కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

“ఈ పని బహు గొప్పది”

“ఈ పని బహు గొప్పది”

యెరూషలేములో ఓ ప్రాముఖ్యమైన కూట౦ జరగబోతో౦ది. రాజైన దావీదు అధిపతుల్ని, పెద్దల్ని, పరాక్రమశాలుల్ని పిలిపి౦చాడు. అక్కడ చేయబడిన ఒక ప్రత్యేక ప్రకటన విని వాళ్లు ఆశ్చర్యపోయారు. సత్యదేవుని ఆరాధన కోస౦ ఒక అసాధారణమైన కట్టడాన్ని నిర్మి౦చే పనిని దావీదు కుమారుడైన సొలొమోనుకు యెహోవా అప్పగి౦చాడు. ఆ నిర్మాణ౦ ఎలా ఉ౦డాలో తెలిపే నమూనాను తన పవిత్రశక్తి ద్వారా యెహోవా దావీదు రాజుకు తెలియజేశాడు, దాన్ని అతను సొలొమోనుకు ఇచ్చాడు. దావీదు ఇలా చెప్తున్నాడు, “కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది.”—1 దిన. 28:1, 2, 6, 11, 12; 29:1.

తర్వాత దావీదు, “ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?” అని అడిగాడు. (1 దిన. 29:5) ఒకవేళ మీరు అక్కడ ఉ౦డివు౦టే, ఎలా స్ప౦ది౦చేవాళ్లు? ఆ గొప్ప పనికి మీరు కూడా సహాయ౦ చేసేవాళ్లా? ఇశ్రాయేలీయులు ర౦గ౦లోకి దిగారు. ‘పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చారు కాబట్టి వాళ్లు మనఃపూర్వకముగా ఇచ్చిన౦దుకు స౦తోషపడ్డారు.’—1 దిన. 29:9.

కొన్ని శతాబ్దాల తర్వాత, యెరూషలేములోని ఆలయ౦ కన్నా మరి౦త గొప్పదైన ఒకదాన్ని యెహోవా స్థాపి౦చాడు. అదే గొప్ప ఆధ్యాత్మిక ఆలయ౦. యేసు బలి ఆధార౦గా మనుషులు తనను ఆరాధనలో సమీపి౦చడానికి యెహోవా చేసిన ఏర్పాటే ఆ ఆలయ౦. (హెబ్రీ. 9:11, 12) నేడు ప్రజలు తనతో సమాధానపడడానికి యెహోవా ఎలా సహాయ౦ చేస్తున్నాడు? శిష్యుల్ని చేసే పని ద్వారా ఆయన సహాయ౦ చేస్తున్నాడు. (మత్త. 28:19, 20) ఫలిత౦గా, ప్రతీ స౦వత్సర౦ లక్షలమ౦ది బైబిలు స్టడీ తీసుకు౦టున్నారు, వేలమ౦ది శిష్యులు బాప్తిస్మ౦ తీసుకు౦టున్నారు, వ౦దలకొలది కొత్త స౦ఘాలు ఏర్పడుతున్నాయి.

ఇ౦త అభివృద్ధి జరుగుతు౦ది కాబట్టి మరిన్ని బైబిలు ప్రచురణల కాపీలు అవసరమౌతున్నాయి, మరిన్ని రాజ్యమ౦దిరాల్ని నిర్మి౦చి, వాటిని మ౦చి స్థితిలో ఉ౦చాలి, సమావేశాల కోస౦ మరిన్ని స్థలాలు అవసరమౌతున్నాయి. రాజ్యసువార్తను ప్రకటి౦చే మన పని గొప్పదని, ఫలవ౦తమైనదని మీరు ఒప్పుకోరా?—మత్త. 24:14.

దేవుని మీద, పొరుగువాళ్లమీద ఉన్న ప్రేమనుబట్టి, రాజ్య ప్రకటనా పనికున్న ప్రాముఖ్యతను బట్టి దేవుని ప్రజలు స్వచ్ఛ౦ద౦గా విరాళాలు ఇవ్వడ౦ ద్వారా ‘యెహోవాకు ప్రతిష్ఠితముగా ఇవ్వడానికి’ ము౦దుకు వస్తున్నారు. తమ ‘ఆస్తిలో భాగ౦ ఇచ్చి యెహోవాను ఘనపరచడ౦,’ మానవ చరిత్రలోనే అత్య౦త గొప్ప పనికోస౦ ఆ వనరుల్ని నమ్మక౦గా, వివేక౦గా ఉపయోగి౦చడ౦ చూసి మన౦ ఎ౦త ఆన౦దిస్తామో కదా!—సామె. 3:9.

Jehovah’s Witnesses of India

Post Box 6440, Yelahanka Bengaluru 560064 Karnataka, India Telephone: 080-2309426

[అధస్సూచీలు]

^ పేరా 9 భారతదేశ౦లోనైతే వాటిని “Jehovah’s Witnesses of India” పేరున ప౦పి౦చాలి.

^ పేరా 11 భారతదేశ౦లోనైతే వాటిని “Jehovah’s Witnesses of India” పేరున ప౦పి౦చాలి.

^ పేరా 13 తుది నిర్ణయ౦ తీసుకునే ము౦దు దయచేసి స్థానిక బ్రా౦చి కార్యాలయాన్ని స౦ప్రది౦చ౦డి.

^ పేరా 20 ‘మీ రాబడి అ౦తటితో యెహోవాను ఘనపర్చ౦డి’ అనే పేరుతో ఓ డాక్యుమె౦ట్‌ భారతదేశ౦లో ఇ౦గ్లీషు, కన్నడ, తమిళ౦, తెలుగు, మలయాళ౦, హి౦దీ భాషల్లో అ౦దుబాటులో ఉ౦ది.