కంటెంట్‌కు వెళ్లు

రోకు ప్లేయర్‌లో JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూడడం

రోకు ప్లేయర్‌లో JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూడడం

JW బ్రాడ్‌కాస్టింగ్‌ అనేది కుటుంబమంతా కలిసి చూడగల ఆన్‌లైన్‌ టీవీ. దేవునితో మనకున్న స్నేహాన్ని పెంచుకోవడానికి ఇది సహాయం చేస్తుంది. JW బ్రాడ్‌కాస్టింగ్‌ స్టూడియోలో తయారు చేసిన కార్యక్రమాలను, అలాగే jw.org వెబ్‌సైట్‌లో నుండి ఎంపిక చేసిన వీడియోలను ఇందులో మీరు చూడవచ్చు. మా స్ట్రీమింగ్‌ ఛానెళ్లలో 24 గంటలూ ప్రసారం చేయబడే వీడియోలను మీరు చూడవచ్చు లేదా వీడియో ఆన్‌ డిమాండ్‌ అనే ఫీచర్‌ను ఉపయోగించి మీకు నచ్చిన వీడియోను ఏ సమయంలోనైనా చూడవచ్చు. ఆడియో విభాగంలో, మ్యూజిక్‌, డ్రామా ప్రొడక్షన్‌లు, నాటకరూపంలో సాగే బైబిలు పఠనాలతోపాటు ఎన్నో రకాల ఆడియో కార్యక్రమాలను మీరు వినవచ్చు.

వీటన్నిటిని మీ కంప్యూటర్‌, టాబ్లెట్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌లో tv.jw.orgలో చూసి ఆనందించండి. లేదా రోకు (Roku) డిజిటల్‌ మీడియా ప్లేయర్‌ సహాయంతో మీ టీవీలో చూడండి.

 

ఈ భాగంలో

రోకు ప్లేయర్‌లో JW బ్రాడ్‌కాస్టింగ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం

రోకు ఛానెల్‌ను సెటప్‌ చేసుకొని, JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూడాలంటే ఈ నిర్దేశాలను పాటించండి.

రోకు ప్లేయర్‌లో వీడియోలు చూడండి

ఒక వీడియోను ఎంచుకొని, వీడియో ప్లేబ్యాక్‌ ఆప్షన్‌లను ఉపయోగిస్తూ, కొత్తగా వచ్చిన లేదా ప్రత్యేక వీడియోలను చూడండి.

రోకు ప్లేయర్‌లో ఆడియో వినండి

ఒక ఆడియో కార్యక్రమాన్ని లేదా పూర్తి కలెక్షన్‌ని వినండి. ఆడియో ప్లేబ్యాక్‌ ఆప్షన్లు ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.

తరచూ అడిగే ప్రశ్నలు​—JW బ్రాడ్‌కాస్టింగ్‌(Roku)

ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొందండి.