JW లైబ్రరీ
బైబిళ్లను డౌన్‌లోడ్ చేసుకోండి, ఉపయోగించండి—విండోస్
JW లైబ్రరీలో ఉన్న ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే, బైబిల్ని చదవడం, లోతుగా పరిశీలించడం.
బైబిళ్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఉపయోగించడానికి ఈ సూచనలు పాటించండి:
ఏదైనా ఓ బైబిల్ని డౌన్‌లోడ్ చేసుకోండి[ఆ అంశానికి కనెక్ట్ చేసే లింక్]
ఏదైనా ఓ బైబిల్ని డిలీట్ చేయండి[ఆ అంశానికి కనెక్ట్ చేసే లింక్]
ఏదైనా ఓ బైబిలుకు సంబంధించి అప్‌డేట్స్ పొందండి[ఆ అంశానికి కనెక్ట్ చేసే లింక్]
ఏదైనా ఓ బైబిల్ని డౌన్‌లోడ్ చేసుకోండి
ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు చదవుకోవడానికి వీలుగా, మీకు ఎన్ని బైబిళ్ల అనువాదాలు కావాలంటే, అన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బైబిలు అనే ట్యాబ్‌లో పుస్తకాలు అనే దానిమీద క్లిక్ చేస్తే, బైబిల్లోని పుస్తకాలు కనిపిస్తాయి.
యాప్ కమాండ్స్ సెక్షన్ (App Commands bar) తెరిచి, భాషలు అనే బటన్ క్లిక్ చేస్తే, అందుబాటులో ఉన్న అన్ని బైబిళ్లు కనిపిస్తాయి.మీరు ఏ భాషలోని బైబిల్ని ఎక్కువసార్లు తెరిచి చూస్తున్నారో, ఆ బైబిలు, ఆ లిస్టులో పైన కనిపిస్తుంది. మీకు ఏ భాష కావాలో, ఏ బైబిలు అనువాదం కావాలో, దానిపేరును టైప్ చేసి ఆ లిస్టులో వెదకవచ్చు. ఉదాహరణకు మీరు ఇంగ్లీషులోని కింగ్‌డమ్ ఇంటర్లీనియర్ అనే బైబిల్ని చూడాలనుకోండి. అప్పుడు “int” అని టైప్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు పోర్చుగీస్ భాషలో ఉన్న అన్ని బైబిళ్లు కావాలంటే, “port” అని టైప్ చేస్తే సరిపోతుంది.
మీరు ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని బైబిళ్ల దగ్గర మబ్బు గుర్తు ఉంటుంది. (cloud icon) దానిమీద క్లిక్ చేస్తే, ఆ బైబిలు డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకున్నాక, ఆ మబ్బు గుర్తు పోతుంది. ఇక డౌన్‌లోడ్ అయిన బైబిలు మీద క్లిక్ చేసి చదువుకోండి.
ఒకవేళ మీకు కావాల్సిన బైబిలు దాంట్లో కనిపించకపోతే, దయచేసి కొంతకాలం తర్వాత మళ్లీ ప్రయత్నించండి. కొత్త బైబిలు అనువాదాలు అందుబాటులోకి రాగానే, వాటిని చేరుస్తారు.
ఏదైనా ఓ బైబిల్ని డిలీట్ చేయండి
ఒకవేళ, మీకు ఏదైనా ఓ బైబిలు అనువాదం అవసరం లేదనిపిస్తే, లేదా మీ మొబైల్‌లో లేదా ట్యాబ్‌లో సరిపడా మెమరీ లేదనిపిస్తే, దాన్ని డిలీట్ చేసుకోవచ్చు.
స్క్రీన్‌పైన ఉన్న సెక్షన్‌లో, బైబిలు అనే ట్యాబ్‌మీద క్లిక్ చేసి, భాషలు అనే దానిమీద క్లిక్ చేయండి. అప్పుడు బైబిళ్ల లిస్టు కనిపిస్తుంది. మీరు ఏ బైబిల్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో, దానిపక్కన ఉన్న మరిన్ని (More) అనే బటన్ క్లిక్ చేసి డిలీట్ బటన్ క్లిక్ చేయండి.
ఏదైనా ఓ బైబిలుకు సంబంధించి అప్‌డేట్స్ పొందండి
మీరు డౌన్‌లోడ్ చేసుకున్న బైబిళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండవచ్చు.
అపడేట్ అయిన బైబిళ్ల దగ్గర రిఫ్రెష్ గుర్తు (refresh icon) ఉంటుంది. ఆ బైబిలు మీద క్లిక్ చేయగానే, దాని అప్‌డేట్ అయిన వర్షన్ అందుబాటులో ఉందని మెసేజ్ వస్తుంది. అప్‌డేట్ అయిన బైబిలు కావాలంటే డౌన్‌లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, వద్దు అనుకుంటే ఇప్పుడు కాదు (Later) అనే బటన్ మీద క్లిక్ చేయండి.
ఈ ఫీచర్స్ అన్నీ 2015, మార్చిలో విడుదలైన JW లైబ్రరీ 1.4 వర్షన్‌లో ఉన్నాయి. అది, విండోస్ 8.1 వర్షన్ లేదా ఆ తర్వాతి వర్షన్ ఉన్న మొబైల్స్‌లో లేదా ట్యాబ్స్‌లో పనిచేస్తుంది. ఈ ఫీచర్స్ మీకు రాకపోతే, దయచేసి “JW లైబ్రరీ—విండోస్ వర్షన్‌ని ఉపయోగించడం మొదలుపెట్టండి” అనే ఆర్టికల్‌లో కొత్త ఫీచర్స్ అనే అంశం కింద చూడండి.

