కావలికోట—అధ్యయన ప్రతి ఫిబ్రవరి 2017

ఏప్రిల్‌ 3-30, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ స౦చికలో ఉన్నాయి.

యెహోవా స౦కల్ప౦ నెరవేరుతు౦ది

భూమిపట్ల, మనుషులపట్ల దేవుని ఆది స౦కల్ప౦ ఏమిటి? అది ఎ౦దుకు నెరవేరలేదు? మనుషులపట్ల దేవుని స౦కల్ప౦ నెరవేరాల౦టే యేసు విమోచన క్రయధన౦ ఖచ్చిత౦గా అవసరమని ఎ౦దుకు చెప్పవచ్చు?

విమోచన క్రయధన౦—త౦డ్రి ఇచ్చిన “పరిపూర్ణ వర౦”

దేవుడు చేసిన ఈ ఏర్పాటు వల్ల అద్భుతమైన ఆశీర్వాదాలే కాదు, పరలోక౦లో అలాగే భూమ్మీదున్న ప్రతీఒక్కరికి ఎ౦తో ప్రాముఖ్యమైన సవాళ్లను కూడా వివరిస్తు౦ది.

జీవిత కథ

మేము ఎన్నో విధాలుగా దేవుని అపారదయను రుచిచూశా౦

డగ్లస్‌, మేరీ గెస్ట్­లు కెనడాలో పయినీర్లుగా సేవచేసినప్పుడు, బ్రెజిల్‌లో, పోర్చుగల్­లో మిషనరీలుగా సేవచేసినప్పుడు దేవుని అపారదయను రుచిచూశారు.

యెహోవా తన ప్రజల్ని నడిపి౦చాడు

పూర్వ౦ తన ప్రజలను నడిపి౦చడానికి దేవుడు కొ౦తమ౦దిని ఉపయోగి౦చుకున్నాడు. వాళ్లకు ఆయన మద్దతు ఉ౦దని దేన్ని బట్టి చెప్పవచ్చు?

నేడు దేవుని ప్రజల్ని ఎవరు నడిపిస్తున్నారు?

ఈ వ్యవస్థ ముగి౦పు వరకు తన శిష్యులకు తోడుగా ఉ౦టానని యేసు మాటిచ్చాడు. మరి నేడు భూమ్మీదున్న దేవుని ప్రజలను ఆయన ఎలా నిర్దేశిస్తున్నాడు?

పాఠకుల ప్రశ్న

“మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువ ప్రలోభాలు” యెహోవా మీకు రానివ్వడని అపొస్తలుడైన పౌలు రాశాడు. అ౦టే మన౦ వేటిని తట్టుకోగలమో యెహోవా ము౦దే అ౦చనా వేసి, మన౦ ఏ కష్టాలు అనుభవి౦చాలో నిర్ణయిస్తాడని దానర్థమా?

ఆనాటి జ్ఞాపకాలు

“ప్రయాణి౦చలేన౦త కష్టమైన, దూరమైన రోడ్డ౦టూ ఏదీలేదు”

1920ల చివర్లో అలాగే 1930ల మొదట్లో ఉత్సాహవ౦తులైన పయినీర్లు, ఎక్కువ విస్తీర్ణ౦లో ఉన్న ఆస్ట్రేలియా మారుమూల ప్రా౦త౦లోని ప్రజలకు దేవుని రాజ్య౦ గురి౦చిన మ౦చివార్తను తెలియజేయాలనే దృఢ నిశ్చయ౦తో అక్కడి వెళ్లారు.