కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లైబ్రరీ

మీకు అనుకూలమైన సెటింగ్స్‌ పెట్టుకుని చదువుకోండి​—iOS

మీకు అనుకూలమైన సెటింగ్స్‌ పెట్టుకుని చదువుకోండి​—iOS

మీకు నచ్చిన సెటింగ్స్‌లో చదువుకోవడానికి వీలుగా, JW లైబ్రరీలో ఎన్నో ఫీచర్స్‌ ఉన్నాయి. మీరు ఏదైనా అధ్యాయాన్నిగానీ, ఆర్టికల్‌నిగానీ చదువుతున్నప్పుడు, స్క్రీన్‌ పైన కనిపించే నావిగేషన్‌ సెక్షన్‌లో ఆ ఫీచర్స్‌ ఉంటాయి.

మీకు ఇంకా ఫీచర్స్‌ కావాలంటే, నావిగేషన్‌ సెక్షన్‌లో మరిన్ని (More) అనే బటన్‌ క్లిక్‌ చేయండి.

మీకు నచ్చిన సెటింగ్స్‌లో చదువుకోవడానికి ఈ సూచనలు పాటించండి:

 భాషను ఎంచుకోండి

మీరు ఏదైనా అధ్యాయాన్నిగానీ, ఆర్టికల్‌నిగానీ చదువుతున్నప్పుడు, మీకు ఏ భాష కావాలో ఆ భాషను ఎంచుకోండి.

  • భాషలు అనే బటన్‌ మీద క్లిక్‌ చేస్తే, మీరు చదువుతున్న సమాచారం ఏయే భాషల్లో అందుబాటులో ఉందో, ఆ భాషల లిస్టు కనిపిస్తుంది. మీరు ఏ భాషను తరచూ వాడుతున్నారో, ఆ భాష ఆ లిస్టులో పైన కనిపిస్తుంది. కావాలంటే, ఏ భాష కావాలో టైప్‌ చేసి కూడా మీరు ఆ లిస్టులో వెదకవచ్చు.

  • మీరు ఇంకా డౌన్‌లోడ్‌ చేసుకోని భాషల దగ్గర మబ్బు గుర్తు (cloud icon) కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మీరు దానిమీద క్లిక్‌ చేస్తే సరిపోతుంది. డౌన్‌లోడ్‌ చేసుకున్నాక, ఆ మబ్బు గుర్తు పోతుంది. డౌన్‌లోడ్‌ చేసుకున్నదాని మీద క్లిక్‌ చేసి, ఆ భాషలోని ప్రచురణను చదువుకోవచ్చు.

 అక్షరాల సైజును ఎంచుకోండి

మీకు చదవడానికి అనుకూలంగా ఉండే అక్షరాల సైజును మీరు ఎంచుకోవచ్చు.

అక్షరాల సెటింగ్స్‌ (Text Settings) అనే బటన్‌మీద క్లిక్‌ చేసి, మీకు ఏ సైజు కావాలో ఎంచుకోండి. మీరు ఏ సైజును ఎంచుకుంటారో, యాప్‌లోని ప్రచురణలన్ని అదే సైజులో కనిపిస్తాయి.

 ఇమేజ్‌ వ్యూ లేదా టెక్స్‌ట్‌ వ్యూ ఎంచుకోండి

కొన్ని ఆర్టికల్స్‌ని ఇమేజ్‌ వ్యూలో చూడొచ్చు, మరికొన్నిటిని టెక్స్‌ట్‌ వ్యూలో చూడొచ్చు. మీకు ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూని ఎంచుకోవచ్చు.

  • ఇమేజ్‌ వ్యూ: ఇమేజ్‌ వ్యూలో, ఏదైనా ఓ ప్రచురణ ముద్రించబడిన తర్వాత ఎలా ఉంటుందో, అలా కనిపిస్తుంది. కొంతమంది పాటల పుస్తకాన్ని ఇమేజ్‌ వ్యూలో చూడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇమేజ్‌ వ్యూలో, పాడుతున్న లైన్ల దగ్గర మ్యూజిక్‌ నోట్స్‌ కూడా కనిపిస్తాయి.

  • టక్స్‌ట్‌ వ్యూ: టెక్స్‌ట్‌ వ్యూలో బైబిలు లేఖనాల్ని కూడా చూసుకోవచ్చు. వాటిమీద క్లిక్‌ చేయగానే మీరు ఎంచుకున్న అక్షరాల సైజులో లేఖనాలు కనిపిస్తాయి.

 వేరేవాటిలో తెరువు అనే ఆప్షన్‌ ఉపయోగించుకోండి

వేరేవాటిలో తెరువు అనే ఫీచర్‌ ద్వారా, మీరు వేరే యాప్స్‌లో కూడా JW లైబ్రరీలోని సమాచారాన్ని చదువుకోవచ్చు.

వేరేవాటిలో తెరువు అనే ట్యాబ్‌మీద క్లిక్‌ చేస్తే, అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఉదాహరణకు, ఆన్‌లైన్‌ లైబ్రరీలో తెరువు అనే బటన్‌ క్లిక్‌ చేస్తే, మీరు చదువుతున్న పేజీని, వాచ్‌టవర్‌ ఆన్‌లైన్‌ లైబ్రరీలో చూడవచ్చు.

 మీకు నచ్చిన బైబిల్లో లేఖనాలు చూసుకోండి

ఏదైనా ప్రచురణ చదువుతున్నప్పుడు అక్కడున్న లేఖనం మీద క్లిక్‌ చేయగానే, ఆ వచనం కనిపిస్తుంది. ఆ వచనం కింద ఉన్న కస్టమైజ్‌ (Customize) అనే బటన్‌ క్లిక్‌ చేసి, మీరు డౌన్‌లోడ్‌ చేసుకున్న బైబిళ్లలో ఏ బైబిలు కావాలో ఎంచుకోండి. ఆ లిస్టులో ఉన్న బైబిళ్లను పైకి కిందకి జరుపుకుని మీకు కావాల్సినట్లుగా వాటిని లైనులో పెట్టుకోండి.

మీకు కావాల్సిన బైబిల్ని లిస్టులో చేర్చుకోవడానికి చేర్చు (Add) అనే బటన్‌ క్లిక్‌ చేయండి. ఒకవేళ తీసివేయాలనుకుంటే, తీసివేయి (Remove) అనే బటన్‌ క్లిక్‌ చేయండి.ఆ లిస్టులో ఉన్న బైబిళ్లను పైకి కిందకి జరుపుకుని మీకు నచ్చినట్లుగా లైనులో పెట్టుకోండి.

JW లైబ్రరీలో మరిన్ని బైబిళ్లను ఎలా డౌన్‌లోడ్‌ చేయాలో తెలుసుకోవడానికి, “బైబిళ్లను డౌన్‌లోడ్‌ చేసుకోండి, ఉపయోగించండి—iOS” అనే అంశాన్ని చూడండి.

ఈ ఫీచర్స్‌ అన్ని 2015, ఫిబ్రవరిలో విడుదలైన JW లైబ్రరీ 1.4 వర్షన్‌లో ఉన్నాయి. iOS 6.0 వర్షన్‌గానీ, తర్వాతి వర్షన్‌గానీ ఉన్న మొబైల్‌ లేదా ట్యాబ్‌లో ఈ యాప్‌ పనిచేస్తుంది. ఒకవేళ ఈ ఫీచర్స్‌ మీకు కనిపించకపోతే, దయచేసి “JW లైబ్రరీ​—iOSని ఉపయోగించడం మొదలుపెట్టండి” అనే ఆర్టికల్‌లో కొత్త ఫీచర్స్‌ అనే అంశం కింద చూడండి.