కుటుంబ విజయానికి 12 సలహాలు

కుటుంబాలు ఎందుకు విజయవంతం కాలేకపోతున్నాయనే విషయం గురించి చాలా కారణాలు వింటూ ఉంటాం. కానీ కుటుంబాలు విజయవంతం అవ్వాలంటే ఏమి చేస్తే బాగుంటుంది?

  • 1990 నుండి 2015 మధ్య సంవత్సరాల్లో అమెరికాలో విడాకులు తీసుకునే వాళ్ల సంఖ్య 50 ఏళ్లు పైనున్న వాళ్లలో రెండింతలు, 65 ఏళ్లు పైనున్న వాళ్లలో మూడింతలు పెరిగింది.

  • ఏమి చేయాలో తల్లిదండ్రులు తేల్చుకోలేకపోతున్నారు: కొంతమంది నిపుణులు పిల్లల్ని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి అని చెప్తారు, కాని ఇంకొంతమంది పిల్లలతో కఠినంగా ఉండాలి అని చెప్తారు.

  • పిల్లలు, వాళ్లకు కావాల్సిన సామర్థ్యాల్ని పెంచుకోకుండానే పెద్దవాళ్లు అవుతున్నారు.

కానీ నిజం చెప్పాలంటే,

  • భార్యాభర్తలు శాశ్వతంగా కలిసి ఉండవచ్చు, సంతోషంగా ఉండవచ్చు.

  • తల్లిదండ్రులు ప్రేమతో పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వడం నేర్చుకోవచ్చు.

  • ఎదుగుతున్న వయసులో కావాల్సిన సామర్థ్యాల్ని పిల్లలు అభివృద్ధి చేసుకోవచ్చు.

ఎలా? కుటుంబ విజయానికి సహాయం చేసిన 12 సలహాల గురించి ఈ తేజరిల్లు! పత్రిక చర్చిస్తుంది.