కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట లైబ్రరీ

కావలికోట లైబ్రరీని అప్‌డేట్‌ చేసుకోండి

కావలికోట లైబ్రరీని అప్‌డేట్‌ చేసుకోండి

ఆన్‌లైన్‌ అప్‌డేట్స్‌ ఆటోమేటిగ్గా తెలిసేలా మీరు కావలికోట లైబ్రరీలో సెట్‌ చేసుకోవచ్చు, లేదా అప్‌డేట్‌ ప్యాకేజీ ఫైల్‌ ఉపయోగించి సొంతగా కావలికోట లైబ్రరీలో ప్రచురణల్ని, ఆర్టికల్స్‌ని అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

అప్‌డేట్స్‌ ఆటోమేటిగ్గా తెలిసేలా సెట్‌ చేసుకోండి

ఏదైనా ప్రచురణ కొత్తగా వచ్చినా, ఆర్టికల్స్‌ అప్‌డేట్‌ అయినా తెలిసేలా కావలికోట లైబ్రరీలో ఇలా సెట్‌ చేసుకోండి:

  1. కావలికోట లైబ్రరీలో లైబ్రరీ మెనూ తెరవండి, దాంట్లో ప్రాపర్టీస్‌ మీద క్లిక్‌ చేస్తే లైబ్రరీ ప్రాపర్టీస్‌ అనే విండో తెరుచుకుంటుంది.

  2. లైబ్రరీ ప్రాపర్టీస్‌ విండోలో అప్‌డేట్స్‌ అనే ట్యాబ్‌ మీద క్లిక్‌ చేసి, అప్‌డేట్స్‌ ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్‌ చేయి అనే బాక్సు దగ్గర టిక్కు కొట్టండి.

  3. ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ వచ్చినప్పుడు, దాన్ని డౌన్‌లోడ్‌ చేయమంటారా అనే ప్రశ్న కనిపిస్తుంది. అప్పుడు Yes మీద క్లిక్‌ చేస్తే, కావలికోట లైబ్రరీ దానంతటదే డౌన్‌లోడ్‌ అయ్యి అప్‌డేట్‌ అవుతుంది.

కావలికోట లైబ్రరీని సొంతగా అప్‌డేట్‌ చేసుకోండి

అప్‌డేట్‌ ప్యాకేజీ ఫైల్‌ని ఉపయోగించి మీరు సొంతగా కావలికోట లైబ్రరీని అప్‌డేట్‌ చేసుకోవచ్చు. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్యాకేజీ పొందడానికి, ఇప్పటికే అప్‌డేట్‌ అయిన కావలికోట లైబ్రరీ నుండి ఎక్స్‌పోర్ట్‌ చేయండి, లేదా ఈ పేజీలో ఉన్న బటన్‌ మీద క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోండి.

అప్‌డేట్‌ ప్యాకేజీని ఎక్స్‌పోర్ట్‌ చేయండి

అప్‌డేట్‌ ప్యాకేజీని క్రియేట్‌ చేయడానికి ఇలా చేయండి:

  1. కావలికోట లైబ్రరీలో హెల్ప్‌ మెనూ తెరవండి, దాంట్లో సొంతగా అప్‌డేట్‌ చేసుకోవడం మీద క్లిక్‌ చేసి, అప్‌డేట్‌ ప్యాకేజీ క్రియేట్‌ చేయి మీద క్లిక్‌ చేయండి.

  2. ఆ అప్‌డేట్‌ ప్యాకేజీ ఫైల్‌ని మీ కంప్యూటర్‌లో ఎక్కడ సేవ్‌ చేయాలో ఎంచుకుని, సేవ్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయండి. అప్పుడు కావలికోట లైబ్రరీ ఒక అప్‌డేట్‌ ప్యాకేజీ ఫైల్‌ని క్రియేట్‌ చేస్తుంది. ఆ ఫైల్‌కి చివర్లో “.updatepkg” అని ఉంటుంది.

అప్‌డేట్‌ ప్యాకేజీని డౌన్‌లోడ్‌ చేయండి

కింద ఉన్న బటన్‌ క్లిక్‌ చేసి, కావలికోట లైబ్రరీకి మీ భాషలో ఏదైనా అప్‌డేట్‌ వచ్చిందేమో చూడండి. ఒకవేళ వస్తే, సూచనలు పాటిస్తూ ఆ ఫైల్‌ని మీ కంప్యూటర్‌లో సేవ్‌ చేసుకోండి.

అప్‌డేట్‌ ప్యాకేజీని ఇన్‌స్టాల్‌ చేయండి

అప్‌డేట్‌ ప్యాకేజీని ఉపయోగించి కావలికోట లైబ్రరీని సొంతగా అప్‌డేట్‌ చేయడానికి ఇలా చేయండి:

  1. కావలికోట లైబ్రరీలో హెల్ప్‌ మెనూ తెరవండి, దాంట్లో సొంతగా అప్‌డేట్‌ చేసుకోవడం మీద క్లిక్‌ చేసి, అప్‌డేట్‌ చేయి మీద క్లిక్‌ చేయండి.

  2. అప్పుడు తెరుచుకునే ఫైల్‌-ఎక్స్‌ప్లోరర్‌ విండోలో, “.updatepkg” అని చివర్లో ఉన్న ఫైల్‌ దగ్గరికి వెళ్లండి. ఆ ఫైల్‌ని సెలెక్ట్‌ చేసి ఓపెన్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే, కావలికోట లైబ్రరీలో అప్‌డేట్స్‌ ఇన్‌స్టాల్‌ అవుతాయి.