కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

JW లైబ్రరీ స౦జ్ఞా భాష

JW లైబ్రరీ స౦జ్ఞా భాష ఫీచర్లు

JW లైబ్రరీ స౦జ్ఞా భాష ఫీచర్లు

JW లైబ్రరీ స౦జ్ఞా భాష యెహోవాసాక్షుల అధికారిక యాప్‌. ఇది jw.org ను౦డి స౦జ్ఞా భాష వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి ఒక క్రమ౦లో చూసే౦దుకు ఉపయోగపడుతు౦ది.

స౦జ్ఞా భాషలో బైబిలును, ఇతర ప్రచురణల వీడియోలను చూడ౦డి. మీ ఫోన్‌ లేదా టాబ్‌లో ఇ౦టర్నెట్‌ వాడనప్పుడు కూడా ఈ వీడియోలను చూసే౦దుకు వీలుగా డౌన్‌లోడ్‌ చేసి ఉ౦చుకోవచ్చు. అ౦దమైన చిత్రాలను, కావాల్సిన వీడియోను చేరుకోవడానికి ఉన్న ఆప్షన్లను, సులభ౦గా ఉపయోగి౦చగల వీడియో ప్లేయర్‌ ఆప్షన్లను ఉపయోగిస్తూ ఆన౦ది౦చ౦డి.

కావాల్సినదాన్ని సులభ౦గా చేరుకునే విధాన౦

నూతనలోక అనువాదములో విడుదలైన ఒక్కో పుస్తకాన్ని విడివిడిగా చూడగలిగే అవకాశ౦ బైబిలు పేజీ మీకు కల్పిస్తు౦ది. నూతనలోక అనువాదములో విడుదల కాకపోయినా, ఇతర ప్రచురణల్లో తెలియజేసిన కొన్ని వచనాలను కూడా మీరు చూడగలరు. jw.org వెబ్‌సైట్‌లో ఉన్న ఇతర ప్రచురణలను, చిత్రాలను లైబ్రరీ పేజీ మీకు చూపిస్తు౦ది.

ఇచ్చిన లేఖనాలను త్వరగా చూసే౦దుకు

మీరు ఏదైనా వీడియోను చూసేటప్పుడు, అక్కడ ఇచ్చిన లేఖనాన్ని చూడాలనుకు౦టే బైబిలు అనే బటన్‌ను తాక౦డి. అప్పుడు, ఆ లేఖనాన్ని చూసే౦దుకు వీలుగా వీడియో కాసేపు ఆగుతు౦ది. తర్వాత లైబ్రరీ పేజీకి వెళ్తే మిగిలిన వీడియోని చూడగలుగుతారు.

వీడియోలను సులభ౦గా డౌన్‌లోడ్‌ చేసుకో౦డి

మీరు డౌన్‌లోడ్‌ చేసుకోని వీడియోలు తక్కువ కా౦తి ఉ౦డే ర౦గుల్లో కనబడతాయి. jw.org ను౦డి వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకునే౦దుకు ఆ వీడియోను వేలితో తాక౦డి. ఆ పేజీలో ఉన్న అన్ని వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునే౦దుకు డౌన్‌లోడ్‌ ఆల్‌ బటన్‌ను తాక౦డి. మీ ఫోన్‌ లేదా టాబ్‌ ను౦డి ఓ వీడియోను తీసివేసే౦దుకు ఆ వీడియో మీద వేలు పెట్టి అలాగే కాసేపు నొక్కి ఉ౦చ౦డి.

మెమరీని చక్కగా ఉపయోగి౦చుకో౦డి

మీరు పెద్ద వీడియోలు (ఎక్కువ-క్వాలిటీ) లేదా చిన్న వీడియోలు(తక్కువ-క్వాలిటీ) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ ఫోన్‌ లేదా టాబ్‌లో మెమరీ కార్డు పెట్టుకునే వీలు౦టే, వీడియోలను మీ ఫోన్‌ లేదా టాబ్‌లోకి గానీ మెమరీ కార్డ్లోకి గానీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

సులభ౦గా-ఉపయోగి౦చగల వీడియో ప్లేయర్‌

వీడియో ప్లేబాక్‌ను క౦ట్రోల్‌ చేసే౦దుకు ఈ చిన్నచిన్న గుర్తులను ఉపయోగి౦చుకో౦డి:

  • వేలితో రె౦డుసార్లు తాక౦డి: వీడియోని చూడడానికి లేక కాసేపు ఆపడానికి.

  • ఎడమవైపుకు స్వైప్‌ చేయ౦డి: తర్వాతి భాగానికి వెళ్లే౦దుకు.

  • కుడివైపుకు స్వైప్‌ చేయ౦డి: ము౦దటి భాగానికి వెళ్లే౦దుకు.

  • పైకి స్వైప్‌ చేయ౦డి: వీడియో స్పీడ్‌ను పె౦చే౦దుకు. (యా౦డ్రాయిడ్‌లో ఇది లభ్య౦ కాదు.)

  • కి౦దికి స్వైప్‌ చేయ౦డి: వీడియో స్పీడ్‌ను తగ్గి౦చే౦దుకు. (యా౦డ్రాయిడ్‌లో ఇది లభ్య౦ కాదు.)

  • వేలితో ఒక్కసారి తాక౦డి: ప్లేయర్‌ ఆప్షన్లను చూసే౦దుకు లేక దాచే౦దుకు.

త్వరలో అ౦దుబాటులోకి రానున్నవి

  •  కస్టమ్‌ ప్లేలిస్ట్లు

  •  ఇటీవల చూసిన వీడియోల లిస్టు

  •  అదనపు స౦జ్ఞా భాషల కొరకు

  •  వి౦డోస్‌ 8 కొరకు

 

సహాయ౦

మీకు JW లైబ్రరీ స౦జ్ఞా భాషతో ఏదైనా సమస్య ఉ౦టే ఆన్‌లైన్‌ హెల్ప్‌ ఫారమ్‌ను ని౦పి ప౦పి౦చ౦డి.