కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లైబ్రరీ

JW Library ఉపయోగించడం మొదలుపెట్టండి—Android

JW Library ఉపయోగించడం మొదలుపెట్టండి—Android

JW లైబ్రరీకి స్వాగతం. బైబిల్ని చదవడానికి, లోతుగా పరిశీలించడానికి ఈ యాప్‌ని తయారుచేశారు. ఈ యాప్‌లోని ముఖ్యమైన ఫీచర్స్‌ కోసం, నావిగేషన్‌ సెక్షన్‌ ఓపెన్‌ చేయండి. దానికోసం మీ మొబైల్‌ లేదా ట్యాబ్‌ స్క్రీన్‌మీద ఎడమ నుండి కుడికి స్వైప్‌ చేయండి, లేదా పైన ఎడమవైపు ఉన్న మెన్యూ బటన్‌ క్లిక్‌ చేయండి.

 బైబిలు

బైబిలు అనే ట్యాబ్‌లో ఎన్నో బాషల్లో ఉన్న బైబిలు అనువాదాలు ఉంటాయి. బైబిల్లోని ఓ పుస్తకం మీద క్లిక్‌ చేయండి. తర్వాత ఏ అధ్యాయం కావాలో ఆ నంబర్‌మీద క్లిక్‌ చేయండి. మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు వాటి అధస్సూచిలు, రెఫరెన్సులు చూడవచ్చు. అంతేకాదు, లేఖనం మీద క్లిక్‌ చేస్తే, స్టడీ సెక్షన్‌ ఓపెన్‌ అవుతుంది. దాంట్లో వేర్వేరు బైబిలు అనువాదాలు ఆ వచనాన్ని ఎలా అనువదించాయో ఉంటుంది.

వేరే లేఖనాన్ని చూడాలనుకుంటే, నావిగేషన్‌ సెక్షన్‌ తెరిచి, బైబిలు అనే దానిమీద మళ్లీ క్లిక్‌ చేయండి. అప్పుడు బైబిల్లోని పుస్తకాలు కనిపిస్తాయి.

 ప్రచురణలు

ప్రచురణలు అనే ట్యాబ్‌లో రకరకాలు ప్రచురణలు, ఆడియో రికార్డింగ్‌లు, వీడియోలు ఉంటాయి. ఏదైనా ఓ ప్రచురణ మీద క్లిక్‌ చేసి, దాంట్లో ఓ ఆర్టికల్‌ చదవడం మొదలుపెట్టండి. ఆ ఆర్టికల్‌లో ఉన్న లేఖనాల్ని కూడా మీరు చదవవచ్చు. ఆ లేఖనం మీద క్లిక్‌ చేస్తే, స్టడీ సెక్షన్‌ ఓపెన్‌ అవుతుంది. స్టడీ సెక్షన్‌లో ఓపెన్‌ అయిన ఆ లేఖనం మీద క్లిక్‌ చేస్తే, నేరుగా అది బైబిల్లో ఓపెన్‌ అవుతుంది. ఒకవేవ వేరే ప్రచురణ ఏదైనా తెరవాలనుకుంటే, ప్రచురణలు అనే ట్యాబ్‌మీద క్లిక్‌ చేయండి.

వేరే ప్రచురణ చూడాలనుకుంటే, నావిగేషన్‌ సెక్షన్‌ తెరిచి, ప్రచురణలు అనే దానిమీద మళ్లీ క్లిక్‌ చేయండి. అప్పుడు ప్రచురణల లిస్టు కనిపిస్తుంది.

 దినవచనం

నావిగేషన్‌ సెక్షన్‌ తెరిచి దినవచనం అనే ట్యాబ్‌మీద క్లిక్‌ చేస్తే, ఆ రోజుకి సంబంధించిన దినవచనాన్ని చదవవచ్చు.

 ఆన్‌లైన్‌

నావిగేషన్‌ సెక్షన్‌లో ఆన్‌లైన్‌ అనే ట్యాబ్‌మీద క్లిక్‌ చేస్తే, మా అధికారిక వెబ్‌సైట్లకు కనెక్ట్‌ చేసే లింక్స్‌ ఓపెన్‌ అవుతాయి.

 కొత్త ఫీచర్స్‌

మీ మొబైల్‌ లేదా ట్యాబ్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ, JW లైబ్రరీ లేటెస్ట్‌ వర్షన్‌ని పొందండి.

మీ మొబైల్‌ లేదా ట్యాబ్‌కు సరిపోయే లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ వర్షన్‌ని రన్‌ చేయండి. మరింత సమాచారం కోసం ఈ లింక్‌ చూడండి: https://support.google.com/nexus/answer/4457705.

కావాలనుకుంటే, మీ మొబైల్‌ లేదా ట్యాబ్‌లో, యాప్స్‌ వాటంతటికవే అప్‌డేట్‌ అయ్యేలా సెట్‌ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఈ లింక్‌ చూడండి: https://support.google.com/googleplay/answer/113412.