కంటెంట్‌కు వెళ్లు

JW లైబ్రరీ సంజ్ఞా భాష

JW లైబ్రరీ సంజ్ఞా భాష ఫీచర్లు

JW లైబ్రరీ సంజ్ఞా భాష ఫీచర్లు

JW లైబ్రరీ సంజ్ఞా భాష యెహోవాసాక్షుల అధికారిక యాప్‌. ఇది jw.org నుండి సంజ్ఞా భాష వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి ఒక క్రమంలో చూసేందుకు ఉపయోగపడుతుంది.

సంజ్ఞా భాషలో బైబిలును, ఇతర ప్రచురణల వీడియోలను చూడండి. మీ ఫోన్‌ లేదా టాబ్‌లో ఇంటర్నెట్‌ వాడనప్పుడు కూడా ఈ వీడియోలను చూసేందుకు వీలుగా డౌన్‌లోడ్‌ చేసి ఉంచుకోవచ్చు. అందమైన చిత్రాలను, కావాల్సిన వీడియోను చేరుకోవడానికి ఉన్న ఆప్షన్లను, సులభంగా ఉపయోగించగల వీడియో ప్లేయర్‌ ఆప్షన్లను ఉపయోగిస్తూ ఆనందించండి.

కావాల్సినదాన్ని సులభంగా చేరుకునే విధానం

నూతనలోక అనువాదములో విడుదలైన ఒక్కో పుస్తకాన్ని విడివిడిగా చూడగలిగే అవకాశం బైబిలు పేజీ మీకు కల్పిస్తుంది. నూతనలోక అనువాదములో విడుదల కాకపోయినా, ఇతర ప్రచురణల్లో తెలియజేసిన కొన్ని వచనాలను కూడా మీరు చూడగలరు. jw.org వెబ్‌సైట్‌లో ఉన్న ఇతర ప్రచురణలను, చిత్రాలను లైబ్రరీ పేజీ మీకు చూపిస్తుంది.

ఇచ్చిన లేఖనాలను త్వరగా చూసేందుకు

మీరు ఏదైనా వీడియోను చూసేటప్పుడు, అక్కడ ఇచ్చిన లేఖనాన్ని చూడాలనుకుంటే బైబిలు అనే బటన్‌ను తాకండి. అప్పుడు, ఆ లేఖనాన్ని చూసేందుకు వీలుగా వీడియో కాసేపు ఆగుతుంది. తర్వాత లైబ్రరీ పేజీకి వెళ్తే మిగిలిన వీడియోని చూడగలుగుతారు.

వీడియోలను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోండి

మీరు డౌన్‌లోడ్‌ చేసుకోని వీడియోలు తక్కువ కాంతి ఉండే రంగుల్లో కనబడతాయి. jw.org నుండి వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఆ వీడియోను వేలితో తాకండి. ఆ పేజీలో ఉన్న అన్ని వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు డౌన్‌లోడ్‌ ఆల్‌ బటన్‌ను తాకండి. మీ ఫోన్‌ లేదా టాబ్‌ నుండి ఓ వీడియోను తీసివేసేందుకు ఆ వీడియో మీద వేలు పెట్టి అలాగే కాసేపు నొక్కి ఉంచండి.

మెమరీని చక్కగా ఉపయోగించుకోండి

మీరు పెద్ద వీడియోలు (ఎక్కువ-క్వాలిటీ) లేదా చిన్న వీడియోలు(తక్కువ-క్వాలిటీ) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ ఫోన్‌ లేదా టాబ్‌లో మెమరీ కార్డు పెట్టుకునే వీలుంటే, వీడియోలను మీ ఫోన్‌ లేదా టాబ్‌లోకి గానీ మెమరీ కార్డ్‌లోకి గానీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

సులభంగా-ఉపయోగించగల వీడియో ప్లేయర్‌

వీడియో ప్లేబాక్‌ను కంట్రోల్‌ చేసేందుకు ఈ చిన్నచిన్న గుర్తులను ఉపయోగించుకోండి:

  • వేలితో రెండుసార్లు తాకండి: వీడియోని చూడడానికి లేక కాసేపు ఆపడానికి.

  • ఎడమవైపుకు స్వైప్‌ చేయండి: తర్వాతి భాగానికి వెళ్లేందుకు.

  • కుడివైపుకు స్వైప్‌ చేయండి: ముందటి భాగానికి వెళ్లేందుకు.

  • పైకి స్వైప్‌ చేయండి: వీడియో స్పీడ్‌ను పెంచేందుకు. (యాండ్రాయిడ్‌లో ఇది లభ్యం కాదు.)

  • కిందికి స్వైప్‌ చేయండి: వీడియో స్పీడ్‌ను తగ్గించేందుకు. (యాండ్రాయిడ్‌లో ఇది లభ్యం కాదు.)

  • వేలితో ఒక్కసారి తాకండి: ప్లేయర్‌ ఆప్షన్లను చూసేందుకు లేక దాచేందుకు.

సహాయం

మీకు JW లైబ్రరీ సంజ్ఞా భాషతో ఏదైనా సమస్య ఉంటే ఆన్‌లైన్‌ హెల్ప్‌ ఫారమ్‌ను నింపి పంపించండి.