కావలికోట లైబ్రరీ

తరచూ అడిగే ప్రశ్నలు​—కావలికోట లైబ్రరీ

తరచూ అడిగే ప్రశ్నలు​—కావలికోట లైబ్రరీ

కావలికోట లైబ్రరీ పని చేయాలంటే, మీ డెస్క్‌టాప్‌లో లేదా లాప్‌టాప్‌లో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10 గానీ, దాని తర్వాతి వర్షన్స్‌ గానీ ఉండాలి. ఒకవేళ మీ కంప్యూటర్‌లో ARM ప్రాసెసర్‌ ఉన్నట్లయితే, విండోస్‌ 11 ఉండాలి.

కావలికోట లైబ్రరీ ఏ ఇబ్బంది లేకుండా సరిగ్గా పని చేయాలంటే, కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం మంచిది. ఒకవేళ అప్‌డేట్‌ చేసుకోలేకపోతే కావలికోట లైబ్రరీ పనిచేయకపోవచ్చు.

 

కావలికోట లైబ్రరీ అప్‌డేట్‌ అవ్వట్లేదని మీకు పదేపదే మెసేజ్‌ వస్తుంటే, దాన్ని మీరే సొంతగా అప్‌డేట్‌ చేసుకోవడానికి ఇలా చేసి చూడండి:

  1. ఉన్న కావలికోట లైబ్రరీని అప్‌డేట్‌ చేసుకోండి అనే పేజీకి వెళ్లండి.

  2. మీ భాషలో కావలికోట లైబ్రరీ అప్‌డేట్‌ ప్యాకేజీని డౌన్‌లోడ్‌ చేయండి.

  3. “అప్‌డేట్‌ ప్యాకేజీని ఇన్‌స్టాల్‌ చేయండి” కింద ఇచ్చిన సూచనల్ని పాటించండి.

అయినా అప్‌డేట్‌ అవ్వకపోతే, ఇలా చేసి చూడండి:

  1. ఫైలు ఎక్స్‌ప్లోరర్‌లో “C:\ProgramData\Watchtower\WTLibrary” ఫోల్డర్‌ తెరవండి.

  2. ఈ రెండు ఫైల్స్‌ని డిలీట్‌ చేయండి:

    • a. ca-bundle.zip

    • b. cert.pem

పైన చెప్పినవాటిని చేయడం మీకు కష్టంగా అనిపిస్తే, కావలికోట లైబ్రరీ గురించి బాగా తెలిసినవాళ్లను సహాయం చేయమని అడగండి. లేదంటే, దగ్గర్లో ఉన్న బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

 

కావలికోట లైబ్రరీ గురించి బాగా తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే, వాళ్లను సహాయం చేయమని అడగండి. లేదంటే, దగ్గర్లో ఉన్న బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.