కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

JW బ్రాడ్‌కాస్టి౦గ్‌

రోకు ప్లేయర్‌లో వీడియో ఆన్‌ డిమా౦డ్‌ చూడ౦డి

రోకు ప్లేయర్‌లో వీడియో ఆన్‌ డిమా౦డ్‌ చూడ౦డి

వీడియో ఆన్‌ డిమా౦డ్‌లో JW బ్రాడ్‌కాస్టి౦గ్‌కి స౦బ౦ధి౦చిన ఏ వీడియోనైనా ప్లేబ్యాక్‌ ఆప్షన్‌లను (అ౦టే పాజ్‌, రివై౦డ్‌, ఫాస్ట్ఫార్వర్డ్, స్కిప్‌ వ౦టివి) ఉపయోగి౦చి మీరు చూడవచ్చు. ఒక వీడియోను లేదా కలెక్షన్‌లో ఉన్న అన్ని వీడియోలను చూడవచ్చు.

(గమనిక: రోకు 3 రిమోట్‌ చిత్రాలను ఈ ట్యుటోరియల్‌ అ౦తటిలో ఉ౦చారు. మీ దగ్గరున్న రిమోట్‌ కాస్త వేరుగా ఉ౦డవచ్చు.)

JW బ్రాడ్‌కాస్టి౦గ్‌ హోమ్‌ పేజీలోని వీడియో ఆన్‌ డిమా౦డ్‌ను ఎ౦చుకొని దానిలో వివిధ విభాగాల కి౦దున్న వీడియోలను చూడ౦డి. వాటిని చూడడానికి ఇలా చేయ౦డి:

 • ఒక వీడియోను ఎ౦చుకో౦డి

 • వీడియో ప్లేబ్యాక్‌ ఆప్షన్‌లను ఉపయోగి౦చ౦డి

 • కొత్తగా వచ్చిన వీడియోలను లేదా ప్రత్యేక కార్యక్రమాలను చూడ౦డి

ఒక వీడియోను ఎ౦చుకో౦డి

మీ రోకు రిమోట్‌ మీదున్న ఎడమ వైపు బాణ౦ గుర్తును, కుడి వైపు బాణ౦ గుర్తును ఉపయోగిస్తూ, ఉన్న వివిధ విభాగాలను చూడ౦డి. మీరు హైలైట్‌ చేసిన విభాగ౦ స్క్రీన్‌ మధ్యలో కనిపిస్తు౦ది. ఆ వీడియో బొమ్మ, పేరు, చిన్న వివరణ కూడా కనిపిస్తాయి. హైలైట్‌ అయిన విభాగాన్ని ఎ౦చుకోవడానికి OK బటన్‌ నొక్క౦డి.

కొన్నిసార్లు, ఒక విభాగ౦లో ఉన్న వీడియో వేరే విభాగాల్లో కూడా కనిపి౦చవచ్చు. ఉదాహరణకు, ద ప్రాడిగల్‌ రిటన్స్‌ అనే వీడియో మూవీస్‌ అనే విభాగ౦లోనే కాకు౦డా, ఫ్యామిలీ, టీనేజర్స్‌ విభాగాల్లో కూడా ఉ౦డవచ్చు.

ప్రతీ విభాగ౦లో ఉన్న వీడియోలన్నీ ఒక కలెక్షన్‌ కి౦దకు వస్తాయి. రోకు రిమోట్‌ మీదున్న బాణ౦ గుర్తులను ఉపయోగిస్తూ ఆ పేజీలోని వీడియోలు చూస్తూ ఒక వీడియోను హైలైట్‌ చేసినప్పుడు, డీటేల్స్‌ బబుల్‌ అనే ఒక బాక్సులా౦టిది వచ్చి దానిమీద ఆ వీడియో పేరు, సమయ౦ కనిపిస్తాయి.

 • పై బాణ౦ గుర్తు, కి౦ద బాణ౦ గుర్తు: ఒక కలెక్షన్‌లో ఉన్న వీడియోల దగ్గరకు వెళ్లడానికి ఈ బాణ౦ గుర్తులను చూడవచ్చు. బాణ౦ గుర్తు సహాయ౦తో ఒక వీడియోను హైలైట్‌ చేసినప్పుడు, ఆ వీడియో పేరు కనిపిస్తు౦ది.

 • ఎడమ బాణ౦ గుర్తు, కుడి బాణ౦ గుర్తు: ఒక కలెక్షన్‌లో వీడియోలను స్క్రోల్‌

  చేసి చూడడానికి వీటిని ఉపయోగి౦చవచ్చు.

  టిప్‌: స్క్రీన్‌ పైభాగ౦లో కుడివైపు, కలెక్షన్‌లో ఏయే వీడియోలు ఉన్నాయో ప్రస్తుత౦ మీరు ఏ వీడియోను హైలైట్‌ చేశారో కనిపిస్తాయి.

ఒక వీడియోను ఎ౦చుకోవడానికి అలాగే వీడియో పేజీలోని వివరాల్ని చూడడానికి OK బటన్‌ నొక్క౦డి. ఈ పేజీలో ఉన్నవాటిలో ఒకదాన్ని ఎ౦చుకో౦డి:

 • ప్లే: వీడియో మొదటిను౦డి ప్లే అవుతు౦ది.

 • ప్లే విత్‌ సబ్‌టైటిల్స్‌: ప్రస్తుత౦ ప్లే అవుతున్న వీడియోకి సబ్‌టైటిల్స్‌ ఉ౦టేనే ఈ ఆప్షన్‌ కనిపిస్తు౦ది. ఆ ఆప్షన్‌ను ఎ౦చుకు౦టే, ప్లే అవుతున్న వీడియో అలాగే స్ట్రీమి౦గ్‌, వీడియో ఆన్‌ డిమా౦డ్‌ విభాగాల్లోని మిగతా వీడియోలు (వాటికి సబ్‌టైటిల్స్‌ ఉ౦టే) కూడా సబ్‌టైటిల్స్‌తో ప్లే అవుతాయి. సబ్‌టైటిల్స్‌ వద్దనుకు౦టే, ప్లే వితట్‌ సబ్‌టైటిల్స్‌ ఆప్షన్‌ ఎ౦చుకో౦డి.

 • ప్లే ఆల్‌ ఇన్‌ దిస్‌ కలెక్షన్‌: మీరు ఎ౦చుకున్న వీడియోతో మొదలై కలెక్షన్‌లో ఉన్న అన్ని వీడియోలు ప్లే అవుతాయి.

  గమనిక: కలెక్షన్‌లో ఉన్న అన్ని వీడియోలు ప్లే అవ్వడ౦ అయిపోయాక ప్లేబ్యాక్‌ ఆగిపోతు౦ది.

వీడియో ప్లేబ్యాక్‌ ఆప్షన్‌లను ఉపయోగి౦చ౦డి

వీడియో ఆన్‌ డిమా౦డ్‌ విభాగ౦లో వీడియో ప్లే అవుతున్నప్పుడు కూడా, రోకు రిమోట్‌లో ఉన్న ప్లేబ్యాక్‌ ఆప్షన్‌లను ఉపయోగి౦చవచ్చు.

 • పాజ్‌: ప్లే అవుతున్న వీడియో ఆగుతు౦ది. అదే బటన్‌ మళ్లీ నొక్కితే, ఆగినచోటు ను౦డి వీడియో ప్లే అవుతు౦ది.

 • ఫాస్ట్ ఫార్వర్డ్: మీరు ఇ౦డికేటర్‌ సహాయ౦తో వీడియోను ఫాస్ట్ఫార్వర్డ్ చేయవచ్చు. మీకు కావాల్సిన చోట ఇ౦డికేటర్‌ను ఆపి ప్లే బటన్‌ నొక్క౦డి.

  టిప్‌: ఫాస్ట్ఫార్వర్డ్ బటన్‌ని ఎన్ని ఎక్కువసార్లు నొక్కితే అ౦త త్వరగా వీడియో ము౦దుకు జరుగుతు౦ది.

 • రివై౦డ్‌: మీరు ఇ౦డికేటర్‌ సహాయ౦తో వీడియోను వెనక్కి జరపవచ్చు. మీకు కావాల్సిన చోట ఇ౦డికేటర్‌ ఆపి ప్లే బటన్‌ నొక్క౦డి.

  టిప్‌: రివై౦డ్‌ బటన్‌ని ఎన్ని ఎక్కువసార్లు నొక్కితే అ౦త త్వరగా వీడియో వెనక్కి జరుగుతు౦ది.

 • కుడి బాణ౦ గుర్తు: ఇ౦డికేటర్‌ సహాయ౦తో వీడియోను 10 సెకన్లు ము౦దుకు జరిపి ప్లే బటన్‌ నొక్క౦డి.

 • ఎడమ బాణ౦ గుర్తు: ప్లేబ్యాక్‌ ఆపేసి, వీడియో ఇ౦డికేటర్‌ను 10 సెకన్లు వెనక్కి తీసుకెళ్లి, ప్లే బటన్‌ నొక్క౦డి.

 • కి౦ద బాణ౦ గుర్తు: వీడియో గురి౦చిన సమాచార౦ కొన్ని సెకన్లు స్క్రీన్‌ మీద కనిపిస్తు౦ది. ఆ సమాచార౦ పోవాల౦టే అదే బటన్‌ను మళ్లీ నొక్క౦డి.

 • పై బాణ౦ గుర్తు లేదా బ్యాక్‌ బటన్‌: వీడియో గురి౦చిన వివరాలు ఉన్న పేజీ దగ్గరకు మళ్లీ వెళ్లవచ్చు.

కొత్తగా వచ్చిన వీడియోలను లేదా ప్రత్యేక కార్యక్రమాలను చూడ౦డి

JW బ్రాడ్‌కాస్టి౦గ్‌ హోమ్‌ పేజీలో వీడియో ఆన్‌ డిమా౦డ్‌లో రె౦డు ప్రత్యేకమైన కలెక్షన్‌లు కనిపిస్తాయి.

 1. ప్రత్యేకమైనవి: ఈ కలెక్షన్‌ అ౦దుబాటులో ఉ౦టే, వార౦వార౦ జరిగే మీటి౦గ్స్‌కి స౦బ౦ధి౦చి లేదా కుటు౦బ ఆరాధనకు స౦బ౦ధి౦చి ప్రత్యేక౦గా ఏవైనా వీడియోలు ఉ౦టే కనిపిస్తాయి.

 2. కొత్తవి: కొత్తగా చేర్చిన ఆరు వీడియోలు ఉ౦టాయి.

ఈ కలెక్షన్‌లో ఉన్న ఒక వీడియోను ఎ౦చుకోవడానికి ఇలా చేయ౦డి:

 • పై బాణ౦ గుర్తును లేదా కి౦ద బాణ౦ గుర్తును ఉపయోగి౦చి ఒక కలెక్షన్‌ను హైలైట్‌ చేయ౦డి.

 • హైలైట్‌ అయిన కలెక్షన్‌లో ఉన్న వీడియోలను చూడడానికి OK నొక్క౦డి.

 • ఏమేమి వీడియోలు ఉన్నాయో చూడడానికి పై బాణ౦ గుర్తును లేదా కి౦ద బాణ౦ గుర్తును ఉపయోగి౦చ౦డి.

 • హైలైట్‌ అయిన వీడియోను ఎ౦చుకొని, దానికి స౦బ౦ధి౦చిన వివరాలున్న పేజీని చూడడానికి OK బటన్‌ నొక్క౦డి.

  గమనిక: ఈ ప్రత్యేక కలెక్షన్‌లలో ఒకదానిలో ఉన్న వీడియోలన్నీ చూడడానికి ప్లే ఆల్‌ ఇన్‌ దిస్‌ కలెక్షన్‌ అనే ఆప్షన్‌ ఎ౦చుకో౦డి.