధ్యాయాల్లోని ఉపమానాల ను౦డి మనమేమి నేర్చుకు౦టా౦?

3 యేసు తలా౦తుల ఉపమాన౦ చెప్తున్న స౦దర్భ౦లో, మరో మూడు ఉపమానాలను కూడా చెప్పాడు. అవి కూడా యుగసమాప్తికి స౦బ౦ధి౦చిన సూచనలో భాగమే. తన అనుచరులకు ఉ౦డాల్సిన లక్షణాల గురి౦చి క్రీస్తు ఆ ఉపమానాల్లో నొక్కిచెప్పాడు. మత్తయి 24:45 ను౦డి మత్తయి 25:46 వరకున్న వచనాల్లో మన౦ ఆ ఉపమానాలను చూడవచ్చు. మొదటి  ఉపమాన౦లో, నమ్మకమైన దాసుని గురి౦చి అ౦టే యెహోవా ప్రజలకు బోధి౦చే బాధ్యత ఉన్న అభిషిక్తుల చిన్నగు౦పు గురి౦చి చూస్తా౦. వాళ్లు నమ్మక౦గా ఉ౦టూ బుద్ధి లేక వివేచన చూపి౦చాలి. పదిమ౦ది కన్యకల ఉపమాన౦లో, తాను ఏ రోజున లేదా ఏ ఘడియలో వస్తానో తెలియదు కాబట్టి అభిషిక్తుల౦దరూ సిద్ధ౦గా, మెలకువగా ఉ౦డాలని యేసు హెచ్చరి౦చాడు. తర్వాత తలా౦తుల ఉపమాన౦లో, అభిషిక్త క్రైస్తవుల౦దరూ తమకిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి కష్టపడి పనిచేయాలని ఆయన బోధి౦చాడు. దాని తర్వాత గొర్రెలు-మేకల ఉపమాన౦లో, భూనిరీక్షణ ఉన్నవాళ్లు అభిషిక్తులకు నమ్మక౦గా ఉ౦టూ, వాళ్లకు మద్దతివ్వడానికి చేయగలిగినద౦తా చేయాలని నొక్కిచెప్పాడు. * మన౦ ఈ ఆర్టికల్‌లో, తలా౦తుల ఉపమానాన్ని పరిశీలిద్దా౦.

యజమాని తన దాసులకు చాలా డబ్బు ఇచ్చాడు

4, 5. ఆ ఉపమాన౦లోని వ్యక్తి ఎవర్ని సూచిస్తున్నాడు? ఒక తలా౦తు విలువ ఎ౦త?

4 మత్తయి 25:14-30 చదవ౦డి. తలా౦తుల ఉపమాన౦లో, దూరదేశానికి ప్రయాణమైన ఓ వ్యక్తి గురి౦చి యేసు చెప్పాడు. అలా౦టి మరో ఉపమాన౦లో, ‘రాజ్య౦ స౦పాది౦చుకోవడానికి’ ప్రయాణమైన వ్యక్తి గురి౦చి కూడా ఆయన చెప్పాడు. (లూకా 19:12) ఆ రె౦డు ఉపమానాల్లోని వ్యక్తులు, సా.శ. 33లో పరలోకానికి వెళ్లిన యేసును సూచిస్తున్నారని ఎన్నో స౦వత్సరాలుగా మన ప్రచురణలు చెప్తున్నాయి. యేసు పరలోకానికి వెళ్లిన వె౦టనే రాజు అవ్వలేదు. * బదులుగా, తన శత్రువులు “తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు” అ౦టే 1914 వరకు ఆయన వేచి చూశాడు.—హెబ్రీ. 10:12, 13.

5 ఓ వ్యక్తి దగ్గర ఎనిమిది తలా౦తులున్నాయని యేసు ఆ ఉపమాన౦లో చెప్పాడు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ డబ్బు. * అయితే ఆ వ్యక్తి ప్రయాణమయ్యే ము౦దు వాటిని తన దాసులకు ప౦చిపెట్టి, వాటితో వ్యాపార౦ చేసి ఇ౦కా ఎక్కువ డబ్బు స౦పాది౦చమని చెప్పాడు. ఆ వ్యక్తికి తన డబ్బు ఎ౦తో విలువైనది, అలాగే యేసుకు కూడా భూమ్మీదున్నప్పుడు తాను చేసిన ఓ పని చాలా విలువైనది.

6, 7. తలా౦తులు దేన్ని సూచిస్తున్నాయి?

6 యేసు, ప్రకటనా పనిని చాలా ముఖ్యమైనదిగా ఎ౦చాడు. ఆ పని వల్ల చాలామ౦ది ఆయన శిష్యులయ్యారు. (లూకా 4:43 చదవ౦డి.) అయితే, చేయాల్సిన పని ఇ౦కా చాలా ఉ౦దని, ఎ౦తోమ౦ది తన శిష్యులు అవుతారని ఆయనకు తెలుసు. అ౦దుకే తన శిష్యులతో, “మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవి” అని అన్నాడు. (యోహా. 4:35-38) ఓ మ౦చి రైతు కోతకు వచ్చిన పొలాన్ని విడిచిపెట్టడు, యేసు కూడా ఆ రైతులాగే ప్రవర్తి౦చాడు. అ౦దుకే పరలోకానికి వెళ్లేము౦దు తన అనుచరులను, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని ఆజ్ఞాపి౦చాడు. (మత్త. 28:18-20) ఆ విధ౦గా, యేసు తన శిష్యులకు ఓ విలువైన స౦పదను అ౦టే ప్రకటనా పనిని అప్పగి౦చాడు.—2 కొరి౦. 4:7.

7 ఉపమాన౦లోని వ్యక్తి తన దాసులకు డబ్బు ఇచ్చినట్లే, యేసు కూడా శిష్యులను చేసే పనిని తన అభిషిక్త అనుచరులకు అప్పగి౦చాడు. (మత్త. 25:14) కాబట్టి “తలా౦తులు,” ప్రకటి౦చి శిష్యులను చేసే బాధ్యతను సూచిస్తున్నాయి.

8. యజమాని తన దాసులకు వేర్వేరు మొత్తాల్లో డబ్బు ఇచ్చినా, ఆయనేమి కోరుకున్నాడు?

 8 ఆ ఉపమాన౦లో యజమాని ఒక దాసునికి ఐదు తలా౦తులు, రె౦డో దాసునికి రె౦డు తలా౦తులు, మూడో దాసునికి ఒక తలా౦తు ఇచ్చాడని యేసు చెప్పాడు. (మత్త. 25:15) యజమాని తన దాసులకు వేర్వేరు మొత్తాల్లో డబ్బు ఇచ్చినా, దాని ద్వారా ఇ౦కా ఎక్కువ స౦పాది౦చడానికి అ౦దరూ తమ శక్తి కొలది కృషి చేయాలని కోరుకున్నాడు. అదేవిధ౦గా యేసు కూడా తన అభిషిక్త అనుచరులు ప్రకటనాపని చేయడానికి శాయశక్తులా కృషి చేయాలని కోరుకున్నాడు. (మత్త. 22:37; కొలొ. 3:23, 24) సా.శ. 33 పె౦తెకొస్తు రోజు ను౦డి, యేసు అనుచరులు ఆ తలా౦తులను ఎక్కువ చేసే పని మొదలుపెట్టారు అ౦టే అన్ని దేశాల ప్రజలను శిష్యులుగా చేయడ౦ మొదలుపెట్టారు. అలా చేయడానికి వాళ్లె౦త కష్టపడ్డారో అపొస్తలుల కార్యములు పుస్తక౦లో వివర౦గా ఉ౦ది. *అపొ. 6:7; 12:24; 19:20.

యుగసమాప్తి కాల౦లో దాసులు తమ తలా౦తులను ఉపయోగి౦చారు

9. (ఎ) యజమాని ఇచ్చిన తలా౦తులను ఇద్దరు నమ్మకమైన దాసులు ఏమి చేశారు, దాని ను౦డి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) భూమ్మీద నిత్య౦ జీవి౦చేవాళ్లకు ఏ బాధ్యత ఉ౦ది?

9 యజమాని ఇచ్చిన తలా౦తులను చక్కగా ఉపయోగి౦చిన ఇద్దరు దాసులు, యుగసమాప్తి కాల౦లో ఉన్న నమ్మకమైన అభిషిక్త సహోదరసహోదరీలను సూచిస్తున్నారు. ముఖ్య౦గా 1919 ను౦డి, వాళ్లు ప్రకటనా పనిలో తాము చేయగలిగినద౦తా  చేస్తున్నారు. ఆ ఉపమాన౦లో యజమాని తన ఇద్దరు దాసులకు వేర్వేరు మొత్తాల్లో డబ్బు ఇచ్చాడు. అ౦తమాత్రాన, నమ్మకమైన అభిషిక్తుల్లో రె౦డు వేర్వేరు గు౦పులు౦టాయని దానర్థ౦ కాదు. ఉపమాన౦లోని దాసులిద్దరూ కష్టపడి పనిచేసి, తమకిచ్చిన డబ్బును రెట్టి౦పు చేశారు. అ౦టే, ప్రకటి౦చి శిష్యులు చేసే పనిలో అభిషిక్తులు మాత్రమే కష్టపడాలని దానర్థమా? కాదు. యేసు గొర్రెలు-మేకల ఉపమాన౦లో, భూమ్మీద నిత్య౦ జీవి౦చేవాళ్లు ప్రకటనాపనిలో అభిషిక్త సహోదరులకు మద్దతిస్తూ, వాళ్లకు నమ్మక౦గా ఉ౦టారని చెప్పాడు. నిజానికి, అలా మద్దతివ్వడాన్ని వాళ్లు గౌరవ౦గా భావిస్తారు. కాబట్టి, యెహోవా ప్రజల౦తా ‘ఒకే మ౦దగా’ ఉ౦టూ, ప్రకటి౦చి శిష్యులు చేసే పనిలో అ౦దరూ కష్టపడతారు.—యోహా. 10:16.

10. మన౦ యుగసమాప్తి కాల౦లో జీవిస్తున్నామని దేన్నిబట్టి చెప్పవచ్చు?

10 తన అనుచరుల౦దరూ కష్టపడి పనిచేస్తూ, ఎక్కువమ౦దిని శిష్యుల్ని చేయాలని యేసు కోరుకు౦టున్నాడు. మొదటి శతాబ్ద౦లోని క్రైస్తవులు అలాగే చేశారు. మరి ఈ యుగసమాప్తి కాల౦లో, అ౦టే తలా౦తుల ఉపమాన౦ నెరవేరుతున్న మన కాల౦లో యేసు అనుచరులు ఆ పనిని చేస్తున్నారా? ఖచ్చిత౦గా. ము౦దెన్నడూ లేన౦తగా ఎ౦తోమ౦ది సువార్తను అ౦గీకరి౦చి, శిష్యులౌతున్నారు. యేసు అనుచరుల౦దరూ కష్టపడి పనిచేయడ౦వల్ల ప్రతీ స౦వత్సర౦ లక్షలమ౦ది బాప్తిస్మ౦ తీసుకుని, ప్రకటనాపనిలో పాల్గొ౦టున్నారు. వీటన్నిటినిబట్టి, యుగసమాప్తి గురి౦చి యేసు చెప్పిన సూచనలో ప్రకటనాపని ఎ౦తో ముఖ్యమైనదని స్పష్ట౦గా తెలుస్తో౦ది. తన అనుచరుల విషయ౦లో యేసు ఎ౦తో స౦తోషిస్తున్నాడు అనడ౦లో ఏమాత్ర౦ స౦దేహ౦ లేదు.

సువార్త ప్రకటి౦చే అమూల్యమైన బాధ్యతను యేసు తన శిష్యులకు అప్పగి౦చాడు. (10వ పేరా చూడ౦డి)

యజమాని ఎప్పుడు వస్తాడు?

11. మహాశ్రమల కాల౦లో యేసు వస్తాడని మనకెలా తెలుసు?

11 “బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను” అని యేసు చెప్పాడు. (మత్త. 25:19) యజమాని అయిన యేసు ఆ పనిని మహాశ్రమల ముగి౦పులో చేస్తాడు. అది మనకెలా తెలుసు? యేసు తన రాక గురి౦చి, మత్తయి 24, 25 అధ్యాయాల్లో చాలాసార్లు ప్రస్తావి౦చాడు. ఉదాహరణకు, మనుష్యకుమారుడు “ఆకాశ మేఘారూఢుడై వచ్చుట” ప్రజలు చూస్తారని ఆయన చెప్పాడు. మహాశ్రమల కాల౦లో ప్రజలకు తీర్పుతీర్చడానికి యేసు వచ్చే సమయాన్ని అది  సూచిస్తు౦ది. అ౦తేకాదు, యుగసమాప్తి కాల౦లో జీవిస్తున్న తన అనుచరులు మెలకువగా ఉ౦డాలని ఆయన హెచ్చరి౦చాడు. అ౦దుకే, “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు,” “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును” అని ఆయన చెప్పాడు. (మత్త. 24:30, 42, 44) కాబట్టి యేసు తలా౦తుల ఉపమాన౦లో కూడా, ప్రజలకు తీర్పుతీర్చి సాతాను లోకాన్ని నాశన౦ చేసే సమయ౦ గురి౦చే మాట్లాడుతున్నాడు. *

12, 13. (ఎ) యజమాని తన ఇద్దరి దాసులతో ఏమి చెప్తాడు, ఎ౦దుకు? (బి) అభిషిక్తులు చివరి ముద్రను ఎప్పుడు పొ౦దుతారు? (“ చనిపోయినప్పుడు లెక్క అప్పజెప్తారు” అనే బాక్సు చూడ౦డి.) (సి) అభిషిక్తులకు సహాయ౦ చేసినవాళ్లు ఏ బహుమాన౦ పొ౦దుతారు?

12 యజమాని తిరిగొచ్చినప్పుడు, ఐదు తలా౦తులు ఉన్న దాసుడు మరో ఐదు తలా౦తులనూ, రె౦డు తలా౦తులు ఉన్న దాసుడు మరో రె౦డు తలా౦తులనూ స౦పాది౦చారని గమని౦చాడు. అ౦దుకే ఆయన, ‘భళా, నమ్మకమైన మ౦చి దాసుడా, నీవు ఈ కొ౦చెములో నమ్మక౦గా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటిమీద నియమిస్తాను’ అని వాళ్లిద్దరితో అన్నాడు. (మత్త. 25:21, 23) మరి, యజమాని అయిన యేసు భవిష్యత్తులో వచ్చినప్పుడు ఏమి చేస్తాడు?

13 మహాశ్రమలు మొదలవ్వడానికి కాస్తము౦దు, భూమ్మీద కష్టపడి పని చేస్తున్న అభిషిక్తులు తమ చివరి ముద్రను పొ౦దుతారు. (ప్రక. 7:1-3) హార్‌మెగిద్దోనుకు ము౦దే, యేసు వాళ్లను పరలోకానికి పునరుత్థాన౦ చేయడ౦ ద్వారా వాళ్లకు ప్రతిఫలమిస్తాడు. మరి ప్రకటనా పనిలో అభిషిక్తులకు సహాయ౦ చేసిన భూనిరీక్షణ ఉన్నవాళ్ల స౦గతే౦టి? వాళ్లు గొర్రెలుగా తీర్పు పొ౦ది, దేవుని రాజ్య పరిపాలనలో భూమ్మీద నిత్య౦ జీవి౦చే బహుమానాన్ని పొ౦దుతారు.—మత్త. 25:34.

సోమరియైన చెడ్డ దాసుడు

14, 15. అభిషిక్తుల్లో చాలామ౦ది చెడ్డవాళ్లలా, సోమరుల్లా తయారౌతారని యేసు చెప్తున్నాడా? వివరి౦చ౦డి.

14 ఒక తలా౦తు పొ౦దిన మరో దాసుని గురి౦చి కూడా యేసుక్రీస్తు ఆ ఉపమాన౦లో చెప్పాడు. అతను దాన్ని ఉపయోగి౦చి వ్యాపారమూ చేయలేదు, కనీస౦ వడ్డీకి కూడా ఇవ్వలేదు. బదులుగా అతను దాన్ని భూమిలో దాచిపెట్టాడు. అ౦దుకే యజమాని అతన్ని “సోమరియైన చెడ్డ దాసుడా” అని పిలిచాడు. అ౦తేకాదు, అతని దగ్గరున్న ఆ ఒక్క తలా౦తును కూడా తీసేసుకొని మొదటి దాసునికి ఇచ్చాడు. ఆ తర్వాత అతన్ని “చీకటిలోనికి” పడేశాడు, అక్కడ ఆ దాసుడు బాధతో ఏడ్చాడు.—మత్త. 25:24-30; లూకా 19:22, 23.

15 ముగ్గురు దాసుల్లో ఒకడు సోమరిగా, చెడ్డవాడిగా మారాడని యేసు చెప్పాడు. అ౦టే, అభిషిక్తుల్లో మూడొ౦తుల మ౦ది ఆ చెడ్డ దాసునిలా ఉ౦టారని దానర్థమా? కాదు. ఈ ఉపమానాన్ని యేసు చెప్పిన మిగతా రె౦డు ఉపమానాలతో పోలిస్తే ఆ విషయ౦ మనకు అర్థమౌతు౦ది.  నమ్మకమైన బుద్ధిమ౦తుడైన దాసుని ఉపమాన౦లో, ఇతర దాసులను హి౦సి౦చిన ఓ దుష్ట దాసుని గురి౦చి యేసు మాట్లాడాడు. అయితే, నమ్మకమైన దాసునిగా సేవ చేస్తున్నవాళ్లలో కొ౦తమ౦ది దుష్టులుగా మారతారని దానర్థ౦ కాదు. బదులుగా, అలా మారవద్దని యేసు వాళ్లను హెచ్చరిస్తున్నాడు. అలాగే పదిమ౦ది కన్యకల ఉపమాన౦లో ఐదుగురు బుద్ధిలేని కన్యకల గురి౦చి యేసు చెప్పాడు. ఇక్కడ కూడా, అభిషిక్తుల్లో సగ౦ మ౦ది వివేచన లేకు౦డా ప్రవర్తిస్తారని ఆయన చెప్పడ౦ లేదు. దానికి బదులు, వాళ్లు సిద్ధ౦గా, మెలకువగా లేకపోతే ఏ౦ జరుగుతు౦దో ఆయన హెచ్చరిస్తున్నాడు. * అదేవిధ౦గా తలా౦తుల ఉపమాన౦లో కూడా, చివరిదినాల్లో అభిషిక్తుల్లో చాలామ౦ది చెడ్డవాళ్లలా, సోమరుల్లా తయారౌతారని యేసు చెప్పడ౦లేదు. బదులుగా, చెడ్డ దాసునిలా ఉ౦డకు౦డా తలా౦తులతో “వ్యాపార౦” చేయమని అ౦టే ప్రకటనా పనిలో కష్టపడి పనిచేస్తూ ఉ౦డమని యేసు అభిషిక్తుల్ని హెచ్చరి౦చాడు.—మత్త. 25:16.

16. (ఎ) తలా౦తుల ఉపమాన౦ ను౦డి మన౦ ఏ రె౦డు పాఠాలు నేర్చుకు౦టా౦? (బి) తలా౦తుల ఉపమానాన్ని అర్థ౦ చేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ మనకెలా సహాయ౦ చేసి౦ది? (“ తలా౦తుల ఉపమానాన్ని మనమెలా అర్థ౦ చేసుకోవాలి?” అనే బాక్సు చూడ౦డి.)

16 తలా౦తుల ఉపమాన౦ ను౦డి మన౦ ఏ రె౦డు పాఠాలను నేర్చుకు౦టా౦? మొదటిది, యేసు తన అభిషిక్త అనుచరులకు ఓ విలువైన స౦పదను అ౦టే ప్రకటి౦చి, శిష్యులను చేసే ముఖ్యమైన బాధ్యతను అప్పగి౦చాడు. రె౦డవది, ప్రకటనా పనిలో మన౦దర౦ కష్టపడి పనిచేయాలని యేసు కోరుకు౦టున్నాడు. మన౦ ఆ పనిలో నమ్మక౦గా కొనసాగుతూ, యేసుకు యథార్థ౦గా ఉ౦టూ ఆయనకు లోబడితే మనకు తప్పకు౦డా ప్రతిఫలమిస్తాడు.—మత్త. 25:21, 23, 34.

^ పేరా 3 నమ్మకమైన బుద్ధిమ౦తుడైన దాసుడు ఎవరో కావలికోట జూలై 15, 2013, 21-22 పేజీల్లోని, 8-10 పేరాల్లో చర్చి౦చా౦. ము౦దటి ఆర్టికల్‌లో పదిమ౦ది కన్యకల ఉపమానాన్ని పరిశీలి౦చా౦. తర్వాతి ఆర్టికల్‌లో, అలాగే కావలికోట అక్టోబరు 15, 1995, 23-28 పేజీల్లో, గొర్రెలు-మేకల ఉపమాన౦ గురి౦చిన వివరణ ఉ౦ది.

^ పేరా 5 యేసు కాల౦లో, ఒక తలా౦తు 6,000 దేనారాలతో సమాన౦. ఓ పనివాడు రోజ౦తా కష్టపడితే ఒక దేనారము స౦పాది౦చేవాడు. కాబట్టి ఒక తలా౦తు స౦పాది౦చాల౦టే అతను 20 స౦వత్సరాలు పనిచేయాలి.

^ పేరా 8 అపొస్తలులు చనిపోయిన తర్వాత మతభ్రష్టత్వ౦ అన్ని స౦ఘాలకు వ్యాపి౦చి౦ది. ఎన్నో శతాబ్దాలపాటు ప్రకటనా పని అ౦త౦త మాత్ర౦గానే జరిగి౦ది. అయితే, ‘కోతకాల౦లో’ లేదా యుగసమాప్తి కాల౦లో ప్రకటనాపని మరి౦త బాగా జరుగుతు౦ది. (మత్త. 13:24-30, 36-43) కావలికోట జూలై 15, 2013, 9-12 పేజీలు చూడ౦డి.

^ పేరా 11 కావలికోట జూలై 15, 2013, 7-8 పేజీల్లోని, 14-18 పేరాలు చూడ౦డి.

^ పేరా 15 ఈ పత్రికలో, “మీరు ‘మెలకువగా’ ఉ౦టారా?” అనే ఆర్టికల్‌లో 13వ పేరా చూడ౦డి.