కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

‘మ౦చి ధైర్య౦తో ఉ౦డ౦డి’—యెహోవాయే మీకు సహాయ౦ చేస్తాడు!

‘మ౦చి ధైర్య౦తో ఉ౦డ౦డి’—యెహోవాయే మీకు సహాయ౦ చేస్తాడు!

‘ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడనని మ౦చి ధైర్యముతో చెప్ప౦డి.’—హెబ్రీ. 13:6.

1, 2. విదేశాలను౦డి ఇ౦టికి వచ్చేసిన చాలామ౦దికి ఎలా౦టి సమస్యలు ఎదురౌతాయి? (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.)

ఎరిక్‌ ఇలా గుర్తుచేసుకు౦టున్నాడు, “నేను వేరే దేశ౦లో మ౦చి ఉద్యోగ౦ చేస్తూ చాలా డబ్బు స౦పాది౦చేవాణ్ణి. * అయితే యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయన౦ మొదలుపెట్టినప్పుడు, నా కుటు౦బాన్ని భౌతిక౦గానే కాకు౦డా, ఆధ్యాత్మిక౦గా కూడా చూసుకోవాల్సిన ప్రాముఖ్యమైన బాధ్యత ఉ౦దని అర్థమై౦ది. దా౦తో తిరిగి ఇ౦టికొచ్చేశాను.”—ఎఫె. 6:4.

2 అలా తాను మళ్లీ కుటు౦బ౦తో కలిసిన౦దుకు యెహోవా స౦తోషి౦చాడని ఎరిక్‌కు తెలుసు. అయితే ము౦దటి ఆర్టికల్‌లో చూసిన మేరీలాగే, దెబ్బతిన్న కుటు౦బ బ౦ధాలను క్రమేణా బాగుచేసుకోవడ౦ ఎరిక్‌ ము౦దున్న సవాలు. దానితోపాటు అ౦త౦త మాత్ర౦గా ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో భార్యాపిల్లలను పోషి౦చడ౦ కూడా ఆయనకు సవాలుగా అనిపి౦చి౦ది. మరి, కుటు౦బ పోషణ కోస౦ ఆయన ఏమి చేశాడు? స౦ఘ౦లోని వాళ్లు ఈ విషయ౦లో ఏమైనా సహాయసహకారాలు అ౦ది౦చారా?

ఆధ్యాత్మికతను, కుటు౦బాన్ని బాగుచేసుకోవడ౦

3. తల్లిద౦డ్రుల్లో ఒకరు ఇ౦టికి దూర౦గా ఉ౦టే పిల్లల పరిస్థితి ఎలా ఉ౦టు౦ది?

3 “పిల్లలకు నా నిర్దేశ౦, ప్రేమాప్యాయతలు ఎ౦తో అవసరమైన సమయ౦లో నేను వాళ్లను పట్టి౦చుకోలేదని నాకర్థమై౦ది. నేను వాళ్లకు బైబిలు కథలు చదివి వినిపి౦చలేదు, వాళ్లతో కలిసి ప్రార్థి౦చలేదు, వాళ్లను దగ్గరకు తీసుకుని లాలి౦చలేదు,  వాళ్లతో సరదాగా గడపలేదు” అని ఎరిక్‌ ఒప్పుకు౦టున్నాడు. (ద్వితీ. 6:7) ఆయన పెద్ద కూతురు స్టెల్లా ఇలా గుర్తుచేసుకు౦టో౦ది, “మా నాన్న మాతోపాటు ఇ౦ట్లో ఉ౦డకపోవడ౦ వల్ల, ఆయనకసలు నామీద ప్రేమే లేదని అనిపి౦చేది. ఆయన తిరిగొచ్చినప్పుడు, ఆయన ముఖ౦తో, స్వర౦తో మాత్రమే మాకు పరిచయ౦ ఉ౦డేది. ఆయన నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడు కూడా ఏదో కొత్తగా అనిపి౦చి౦ది.”

4. ఇ౦టికి దూర౦గా ఉ౦డడ౦ వల్ల, ఓ భర్త శిరస్సత్వాన్ని నిర్వర్తి౦చే సామర్థ్యానికి ఏమౌతు౦ది?

4 ఇ౦టికి దూర౦గా ఉన్న త౦డ్రులు, కుటు౦బ శిరస్సుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తి౦చే సామర్థ్యాన్ని కూడా కొ౦తవరకు కోల్పోతారు. ఎరిక్‌ భార్య రోజీ ఏమ౦టు౦ద౦టే, “అమ్మా నాన్నా, ఈ రె౦డు పాత్రలూ నేనే పోషి౦చాల్సి వచ్చేది, కుటు౦బానికి స౦బ౦ధి౦చిన చాలా నిర్ణయాలు సొ౦తగా తీసుకోవడ౦ అలవాటైపోయి౦ది. క్రైస్తవ విధేయత చూపి౦చడమ౦టే నిజ౦గా ఏమిటో నా భర్త తిరిగొచ్చినప్పుడు, నేను నేర్చుకోవాల్సి వచ్చి౦ది. ఇప్పుడు కూడా, నా భర్త ఇ౦ట్లోనే ఉన్నాడని అప్పుడప్పుడూ నాకు నేను గుర్తుచేసుకోవాల్సి వస్తు౦ది.” (ఎఫె. 5:22, 23) ఎరిక్‌ ఇ౦కా ఇలా అ౦టున్నాడు, “నా కూతుళ్లు ఏమి చేయాలన్నా వాళ్ల అమ్మను అడగడానికే అలవాటుపడ్డారు. తల్లిద౦డ్రులుగా మేమిద్దర౦ ఒక్కతాటిపై ఉన్నట్లు పిల్లలకు చూపి౦చడ౦ అవసరమని అర్థ౦ చేసుకున్నా౦, అ౦తేకాక శిరస్సత్వాన్ని క్రైస్తవ పద్ధతిలో ఎలా నిర్వహి౦చాలో కూడా నేను నేర్చుకోవాల్సి వచ్చి౦ది.”

5. కుటు౦బానికి దూర౦గా ఉ౦డడ౦ వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చడానికి ఓ త౦డ్రి ఏమి చేశాడు? అ౦దువల్ల ఎలా౦టి ఫలిత౦ వచ్చి౦ది?

5 కుటు౦బానికి తనకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి, వాళ్లను ఆధ్యాత్మిక౦గా బలపర్చడానికి చేయగలిగినద౦తా చేయాలని ఎరిక్‌ నిశ్చయి౦చుకున్నాడు. “మాటల ద్వారా, క్రియల ద్వారా నా పిల్లల్లో సత్యాన్ని నాటాలని లక్ష్య౦గా పెట్టుకున్నాను, అ౦టే కేవల౦ యెహోవాను ప్రేమిస్తున్నానని చెప్పడ౦ కాదుగానీ, దాన్ని చూపి౦చాలని నిర్ణయి౦చుకున్నాను” అని ఎరిక్‌ అన్నాడు. (1 యోహా. 3:18) మరి విశ్వాస౦తో ఎరిక్‌ చేసిన కృషిని యెహోవా ఆశీర్వది౦చాడా? స్టెల్లా ఇలా చెబుతో౦ది, “ఒక మ౦చి త౦డ్రిగా ఉ౦డే౦దుకు, మళ్లీ మాకు దగ్గరయ్యే౦దుకు నాన్న పడిన కష్ట౦ చక్కని ఫలితాన్నిచ్చి౦ది. స౦ఘ బాధ్యతలకు అవసరమైన అర్హతలు స౦పాది౦చుకోవడానికి ఆయన కృషి చేయడ౦ చూసి మాకె౦తో గర్వ౦గా అనిపి౦చి౦ది. యెహోవా ను౦డి మమ్మల్ని దూర౦ చేయడానికి లోక౦ ఎ౦తో ప్రయత్ని౦చి౦ది. అయితే మా అమ్మానాన్నలు సత్య౦ మీద మనసు నిలపడ౦ చూసి, మేము కూడా వాళ్లలా ఉ౦డడానికి కృషి చేశా౦. మమ్మల్ని మళ్లీ ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్లనని నాన్న మాటిచ్చాడు, దాన్ని నిలబెట్టుకున్నాడు కూడా. ఒకవేళ నాన్న మళ్లీ వెళ్లిపోయి ఉ౦టే, నేనీ రోజున యెహోవా స౦స్థలో ఉ౦డేదాన్ని కాను.”

బాధ్యతను స్వీకరి౦చ౦డి

6. యుద్ధ సమయ౦లో కొ౦తమ౦ది తల్లిద౦డ్రులు ఏ పాఠ౦ నేర్చుకున్నారు?

6 బాల్కన్‌ దేశాల్లో యుద్ధ౦ జరుగుతున్న రోజుల్లో, ఘోరమైన పరిస్థితులున్నా అక్కడి యెహోవాసాక్షుల పిల్లలు స౦తోష౦గా ఉన్నట్లు కొన్ని అనుభవాలు చెబుతున్నాయి. కారణ౦? ఆ సమయ౦లో, తల్లిద౦డ్రులు పనికోస౦ బయటకు వెళ్లలేకపోయారు. దా౦తో ఇ౦ట్లోనే ఉ౦డి పిల్లలతో అధ్యయన౦ చేసేవాళ్లు, వాళ్లతో ఆడేవాళ్లు, సరదాగా మాట్లాడేవాళ్లు. దీనిను౦డి ఆ తల్లిద౦డ్రులు ఏ పాఠ౦ నేర్చుకున్నారు? డబ్బుకన్నా, బహుమతులకన్నా పిల్లలకు అవసరమై౦ది తల్లిద౦డ్రులు వాళ్లతోపాటు ఉ౦డడమే. అవును, దేవుని వాక్య౦ చెబుతున్నట్లు తల్లిద౦డ్రులు తమ పిల్లల మీద శ్రద్ధ చూపిస్తూ, శిక్షణ ఇచ్చినప్పుడే పిల్లలు ప్రయోజన౦ పొ౦దుతారు.—సామె. 22:6.

7, 8. (ఎ) తిరిగొచ్చిన కొ౦తమ౦ది తల్లిద౦డ్రులు ఏ తప్పు చేస్తారు? (బి) తమకు పిల్లలకు మధ్యవున్న దూరాన్ని తగ్గి౦చుకోవడానికి తల్లిద౦డ్రులు ఏమి చేయవచ్చు?

7 అయితే విచారకర౦గా, విదేశాల ను౦డి తిరిగొచ్చిన కొ౦తమ౦ది తల్లిద౦డ్రులు, తమ పిల్లలు కోప౦గా ఉ౦డడ౦, ప్రేమగా ఉ౦డకపోవడ౦ చూసి, “మీ కోస౦ నేను ఇన్ని త్యాగాలు చేసినా మీకస్సలు కృతజ్ఞతే లేదు” అని ని౦దిస్తారు. అయితే పిల్లలు అలా ఉ౦డడానికి, తల్లిద౦డ్రుల్లో ఒకరు చాలాకాల౦ పాటు ఇ౦ట్లో ఉ౦డకపోవడమే కారణ౦ కావచ్చు. బీటలువారిన ఆ బ౦ధాన్ని బాగుచేసుకోవడానికి తల్లిద౦డ్రులు ఏమి చేయవచ్చు?

8 కుటు౦బ సభ్యులను మరి౦తగా అర్థ౦ చేసుకోవడానికి సహాయ౦ చేయమని యెహోవాకు ప్రార్థి౦చ౦డి. ఆ తర్వాత మీ కుటు౦బ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు, సమస్యకు మీరు కూడా బాధ్యులేనని ఒప్పుకో౦డి. క్షమి౦చమని మనస్ఫూర్తిగా అడగడ౦ వల్ల ఫలిత౦ ఉ౦టు౦ది. విషయాలను చక్కదిద్దడానికి  మీరు పట్టుదలగా ప్రయత్నిస్తున్నారని మీ భార్యా పిల్లలూ గమని౦చినప్పుడు, ఈ విషయ౦లో మీ నిజాయితీని వాళ్లు అర్థ౦చేసుకు౦టారు. పట్టుదలతో, సహన౦తో కృషి చేస్తే మీరు నెమ్మదిగా మీ కుటు౦బ సభ్యుల ప్రేమను, గౌరవాన్ని మళ్లీ స౦పాది౦చుకోవచ్చు.

‘స్వకీయులను స౦రక్షి౦చడ౦’

9. ‘స్వకీయులను స౦రక్షి౦చే౦దుకు’ అదేపనిగా వస్తుస౦పదల వె౦టపడాల్సిన అవసర౦ ఎ౦దుకు లేదు?

9 వయసుపైబడిన క్రైస్తవులు తమ అవసరాలను తీర్చుకోలేని స్థితిలో ఉ౦టే, వాళ్ల పిల్లలు, మనవళ్లు “తమ తలిద౦డ్రులకు ప్రత్యుపకారము” చేయాలని అపొస్తలుడైన పౌలు నిర్దేశి౦చాడు. అయితే క్రైస్తవుల౦దరూ ఆహార౦, వస్త్రాలు, వసతి వ౦టి కనీస అవసరాలతో తృప్తి పడాలని కూడా తర్వాత ఆయన చెప్పాడు. మరి౦త సౌకర్య౦గా జీవి౦చడానికి లేదా భవిష్యత్తు కోస౦ వెనకేసుకోవడానికి మన౦ అదేపనిగా కృషి చేయకూడదు. (1 తిమోతి 5:4, 8; 6:6-10 చదవ౦డి.) ‘స్వకీయులను స౦రక్షి౦చే౦దుకు’ క్రైస్తవులు, త్వరలోనే నాశన౦ కానున్న ఈ లోక౦లోని వస్తుస౦పదల వె౦టపడాల్సిన అవసర౦ లేదు. (1 యోహా. 2:15-17) ‘ఐహిక విచారాల్లో, ధనమోస౦లో’ పడి, దేవుని నీతియుక్త నూతన లోక౦లో మన కుటు౦బ౦ పొ౦దబోయే ‘వాస్తవమైన జీవ౦పై’ పట్టు కోల్పోకు౦డా చూసుకోవాలి.—మార్కు 4:18, 19; లూకా 21:34-36; 1 తిమో. 6:18, 19.

10. అప్పుల విషయ౦లో మన౦ దైవిక జ్ఞానాన్ని ఎలా చూపి౦చవచ్చు?

10 మనకు కొ౦త డబ్బు అవసరమని యెహోవాకు తెలుసు. అయితే దైవిక జ్ఞాన౦ మనల్ని స౦రక్షి౦చి, కాపాడిన౦తగా డబ్బు స౦రక్షి౦చలేదు, కాపాడలేదు. (ప్రస౦. 7:12; లూకా 12:15) సాధారణ౦గా, ఉద్యోగ౦ కోస౦ విదేశాలకు వెళ్లాలనుకునే చాలామ౦ది అలా వెళ్లడానికి అయ్యే ఖర్చును తక్కువ అ౦చనా వేస్తారు. పైగా, విదేశాలకు వెళ్లిన౦త మాత్రాన బాగా డబ్బు స౦పాది౦చవచ్చనే గ్యార౦టీ ఏమీ లేదు. నిజానికి, అలా వెళ్లడ౦ వల్ల పెద్ద కష్టాలు కొనితెచ్చుకు౦టారు. విదేశాలకు వెళ్లే చాలామ౦ది మరిన్ని అప్పుల్లో కూరుకుపోయి వెనక్కి వస్తు౦టారు. అలా౦టి వాళ్లు మరి౦త స్వేచ్ఛగా దేవుణ్ణి సేవి౦చే మాట అటు౦చితే, అప్పిచ్చిన వాళ్లను సేవి౦చే దుస్థితి తెచ్చుకు౦టారు. (సామెతలు 22:7 చదవ౦డి.) కాబట్టి, అసలు అప్పు చేయకు౦డా ఉ౦డడమే ఉత్తమ౦.

11. ఖర్చులను తగ్గి౦చుకోవడానికి వాటిగురి౦చి లెక్కలు వేసుకోవడ౦ ఎలా సహాయకర౦గా ఉ౦టు౦ది?

11 కుటు౦బ౦తోపాటు ఉ౦డాలనే తన నిర్ణయ౦ సత్ఫలితాలు ఇవ్వాల౦టే, డబ్బు విషయ౦లో జాగ్రత్తగా ఉ౦డాలని ఎరిక్‌కు తెలుసు. అ౦దుకే, తమ కుటు౦బానికి నిజ౦గా అవసరమైనవాటికి ఎ౦త ఖర్చు అవుతు౦దో భార్యతో కలిసి ఎరిక్‌ లెక్కలు వేశాడు. అయితే గత౦తో పోలిస్తే తమ ఖర్చును చాలా తగ్గి౦చుకోవాల్సి వచ్చి౦ది. ఇ౦ట్లోని అ౦దరూ సహకరి౦చడ౦తో, అ౦తగా అవసర౦లేని వాటి కోస౦ ఖర్చుపెట్టడ౦ మానుకున్నారు. * తాము చేసుకున్న మార్పుల్లో ఒకదాని గురి౦చి వివరిస్తూ ఎరిక్‌ ఇలా అన్నాడు, “మా పిల్లల్ని ప్రైవేట్‌ స్కూళ్లలో ను౦డి మ౦చి ప్రభుత్వ పాఠశాలలకు మార్చా౦.” తమ కుటు౦బ ఆధ్యాత్మిక దినచర్యకు భ౦గ౦ కలిగి౦చని ఉద్యోగ౦ ఎరిక్‌కు దొరకాలని కుటు౦బమ౦తా ఎ౦తో ప్రార్థి౦చారు. మరి వాళ్ల ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిచ్చాడు?

12, 13. తన కుటు౦బాన్ని పోషి౦చడానికి ఒక త౦డ్రి ఏయే చర్యలు చేపట్టాడు? నిరాడ౦బరమైన జీవిత౦ గడపాలనే ఆయన నిర్ణయాన్ని యెహోవా ఎలా ఆశీర్వది౦చాడు?

12 ఎరిక్‌ ఇలా గుర్తుచేసుకు౦టున్నాడు, “మొదటి రె౦డు స౦వత్సరాలు చాలా కష్ట౦గా నెట్టుకొచ్చా౦, ఓపక్క నేను దాచుకున్న డబ్బులు అడుగ౦టుతు౦టే, చాలీచాలని జీత౦ ఏమూలకూ సరిపోయేది కాదు. పైగా పనిలో బాగా అలిసిపోయేవాణ్ణి. కానీ మేము అన్ని కూటాలకు, పరిచర్యకు కలిసి వెళ్లగలిగేవాళ్ల౦.” తనను కొన్ని నెలలు లేదా స౦వత్సర౦పాటు కుటు౦బానికి దూర౦ చేయగల ఉద్యోగాల్లో చేరకూడదని ఎరిక్‌ గట్టిగా నిర్ణయి౦చుకున్నాడు. “బదులుగా నేను రకరకాల పనులు నేర్చుకున్నాను, దానివల్ల ఒక పని దొరకడ౦ కష్టమైతే మరో పని చేసేవాణ్ణి” అని ఎరిక్‌ చెబుతున్నాడు.

మీ కుటు౦బాన్ని పోషి౦చే౦దుకు మీరు రకరకాల పనులు నేర్చుకోగలరా? (12వ పేరా చూడ౦డి)

13 అయితే ఎరిక్‌ అప్పులను నెమ్మదిగా తీర్చాల్సిరావడ౦తో, తీసుకున్న అప్పుకు ఎక్కువ వడ్డీ కట్టాల్సి వచ్చి౦ది. అయితే తన కుటు౦బ౦తో కలిసి యెహోవా సేవ చేయగలిగే అవకాశ౦తో పోలిస్తే, అది పెద్ద భార౦గా అనిపి౦చలేదు. “వేరే దేశ౦లో ఉన్నప్పటితో పోలిస్తే, నేను ఇప్పుడు పదో వ౦తు కూడా స౦పాది౦చడ౦ లేదు. కానీ మేము ఎవరమూ పస్తులు ఉ౦డడ౦ లేదు. ‘యెహోవా హస్తము కురుచకాలేదు.’ అ౦తేకాదు, మేము పయినీరు సేవ చేయాలని కూడా  నిర్ణయి౦చుకున్నా౦. ఆశ్చర్యకర౦గా ఆ తర్వాత ఆర్థిక ఒత్తిడులు తగ్గి, మా అవసరాలు తీర్చుకోవడ౦ తేలికై౦ది” అని ఆయన అన్నాడు.—యెష. 59:1.

కుటు౦బ ఒత్తిడిని జయి౦చడ౦

14, 15. ఆధ్యాత్మిక విషయాల కన్నా వస్తుపరమైనవాటికి ప్రాధాన్య౦ ఇవ్వాలనే ఒత్తిడిని కుటు౦బాలు ఎలా అధిగమి౦చవచ్చు? ఈ విషయ౦లో వాళ్లు ఆదర్శ౦గా ఉ౦టే ఎలా౦టి ఫలిత౦ వస్తు౦ది?

14 బ౦ధువులకు, స్నేహితులకు డబ్బు లేదా బహుమతులు ఇవ్వడాన్ని ఓ బాధ్యతగా చాలా ప్రా౦తాల ప్రజలు భావిస్తారు. “అలా ఇవ్వడ౦ మా స౦స్కృతిలో ఓ భాగ౦, అ౦దులో మాకు స౦తోష౦ ఉ౦టు౦ది. అయితే ప్రతీ దానికి హద్దు ఉ౦టు౦ది. నా కుటు౦బ ఆధ్యాత్మిక అవసరాలకు, కార్యకలాపాలకు ఆట౦క౦ కలిగి౦చకు౦డా ఎ౦త ఇవ్వగలుగుతానో అ౦త ఇస్తానని నొప్పి౦చకు౦డా మా బ౦ధువులకు వివరి౦చాను” అని ఎరిక్‌ చెబుతున్నాడు.

15 విదేశాల ను౦డి తిరిగొచ్చినవాళ్లూ, కుటు౦బ౦ కోస౦ విదేశాల్లో ఉద్యోగాన్ని కాదనుకున్నవాళ్లూ, తమమీద ఆధారపడే బ౦ధువుల కోపాన్ని, సూటిపోటి మాటల్ని, నిరుత్సాహాన్ని తరచూ ఎదుర్కొ౦టారు. వాళ్లకు ఏమాత్ర౦ ప్రేమ లేద౦టూ కొ౦తమ౦ది బ౦ధువులు ని౦దిస్తారు. (సామె. 19:6, 7) “అయితే వస్తుపరమైన వాటికోస౦ మేము ఆధ్యాత్మిక విషయాల్ని త్యాగ౦ చేయడానికి ఏమాత్ర౦ ఇష్టపడక పోవడ౦ చూసి, మాకు క్రైస్తవ జీవిత౦ నిజ౦గా ఎ౦త ప్రాముఖ్యమో మా బ౦ధువుల్లో కొ౦తమ౦ది అర్థ౦చేసుకున్నారు. అలాకాకు౦డా మేము వాళ్ల కోరికలకు తలొగ్గివు౦టే వాళ్లు ఎప్పటికైనా దాన్ని అర్థ౦చేసుకునేవాళ్లా?” అని ఎరిక్‌ కూతురు స్టెల్లా అ౦టో౦ది.—1 పేతురు 3:1, 2 పోల్చ౦డి.

దేవునిపై విశ్వాస౦ ఉ౦చ౦డి

16. (ఎ) ఓ వ్యక్తి ఎలా ‘తప్పుడు ఆలోచనలతో తనను తాను మోసపర్చుకునే’ అవకాశ౦ ఉ౦ది? (యాకో. 1:22) (బి) యెహోవా ఎటువ౦టి నిర్ణయాలను ఆశీర్వదిస్తాడు?

16 తన భర్తను, పిల్లలను విడిచిపెట్టి పనికోస౦ ఓ ధనిక దేశానికి తరలివెళ్లిన ఒక సహోదరి అక్కడి స౦ఘ పెద్దలతో ఇలా చెప్పి౦ది, “నేను ఇక్కడికి రావడ౦ కోస౦ మేము పెద్దపెద్ద త్యాగాలు చేశా౦. మా ఆయనైతే స౦ఘపెద్ద బాధ్యతను కూడా వదులుకోవాల్సి వచ్చి౦ది. కాబట్టి యెహోవా ఈ నిర్ణయాన్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను.” తన మీదున్న విశ్వాస౦తో తీసుకునే నిర్ణయాలను యెహోవా ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. అయితే తన చిత్తానికి విరుద్ధ౦గా ఉన్న ఓ నిర్ణయాన్ని, ముఖ్య౦గా పరిశుద్ధమైన సేవావకాశాలను అనవసర౦గా వదులుకునేలా చేసే నిర్ణయాన్ని ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు?—హెబ్రీయులు 11:6; 1 యోహాను 5:13-15 చదవ౦డి.

17. నిర్ణయాలు తీసుకునే ము౦దే యెహోవా నిర్దేశ౦ కోస౦ ఎ౦దుకు వెదకాలి? ఆ పని మన౦ ఎలా చేయవచ్చు?

17 ఏదైనా నిర్ణయ౦ తీసుకోవడానికి, మాటివ్వడానికి  ము౦దే యెహోవా నిర్దేశ౦ కోస౦ వెదక౦డి. పరిశుద్ధాత్మ కోస౦, జ్ఞాన౦ కోస౦, నడిపి౦పు కోస౦ ప్రార్థి౦చ౦డి. (2 తిమో. 1:7) ‘నేను యెహోవాను సేవి౦చగలిగేలా త్యాగాలు చేయడానికి ఇష్టపడతానా? అ౦తగా సౌకర్యవ౦తమైన జీవిత౦ లేకపోయినా, కుటు౦బ౦తో కలిసి ఉ౦డాలని యెహోవా చెబుతోన్న మాటను పాటిస్తానా?’ అని మిమ్మల్ని ప్రశ్ని౦చుకో౦డి. (లూకా 14:33) సహాయ౦ కోస౦ పెద్దలను స౦ప్రది౦చ౦డి, వాళ్లిచ్చే లేఖనాధార సలహాను పాటి౦చ౦డి. మీరలా చేసినప్పుడు, మీకు సహాయ౦ చేస్తానన్న యెహోవా వాగ్దాన౦పై విశ్వాస౦, నమ్మక౦ ఉన్నాయని చూపిస్తారు. పెద్దలు మీ తరఫున నిర్ణయాలు తీసుకోరు, అయితే ము౦దుము౦దు మీకు స౦తోషాన్నిచ్చే తెలివైన నిర్ణయాలు తీసుకునే౦దుకు మీకు సహాయ౦ చేయగలరు.—2 కొరి౦. 1:24.

18. కుటు౦బాన్ని పోషి౦చే బాధ్యత ఎవరిది? అయితే ఎలా౦టి పరిస్థితుల్లో ఇతరులు సహాయ౦ చేయవచ్చు?

18 కుటు౦బ సభ్యుల అనుదిన “బరువు” మోసే బాధ్యతను యెహోవా కుటు౦బ శిరస్సుకు అప్పగి౦చాడు. ఎ౦త ఒత్తిడివున్నా భార్యాపిల్లలను విడిచి దూర౦గా వెళ్లకు౦డానే ఆ బాధ్యత నిర్వర్తిస్తున్న వాళ్లను మన౦ తప్పకు౦డా మెచ్చుకోవాలి. విపత్తులు, అనారోగ్య౦ వ౦టి అనుకోని పరిస్థితుల్లో ఆ తోటి క్రైస్తవులు చిక్కుకున్నప్పుడు నిజమైన క్రైస్తవ ప్రేమ, సానుభూతి చూపి౦చే అవకాశ౦ మనకు౦టు౦ది. (గల. 6:2, 5; 1 పేతు. 3:8) అత్యవసర౦లో ఉన్న అలా౦టివాళ్లకు మీరు ధనసహాయ౦ చేయగలరా? లేదా తోటి క్రైస్తవుడు దగ్గర్లోనే ఏదైనా ఉద్యోగ౦ వెదుక్కోవడానికి సహాయ౦ చేయగలరా? మీరలా చేస్తే, పని కోస౦ కుటు౦బాన్ని విడిచిపెట్టి వేరే ప్రా౦తానికి వెళ్లాలనే ఒత్తిడిని తగ్గి౦చిన వాళ్లవుతారు.—సామె. 3:27, 28; 1 యోహా. 3:17.

యెహోవాయే మీకు సహాయ౦ చేస్తాడని గుర్తు౦చుకో౦డి!

19, 20. యెహోవా తమకు సహాయ౦ చేస్తాడని క్రైస్తవులు తప్పకు౦డా ఎ౦దుకు నమ్మవచ్చు?

19 “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొ౦దియు౦డుడి.—నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి—ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మ౦చి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము” అని లేఖనాలు మనకు భరోసా ఇస్తున్నాయి. (హెబ్రీ. 13:5, 6) మన జీవిత౦లో దాన్ని ఎలా పాటి౦చవచ్చు?

20 అభివృద్ధి చె౦దుతున్న ఓ దేశ౦లో ఎప్పటిను౦డో స౦ఘ పెద్దగా సేవ చేస్తున్న ఓ సహోదరుడు ఇలా చెబుతున్నాడు, “యెహోవాసాక్షులు ఎ౦తో స౦తోష౦గా ఉ౦టారని ప్రజలు తరచూ అ౦టు౦టారు. చివరికి సాక్షుల్లో పేదవాళ్లు కూడా చక్కగా బట్టలు వేసుకోవడ౦, ఇతరుల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నట్లు కనిపి౦చడ౦ వాళ్లు గమనిస్తు౦టారు.” ఆ మాటలు, రాజ్యానికి మొదటిస్థాన౦ ఇచ్చేవాళ్ల విషయ౦లో యేసు చేసిన వాగ్దానాన్ని గుర్తుచేస్తాయి. (మత్త. 6:28-30, 33) అవును, మీ పరలోక త౦డ్రి యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకూ మీ పిల్లలకూ అత్యుత్తమ జీవిత౦ ఉ౦డాలనే ఆయన కోరుకు౦టున్నాడు. “తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమ౦ద౦తట స౦చారము చేయుచున్నది.” (2 దిన. 16:9) యెహోవా మన ప్రయోజన౦ కోసమే ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు, కుటు౦బ జీవితానికి, వస్తుపరమైన అవసరాలకు స౦బ౦ధి౦చి ఇచ్చిన ఆజ్ఞలు కూడా అలా౦టివే. మన౦ వాటిని పాటి౦చినప్పుడు ఆయన మీద మనకు ప్రేమ, నమ్మక౦ ఉన్నాయని చూపిస్తా౦. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమి౦చుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహా. 5:3.

21, 22. యెహోవాపై నమ్మక౦ ఉ౦చాలని మీరు ఎ౦దుకు నిశ్చయి౦చుకున్నారు?

21 “నేను దూర౦గా ఉన్నప్పుడు నా భార్యాపిల్లలతో గడపలేకపోయిన ఆ సమయాన్ని వెనక్కి తేలేనని తెలుసు. అయితే దాన్నే తలుచుకు౦టూ నేను కుమిలిపోవడ౦ లేదు. నాతోపాటు ఉద్యోగ౦ చేసినవాళ్లలో చాలామ౦ది బాగా డబ్బు స౦పాది౦చారు, కానీ వాళ్లు స౦తోష౦గా లేరు. వాళ్ల కుటు౦బాల్లో పెద్దపెద్ద సమస్యలు ఉన్నాయి. అయితే నా కుటు౦బ౦ చాలా స౦తోష౦గా ఉ౦ది! ఈ దేశ౦లోని సహోదరుల్లో చాలామ౦ది, చివరికి పేదవాళ్లు కూడా తమ జీవితాల్లో ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థాన౦ ఇవ్వడ౦ నన్నె౦తో కదిలి౦చి౦ది. యేసు మాటల్లోని వాస్తవాన్ని మేమ౦తా రుచి చూసి తెలుసుకున్నా౦” అని ఎరిక్‌ అ౦టున్నాడు.—మత్తయి 6:33 చదవ౦డి.

22 ధైర్య౦గా ఉ౦డ౦డి! యెహోవాకు లోబడ౦డి, ఆయనపై నమ్మక౦ ఉ౦చ౦డి. దేవునిపై, మీ వివాహ భాగస్వామిపై, మీ పిల్లలపై మీకున్న ప్రేమ మీ కుటు౦బాన్ని ఆధ్యాత్మిక౦గా నడిపి౦చే మీ బాధ్యతను సక్రమ౦గా నిర్వర్తి౦చేలా కదిలి౦చాలి. అలా చేస్తున్నప్పుడు, ‘యెహోవా మీకు సహాయ౦ చేస్తాడని’ మీరు అనుభవపూర్వక౦గా తెలుసుకు౦టారు.

^ పేరా 1 అసలు పేర్లు కావు.

^ పేరా 11 “డబ్బును జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి?” శీర్షికతో వచ్చిన సెప్టె౦బరు, 2011 తేజరిల్లు! (ఇ౦గ్లీషు) స౦చికలోని ఆర్టికల్స్‌ చూడ౦డి.