JW లైబ్రరీ

JW లైబ్రరీ ఫీచర్లు

JW లైబ్రరీ ఫీచర్లు

బైబిల్ని బాగా చదవడానికి, వ్యక్తిగత అధ్యయనం చక్కగా చేయడానికి JW లైబ్రరీ యాప్‌ను a తయారు చేశారు. బైబిలు ఆధారంగా ఉండే పుస్తకాలు, వీడియోలు, ఆడియోలు డౌన్‌లోడ్‌ చేసుకుని ఎప్పుడైనా, ఎక్కడైనా చూడండి.

వేర్వేరు బైబిలు అనువాదాలు

  • దేవుని వాక్యాన్ని చదవండి, లేఖనాల్ని వందల భాషల్లో ఉన్న వేర్వేరు బైబిలు అనువాదాలతో పోల్చి చూడండి.

ప్రచురణల లైబ్రరీ

  • 1,000 కంటే ఎక్కువ భాషల్లో ఉన్న పుస్తకాలు, బ్రోషుర్‌లు, ఆర్టికల్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇందులో 100 కు పైగా సంజ్ఞా భాషలు కూడా ఉన్నాయి.

వీడియోలు, ఆడియోలు

  • బైబిలు ఆధారంగా ఉండే ప్రసంగాలు, డ్రామాలు, యానిమేషన్‌ వీడియోల్లాంటి రకరకాల ప్రోగ్రామ్‌లను ఆనందించండి.

సంగీతం

  • పాటలు, బృందగానాలు, ఇన్‌స్ట్రుమెంటల్‌ రికార్డింగ్‌లతో సహా వివిధ రకాల సంగీతాన్ని వినండి.

దినవచనం

  • ఒక బైబిలు వచనాన్ని, దాన్ని వివరించే కొన్ని మాటల్ని చదవండి. అలా ఉత్సాహాన్నిచ్చే మంచి ఆలోచనలతో మీ రోజును మొదలుపెట్టండి.

మీటింగ్స్‌

  • వారం మధ్యలో, వారం చివర్లో జరిగే మీటింగ్స్‌లో చర్చించే సమాచారాన్ని ఒకే చోట చూడండి.

సెర్చ్‌

  • బైబిలు వచనాల్ని, రకరకాల టాపిక్స్‌ని వెతకండి.

వ్యక్తిగత అధ్యయనం

  • సమాచారాన్ని హైలైట్‌ చేసుకోండి, నోట్స్‌ రాసుకోండి అలాగే టాపిక్‌ని బట్టి ట్యాగ్స్‌ పెట్టుకోండి.

ప్లేలిస్ట్‌లు

  • మీకు కావాల్సిన సంగీతం, వీడియోలు, ఆడియోలు అలాగే చిత్రాలతో ప్లేలిస్ట్‌లు తయారు చేసుకోండి.

a JW లైబ్రరీ యెహోవాసాక్షుల అధికారిక యాప్‌. దాన్ని యెహోవాసాక్షులే తయారుచేశారు.